వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దేశంలో ఆయుష్‌ వాణిజ్యం, పరిశ్రమల ప్రస్తుత స్థితిపై సమీక్షించిన శ్రీ పీయూష్‌ గోయల్‌, శ్రీ శ్రీపాద్‌ యశో

ఆయుష్ ఉత్పత్తులు, సేవల ప్రామాణీకరణ, క్రోడీకరణ, నాణ్యత పర్యవేక్షణ ద్వారా అంతర్జాతీయ మార్కెట్, ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చు: పీయూష్‌ గోయల్

Posted On: 04 DEC 2020 8:24PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య&పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ శ్రీపాద్‌ యశో నాయక్‌ కలిసి, దేశంలో ఆయుష్‌ వాణిజ్యం, పరిశ్రమల ప్రస్తుత స్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రెండు శాఖల సీనియర్‌ అధికారులు, ఆయుర్వేద సంఘాలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    కొవిడ్‌ సమయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, సంబంధిత పరిశ్రమలను శ్రీ పీయూష్‌ గోయల్‌ అభినందించారు. కొవిడ్‌పై పోరాటం కోసం రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులు, సేవలను తీసుకువచ్చి ఉనికిని చాటుకున్న ఆయుష్‌ వాణిజ్య, పరిశ్రమ వర్గాలను కూడా ప్రశంసించారు.

    అంతర్జాతీయ మార్కెట్, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ఆయుష్ ఉత్పత్తులు, సేవల ప్రామాణీకరణ, క్రోడీకరణ, నాణ్యత పర్యవేక్షణ అవసరాన్ని కేంద్ర మంత్రి స్పష్టీకరించారు. ఇందుకోసం, ఆర్థిక, వాణిజ్యం&పరిశ్రమలు, ఆయుష్‌ శాఖలు పరస్పర సమన్వయంతో చేపట్టాల్సిన ప్రయత్నాలను సూచించారు.

    పన్నుల రద్దు, మార్కెట్ల వినియోగం వంటి ప్రయోజనకర నిబంధనలు చేర్చిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆయుష్ పరిశ్రమలకు బాసటగా నిలిచేందుకు శ్రీ గోయల్ హామీ ఇచ్చారు. ఆయుష్‌ ఉత్పత్తులు, సేవలపై ప్రజా అవగాహనకు చర్యలు చేపట్టాలని కూడా కేంద్ర మంత్రి సూచించారు. ప్రపంచ మార్కెట్ల దృష్ట్యా ఇది ప్రకాశవంతమైన వ్యాపారం కాబట్టి, ఈ పరిశ్రమలోని అంతులేని అవకాశాలను అన్వేషించడంపైనా శ్రీ పీయూష్‌ గోయల్‌ ఉద్ఘాటించారు.

***



(Release ID: 1678541) Visitor Counter : 102