ఆర్థిక మంత్రిత్వ శాఖ

జీఎస్టీ అమలుతో ఏర్ప‌డిన నిధుల కొరత భ‌ర్తీ చేసుకొనేందుకు జార్ఖండ్ మినహా అన్ని రాష్ట్రాల ఎంపిక‌ ఆప్షన్-1


ఆప్ష‌న్-1ను ఎంపిక చేసుకున్న తాజా రాష్ట్రంగా నిలిచిన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

జీఎస్టీ అమ‌లు కొర‌త భ‌ర్తీ చేసు‌కొనేలా ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌త్యేక రుణాలు తీసుకొనే మార్గంలో రూ.3,109 కోట్ల ల‌భ్య‌త‌

రుణాల‌ ద్వారా అదనంగా రూ.1,792 కోట్ల మేర నిధుల‌ను సేకరించడానికి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు అనుమతి జారీ

Posted On: 03 DEC 2020 10:03AM by PIB Hyderabad

జీఎస్టీ అమలుతో ఏర్ప‌డిన నిధుల కొరత భ‌ర్తీ చేసుకొనేందుకు ఆప్ష‌న్‌-1 త‌మ‌కు ఆమోద‌యోగ్య‌మైంద‌ని ఛ‌త్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో ఆప్ష‌న్-1కి

మొగ్గుచూపిన రాష్ట్రాల సంఖ్య 27కు చేరింది. జార్ఖండ్ మినహా అన్ని రాష్ట్రాలు, శాసనసభతో కూడిన‌ 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఆప్షన్ -1కు త‌మ అంగీకారం తెలిపాయి. ఆప్షన్-1 ను ఎంపిక చేసుకున్న‌ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణాల విండో ద్వారా జీఎస్టీ అమలు వల్ల తలెత్తే ఆదాయ‌పు కొరతను భ‌ర్తీ చేసుకోనున్నాయి. ఆప్షన్-1 ను ఎంపిక చేసుకున్న వారి కోసం ప్ర‌త్యేకంగా భార‌త ప్ర‌భుత్వం ప్ర‌త్యేక విండోను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ  నుండి ఈ ప్ర‌త్యేక‌

విండో పనిచేస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పటికే ఐదు వాయిదాలలో రాష్ట్రాల తరపున రూ .30,000 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ సొమ్మును ఆప్షన్ -1 ను ఎంచుకున్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చింది. ప్రత్యేక విండో ద్వారా రుణం తీసుకున్న నిధులను ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ, నవంబర్ 2, 9, 23వ తేదీతో పాటుగా డిసెంబర్ 1, 2020 న రాష్ట్రాలు మరియు యు‌టీలకు విడుదల చేశారు. త‌దుప‌రి రౌండ్ రుణాలతో సేక‌రించిన నిధుల ద్వారా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు నిధులు ల‌భిస్తాయి. ఆప్షన్-1 నిబంధనల ప్రకారం, జీఎస్టీ అమలు వల్ల తలెత్తే కొరతను తీర్చడానికి రుణాలు తీసుకోవడానికి ప్రత్యేక విండో సదుపాయాన్ని పొందడంతో పాటుగా ఆయా రాష్ట్రాలు త‌మ‌త‌మ జీఎస్‌డీపీలలో

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ కింద మే 17వ తేదీ, 2020న పేర్కొన విధంగా

భారత ప్రభుత్వం అనుమతించిన 2 శాతం అదనపు రుణాలలో భాగంగా  రాష్ట్రాలు త‌మ జీఎస్‌డీపీలో 0.50% తుది విడత రుణం పొందేందుకు అనుమ‌తి ల‌భించ‌నుంది. ఇది స్పెషల్ విండోన‌కు దాదాపు రూ.1.1 లక్షల కోట్ల మేర అధికం. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం నుంచి ఆప్షన్ -1 ఎంపికకు సంబంధించిన నిర్ణ‌యం అందిన త‌రువాత‌ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి (ఛత్తీస్‌గ‌ఢ్ జీఎస్‌డీపీలో 0.50 శాతం) భారత ప్రభుత్వం నుంచి రూ.1,792 కోట్ల మేర అదనంగా రుణాలు తీసుకునే అనుమతి ల‌భించింది. 27 రాష్ట్రాలకు మంజూరు చేసిన అదనపు రుణాలు మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన, ఇప్పటివరకు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల మొత్తం అనుబంధంగా జత చేయబడినాయి.

 ఈ నెల 2వ తేదీ వ‌ర‌కు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుమతించబడిన జీఎస్‌డీపీలో 0.50 శాతం అదనపు రుణాలు తీసుకోవడం మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధులు  రూపాయ‌లు కోట్ల‌లో... 

(Rs. in Crore)

క్ర‌మ సంఖ్య‌

రాష్ట్రం / యుటీ పేరు

0.50 శాతం అదనపు రుణాలు తీసుకొనేందుకు అనుమ‌తించ‌బ‌డిన‌ రాష్ట్రాలు

ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధుల మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు / ‌కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపబడింది

1

ఆంధ్రప్రదేశ్

5051

804.15

2

అరుణాచల్ ప్రదేశ్*

143

0.00

3

అస్సాం

1869

346.12

4

బీహార్

3231

1358.54

5

ఛత్తీస్‌గఢ్‌ #

1792

0.00

6

గోవా

446

292.20

7

గుజరాత్

8704

3208.80

8

హర్యానా

4293

1514.40

9

హిమాచల్ ప్రదేశ్

877

597.47

10

కర్ణాటక

9018

4317.39

11

కేరళ

4,522

328.20

12

మధ్యప్రదేశ్

4746

1580.51

13

మహారాష్ట్ర

15394

4167.99

14

మణిపూర్ *

151

0.00

15

మేఘాలయ

194

38.89

16

మిజోరం *

132

0.00

17

నాగాలాండ్ *

157

0.00

18

ఒడిషా

2858

1329.97

19

పంజాబ్

3033

475.80

20

రాజస్థాన్

5462

907.12

21

సిక్కిం *

156

0.00

22

తమిళనాడు

9627

2171.90

23

తెలంగాణ

5017

299.88

24

త్రిపుర

297

78.90

25

ఉత్తర ప్రదేశ్

9703

2090.21

26

ఉత్తరాఖండ్

1405

806.10

27

పశ్చిమ బెంగాల్

6787

252.22

 

మొత్తం (ఎ):

105065

26966.76

1

ఢిల్లీ

వర్తించదు

2040.77

2

జమ్మూ & కాశ్మీర్

వర్తించదు

790.53

3

పుదుచ్చేరి

వర్తించదు

201.94

 

మొత్తం (బి):

వర్తించదు

3033.24

 

మొత్తం (ఎ + బి)

105065

30000.00

* ఈ రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార అంతరం ‘నిల్’గా  ఉంది

# తదుపరి రుణాలు తీసుకున్న తరువాత నిధులు విడుదల చేయబడతాయి.

 

****

 



(Release ID: 1678136) Visitor Counter : 188