జల శక్తి మంత్రిత్వ శాఖ
2023-24 నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి సాంకేతిక సహాయం అందించేందుకు పశ్చిమబెంగాల్‌ను
సందర్శించిన జాతీయ జల్ జీవన్ మిషన్ బృందం.
Posted On:
03 DEC 2020 3:11PM by PIB Hyderabad
జాతీయ జల్ జీవన్ మిషన్ కు చెందిన నలుగురు సభ్యుల బృందం డిసెంబర్ 2 నుంచి 4 వరకు పశ్చిమబెంగాల్ ను సందర్శించి ఆ రాష్ట్రానికి సాంకేతిక సహాయం అందిస్తున్నది. జల్ జీవన్ మిషన్ కింద హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు
అలాగే ఇందుకు సంబంధించిన వివిధ అంశాలను , సవాళ్లను గుర్తించడంతోపాటు అక్కడ అమలుచేస్తున్న మంచి విధానాలను రికార్డు చేయడం దీని ఉద్దేశం. ఈ బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి నీటిసరఫరా పథకాల అమలు లో పాలుపంచుకుంటున్న అధికారులతో మాట్లాడుతున్నది. అలాగే గ్రామ్ ప్రధాన్‌లు, గ్రామపంచాయతీ సభ్యులతో మాట్లాడుతున్నది. ఈ బృందం జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వాటి ప్రగతిని సమీక్షించడంతోపాటు వాటి సత్వర అమలుకు జోక్యం చేసుకోవలసిందిగా వారిని కోరడం జరుగుతోంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం2023-24 నాటికి రాష్ట్రంలోని కుటుంబాల వారికి నూరుశాతం కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జెఎంఎం లక్ష్యాలను నిర్ణీత కాలవ్యవధిలోగా చేరకునేందుకు కృషి చేస్తున్నది. అన్ని కుటుంబాలకు కుళాయి నీరు అందిచేందుకు సంబంధించి జల్ జీవన్ మిషన్ ప్రణాళిక, అమలు విషయమై గత నెలలొ జరిగిన మధ్యంతర సమీక్షా సమావేశానికి కొనసాగింపుగా జాతీయ జల్ జీవన్ మిషన్ బృందం
గత నెలలో పశ్చిమబెంగాల్ లో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి మధ్యంతర సమీక్షా సమావేశం జరిగింది. జల్‌జీవన్ మిషన్ కు సంబంధించి ప్రణాళిక, అమలు పై సమీక్షా సమావేశం ఇది. అన్ని కుటుంబాలకు కుళాయి నీటిని అందించడం దీని లక్ష్యం. జాతీయ జల్ జీవన్ మిషన్ నుంచి ఒక బృందం రాష్ట్రాన్ని సందర్శించి దాని అమలును పరిశీలిస్తున్నది. అలాగే వారికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నది. ఈ బృందం పిహెచ్ఇడి అధికారులతో కలసి హౌరా జిల్లాలో మూడు పథకాలను పరిశీలించింది. ఉత్తర్ పిరుపుర్ పథకం నూరు శాతం ఎఫ్.హెచ్.టి.సి కలిగి సుస్థిర నీటిసరఫరాపై దృష్టి కలిగినది. ఇది 15వ ఆర్ధిక సంఘం నిధులతో రూపుదిద్దుకుని వాన నీటిని వాడుకుంటూ నిరంతర నీటిసరఫరాకు వీలుకల్పిస్తున్నది.
బాలిచాక్ పథకంలో జల్‌జీవన్ మిషన్‌కు సంబంధించిన కీలక ప్రమాణాలను గ్రామపంచాయతిలతో చర్చించడం జరిగినది. గ్రామపంచాయితీలు ఇందుకు ప్రతిగా విఎపిలను రూపొందిస్తున్నాయి. ఎఫ్.హెచ్.టిసి పని త్వరలోనే ప్రారంభం కానుంది. ఖోస్లాపూర్ గ్రామంలో ఎఫ్‌హెచ్‌టిసి కల్పించడానికి పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు ఈ నెలలో పూర్తికానున్నాయి.
