వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య డిసెంబర్ 9వ తేదీన కొనసాగనున్న - చర్చలు
రైతుల సంక్షేమం మరియు ముందుకు వెళ్లే మార్గాన్ని కనుగొనడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది : నరేంద్ర సింగ్ తోమర్

ఎమ్.ఎస్.పి. కొనసాగుతుంది మరియు ఆ.పి.ఎమ్.సి. బలహీనపడదు

Posted On: 05 DEC 2020 9:18PM by PIB Hyderabad

 

40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదవ దఫా చర్చలు ఈ రోజు విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్; వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్; వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ ‌తో జరిగాయి. కాగా, తదుపరి దఫా చర్చలు డిసెంబర్ 9వ తేదీన జరుగుతాయి.

చర్చల సందర్భంగా ఇరుపక్షాలు, పరస్పరం తమ అభిప్రాయాలను తెలియజేసుకున్నాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఎ.పి.ఎం.సి. బలమైన సంస్థ అనీ, అది బలహీనపడదనీ, రైతు సంఘాలకు హామీ ఇచ్చారు.  రైతుల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఈ దిశగా అనేక చర్యలతో పాటు, రైతుల అనుకూల సంస్కరణలను తీసుకువచ్చిందనీ, రైతు ప్రతినిధులకు శ్రీ తోమర్ మరో సారి భరోసా ఇచ్చారు.  ఎం.ఎస్.‌పి. లను అనేకసార్లు పెంచామని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందనీ ఆయన తెలిపారు.

 

రైతులు తమ ఆందోళనను విరమించుకోవాలనీ, చర్చలు, సంభాషణల ద్వారా తమ సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరించుకోవాలనీ, మంత్రి రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు.  ప్రస్తుతం నెలకొన్న చలి వాతావరణం మరియు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పిల్లలు మరియు పెద్దలను ఇంటికి వెళ్ళడానికి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వివరిస్తూ - ఈ చర్యల్లో - వ్యవసాయం కోసం బడ్జెట్ కేటాయింపులలో గణనీయమైన పెరుగుదల;  ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేటాయింపు, దీనిలో రైతుకు ప్రత్యక్ష ఆదాయ మద్దతు లభిస్తుంది;  ఒక లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ-మౌలిక సదుపాయాల నిధి; చారిత్రాత్మక ఎమ్.ఎస్.పి. పెంపు తో పాటు, సేకరణ మరియు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు కూడా ఉన్నాయని తెలియజేశారు. వీటితో పాటు ఇతర చర్యలు భారతదేశ రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

*****(Release ID: 1678670) Visitor Counter : 15