రక్షణ మంత్రిత్వ శాఖ
జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి భారత పర్యటన
Posted On:
10 DEC 2020 5:24PM by PIB Hyderabad
జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి (సీవోఎస్-జేఏఎస్‌డీఎఫ్) జనరల్ ఇజుసు షుంజీ భారత పర్యటన కోసం బుధవారం విచ్చేశారు. భారత వైమానిక దళాధిపతి (సీఏఎస్) ఆర్.కె.ఎస్. భాదురియా ఆహ్వానం మేరకు ఆయన వచ్చారు. పర్యటనలో భాగంగా, రక్షణ శాఖ కార్యాలయంలో మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. త్రివిధ దళాల అత్యున్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గౌరవ వందనంతో, వైమానిక దళ ప్రధాన కార్యాలయంలోకి సీవోఎస్-జేఏఎస్‌డీఎఫ్‌కు ఆహ్వానం లభించింది. భారత్, జపాన్ మధ్య రక్షణ ఒప్పందాల్లో పురోగతిపై, రెండు వైమానిక దళాల మధ్య సహకారం పెంపునకు ఉన్న మరిన్ని అవకాశాలపై సీఏఎస్, సీవోఎస్-జేఏఎస్‌డీఎఫ్ చర్చించారు. సంయుక్త విన్యాసాలు, శిక్షణ పరిధుల పెంపుతోపాటు, మానవతాసాయం, విపత్తు ఉపశమన పరిస్థితుల్లో సమష్టి ప్రతిస్పందనను బలోపేతం చేసే అంశంలో విస్తృత సహకారంపైనా మాట్లాడుకున్నారు.
కొవిడ్ సవాళ్లను అధిగమించి, రెండు దేశాల వైమానిక దళాల మధ్య సంబంధాల కొనసాగింపు, బలోపేతంపై నిబద్ధతకు ఈ పర్యటన నిదర్శనంగా నిలుస్తుంది.
***
(Release ID: 1679720)
Visitor Counter : 190