2020-21 ఆర్దిక సంవత్సరంలో పశ్చిమబెంగాల్‌కు నిధుల కేటాయింపు 1610.76 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ పథకానికి సంబంధించి ప్రారంభ నిల్వ 1,146.58 కోట్ల రూపాయలు ఉండడంతో రాష్ట్రంవద్ద 2,760.76 కోట్ల రూపాయల మేర కేంద్ర వాటా నిధులు అందుబాటులో ఉండనున్నాయి.అందువల్ల 2020-21లో రాష్ట్ర వాటా సుమారు 5770 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి నీటిని సరఫరా చేసేందుకు పశ్చిమబెంగాల్‌కు అందుబాటులో ఉండనున్నాయి. దీనికి తోడు జెఎంఎం కింద పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద పథకం అమలు పురోగతిని బట్టి అదనపు నిధులు కేటాయించడం జరుగుతుంది.
పశ్చిమబెంగాల్ 15వ ఆర్ధిక సంఘం నిధుల కింద 4,412 కోట్ల రూపాయల ఫైనాన్స్ కమిషన్ గ్రాంటులను పంచాయతి రాజ్ సంస్థలకు పొందింది. ఇందులో 50 శాతం నిధులు మంచినీరు, పారిశుధ్యానికి ఖర్చు చేయాల్సి ఉంది. ఎం.జిఎన్.ఆర్.ఇ.జి.ఎస్, జెఎంఎం. ఎస్‌బిఎం (జి) కింద పంచాయతి రాజ్ సంస్థలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు, జిల్లా మినరల్ డవలప్‌మెంట్ ఫండ్ నిధులు, కాంపా, సిఎస్ఆర్ ఫండ్ , లోకల్ ఏరియా డవలప్‌మెంట్ ఫండ్, తదితరాల కింద ప్రణాళికలను రాష్ట్రంలో సమన్వయం చేసుకోవాలి. ప్రతి గ్రామానికి గ్రామ కార్యాచరణను 5 సంవత్సరాల కాలానికి సిద్ధం చేయాలి. నీటి వనరులను బలోపేతం చేసి నీటి పొదుపు చర్యలు చేపట్టడం ద్వారా నీటి భద్రత కల్పించాలి.
దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేపట్టిన పలుచర్యలకు తోడుగా జల్ జీవన్ మిషన్ రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోంది.ప్రతిగ్రామంలోని ఇంటికి సరిపడినంత , నిర్ణీత ప్రమాణాలు కలిగిన తాగునీటిని స్వల్పకాలికంగా , దీర్ఘకాలికంగా అందించేందుకు జల్‌జీవన్ మిషన్‌ను అమలు చేస్తున్నారు.సహకార ఫెడరలిజం నిజమైన స్ఫూర్తిని అనుసరిస్తూ,రాష్ట్రప్రభుత్వాలు ఈ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ప్రజల సులభతర జీవనానికి వీలుగా ,మహిళల కష్టాన్ని తొలగించేందుకు ప్రత్యేకించి బాలికల శ్రమను తగ్గించేందుకు కుళాయి ద్వారా నీటి సరఫరా పథకాన్ని సాకారం చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోంది.ఈ పథకం సమానత్వం, సమగ్రతకు పెద్దపీట వేస్తోంది. అందువల్ల ప్రతి కుటుంబంలోని వారు మంచినీటి కనెక్షన్‌ను పొందగలుగుతారు. ఇంతకు ముందు పథకానికి భిన్నంగా ఇది కేవలం మౌలికసదుపాయాలు కల్పించడం మాత్రమే కాకుండా సేవలు అందించడంపై ప్రధానంగా దృష్టిపెడుతుంది.
***
(Release ID: 1678629)
Visitor Counter : 146