హోం మంత్రిత్వ శాఖ
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ దినేశ్వర్ శర్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన - కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
భారత పోలీసు సర్వీసుకు అంకితమైన అధికారిగా, ఆయన దేశానికి అత్యంత విధేయతతో సేవ చేశారని పేర్కొన్న - శ్రీ అమిత్ షా
प्रविष्टि तिथि:
04 DEC 2020 5:50PM by PIB Hyderabad
ఈ రోజు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ దినేశ్వర్ శర్మ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు, శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ దినేశ్వర్ శర్మ జీ స్వర్గస్తులయ్యారని తెలిసి చాలా బాధపడ్డాను. భారత పోలీసు సర్వీసుకు చెందిన అంకితమైన అధికారిగా, ఆయన దేశానికి అత్యంత విధేయతతో సేవ చేశారు. ఈ విచారకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1678470)
आगंतुक पटल : 149