ఆయుష్

వర్చువల్ యోగా కోర్సులను ప్రారంభించడానికి అనువుగా మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి

Posted On: 07 DEC 2020 5:28PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండిఎన్ఐవై) కోవిడ్-19 నేపథ్యంలో  ఈ-ఎడ్యుకేషన్ మరియు వర్చువల్ లెర్నింగ్ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ మేరకు విధానాలకు రూపకల్పన చేస్తోంది. వర్చువల్ కోర్సులను రూపకల్పన చేయడానికి మరియు అమలు చేయడానికి అలాగే ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ వేగాన్ని గణనీయంగా పెంచడానికి ఇటీవల జరిగిన ఎండిఎన్‌ఐవైకి చెందిన స్టాండింగ్ ఫైనాన్స్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు యోగా శిక్షణా సెషన్ల రికార్డింగ్ చేయగలిగే చోట నుండి డిజిటల్ స్టూడియోలను ఏర్పాటు చేయడంపై ఎండిఎన్ఐవై ప్రధానంగా దృష్టిపెట్టింది. వివిధ ఆన్‌లైన్ విద్య మరియు శిక్షణా కార్యకలాపాలను నిర్వహించడానికి నాలుగు స్టూడియోలను ఏర్పాటు చేయడానికి ఎండిఎన్‌ఐవై సమర్పించిన ప్రతిపాదనను ఎస్‌ఎఫ్‌సి ఆమోదించింది. వివిధ వర్గాల ప్రేక్షకుల అవసరాలకు అనుగుణంగా ఒకేసారి వివిధ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను చేపట్టడానికి ఆ స్టూడియోలు సంస్థకు సహాయపడతాయి.ఎండిఎన్ఐవై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వద్దకు వర్చువల్ మోడ్‌లోని ప్రోగ్రామ్‌లు తీసుకువెళ్లడంలో ఇవి దోహదపడతాయి.

ఎండిఎన్ఐవై డిజిటల్ కార్యక్రమాలకు ఇప్పుడు అత్యవసరంగా  కావాల్సింది లీజుకు తీసుకున్న లైన్ అప్‌గ్రేడ్. ఆ ప్రతిపాదన ఆమోదం పొందింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం ఉన్న 10 ఎంబిపిఎస్‌ లైన్ సామర్ధ్యం 100 ఎంబిపిఎస్‌ వేగానికి అప్‌గ్రేడ్‌ చేయబడుతుంది. అంతేకాకుండా అదనపు లాన్‌ను ఏర్పాటు చేయడం వల్ల మొత్తం క్యాంపస్ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తుంది.

యోగా బోధనను సులభతరం చేయడానికి ఎండిఎన్ఐవై సమగ్ర బోధనా వీడియోల రూపకల్పన కూడా చేపట్టింది.సాధారణ యోగా ప్రోటోకాల్‌పై 30 నిమిషాల వ్యవధి ఉండే 10 వీడియోలు ఇప్పటికే తయారు చేయబడ్డాయి. దూరదర్శన్‌లో ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి ఆ వీడియోలు ఉపయోగించబడ్డాయి.

దేశవ్యాప్త విస్తరణను ఏకీకృతం చేస్తూ  లేహ్‌లోని 100 మంది విద్యార్థులకు యోగాలో బోధన కోసం ఒక నెల సర్టిఫికేట్ కోర్సును
ఎండిఎన్ఐవై నిర్వహించింది. ఈ కోర్సుకు సంబంధించిన మొత్తం ఖర్చులకు ఎండిఎన్ఐవైకి ఎస్‌ఎఫ్‌సి అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం లడఖ్‌లో శిక్షణ పొందిన మరియు అర్హత కలిగిన యోగా నిపుణుల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడింది. ఇది కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతంలోని పర్యాటక మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ బృందంలోని 13 మంది విద్యార్థులు యోగా ఫర్ వెల్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్ (లెవల్ -2) లో సర్టిఫికేట్ కోర్సు యొక్క యోగా సర్టిఫికేషన్ బోర్డ్ (వైసిబి) పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. వారికి సర్టిఫికేట్ అందజేశారు.


న్యూఢిల్లీలోని కోవిడ్ కేంద్రాల్లోని రోగులకు యోగా శిక్షణ ఇవ్వడం ద్వారా కోవిడ్ 19 కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఎండిఎన్ఐవై సహకరించింది. ఎమ్‌డిఎన్‌ఐవైకి చెందిన యోగా బోధకులు పార్ట్‌టైమ్ ప్రాతిపదికన ఆ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

ఆగ్నేయ ఆసియా దేశాలలో సంక్రమించని వ్యాధుల కోసం యోగా అనే ఆంశంపై అంతర్జాతీయ వర్క్‌షాప్ నిర్వహించడంలో నాయకత్వ పాత్ర వహించేందుకు ఎండిఎన్‌ఐవై సన్నాహాలు చేస్తోంది. కంటెంట్ డిజైనింగ్‌తో పాటు పలు ముందస్తు సన్నాహాలను ఇన్స్టిట్యూట్ చేపట్టింది. ఈ అనుభవం సంస్థ  యొక్క నైపుణ్యాన్ని పెంచుతుంది. అలాగే దేశీయంగా కూడా నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) భాగంగా యోగాను అద్బుతంగా ప్రదర్శించడానికి వీలుగా కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి) ను ఆయుష్ మంత్రిత్వ శాఖ 2015 లో రూపొందించింది. ఇది వివిధ రకాల యోగా అభ్యాసాలను కలిగి ఉంటుంది. ఇది సగటున రెండు వారాల వ్యవధిలో ప్రజలు నేర్చుకోవచ్చు. సివైపీ ప్రామాణీకరణ మరియు ఆచరించడానికి సౌలభ్యం ఉన్న కారణంగా ప్రజల నుండి దానికి  స్పందన లభించింది. డిజిటల్ మీడియా యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా దీనిని మరింత ప్రాచుర్యం పొందే ప్రణాళికలను  ఎండిఎన్‌ఐవై రూపొందించింది. సివైపీ చలనచిత్రాలు, ఈ-బుక్‌లెట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన భాషలతో పాటు 19 ప్రాంతీయ భాషలలోకి డబ్బింగ్ చేసి, పునర్నిర్మించాలన్న ఇన్స్టిట్యూట్ ప్రతిపాదనను ఎస్‌ఎఫ్‌సి ఆమోదించింది. ఈ ప్రయోజనం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను పరిశీలించిన తరువాత అందుకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న  ఎండిఎన్‌ఐవై సలహాతో ఈ ప్రతిపాదన ఆమోదించబడింది.

ఎండిఎన్‌ఐవై కొత్తగా ఆమోదించబడిన ఈ డిజిటల్ కార్యకలాపాలు విజయవంతం అవడానికి మానవ వనరులు కీలకమైన అంశం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒక కన్సల్టెంట్ (సోషల్ మీడియా) మరియు ఇద్దరు మీడియా అసిస్టెంట్లను ఒక సంవత్సరం పాటు నియమించుకునేందుకు అలాగే ఒక కన్సల్టెంట్ (ఐటి) ని ఒక సంవత్సరం పాటు నియమించుకునేందుకు ఎస్‌ఎఫ్‌సి ఆమోదం తెలిపింది.

***



(Release ID: 1678970) Visitor Counter : 80