మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్, లక్నో నగరాల్లో కూడా “హునర్ హాట్” ప్రదర్శనలు: ముక్తర్ అబ్బాస్ నఖ్వీ

రాంపూర్ ఎగ్జిబిషన్ మైదానంలో డిసెంబరు 18నుంచి 27 వరకూ, లక్నోనగరంలోని శిల్పాగ్రామ్.లో జనవరి 23నుంచి 31వరకూ, “స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం” అన్న నినాదమే స్ఫూర్తి

27రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకళాకారుల, నిపుణుల హస్తకళాఖండాలు, ఉత్పాదనల ప్రదర్శన

http://hunarhaat.org వర్చువల్, ఆన్.లైన్ వేదికల పై కూడా రాంపూర్, లక్నో ప్రదర్శనలు

రానున్న నెలల్లో మరిన్ని నగరాల్లో “హునర్ హాట్”ల నిర్వహణ

Posted On: 03 DEC 2020 3:40PM by PIB Hyderabad

స్వదేశీ ఉత్పాదనలకు ప్రాధాన్యం ఇస్తూవోకల్ ఫర్ లోకల్ నినాదం స్ఫూర్తిగాహునర్ హాట్ తదుపరి ప్రదర్శన ఉత్తప్రదేశ్ రాష్ట్రం, రాంపూర్ లోని ఎగ్జిబిషన్ మైదానంలో 2020 డిసెంబరు 18నుంచి 27వరకూ జరుగుతుంది.ఈ రోజు ఢిల్లీలో మౌలానా ఆజాద్ విద్యా ఫౌండేషన్ సర్వసభ్య మండలి, పాలనా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మైనారిటీ వ్యవరాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

రాంపూర్ లో హునర్ హాట్ ప్రదర్శనను కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి.) వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభిస్తారని నఖ్వీ చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని శిల్పాగ్రామ్.లో 2021 జనవరి 23నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించే హునర్ హాట్ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి తెలిపారు. 

రాంపూర్ లో జరగనున్న హునర్ హాట్ ప్రదర్శన వర్చువల్ పద్ధతిలోనేకాక, http://hunarhaat.org అనే ఆన్ లైన్ ప్లాట్.ఫాంలోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విదేశాల్లోని వారు హునర్ హాట్ ఉత్పాదనలను డిజిటల్, ఆన్ లైన్ ప్లాట్.ఫాంల ద్వారా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

ఉత్తరప్రదేశ్, అస్సాం, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్.లతో పాటు దేశంలోని మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హస్తక కళాకారులు, నిపుణులు తమ చేతులమీదుగా స్వదేశీయంగా తయారు చేసిన కళాఖండాలను, కళాత్మక వస్తువులను ఈ హునర్ హాట్లలో ప్రదర్శిస్తారు.

రాంపూర్, లక్నో ప్రాంతాల్లో నిర్వహించే హునర్ హాట్ల సందర్భంగా కరోనా నిరోధానికి సంబంధించి శానిటేషన్, మాస్కుల ధారణ, పరిసరాల శుభ్రత తదితర మార్గదర్శక సూత్రాలన్నింటినీ కచ్చితంగా పాటిస్తారని నఖ్వీ చెప్పారు. ఈ హునర్ హాట్ ప్రదర్శనల్లో నిపుణులైన కళాకారుల స్వదేశీ ఉత్పాదనలు, హస్త కళాఖండాలు ప్రత్యేకమైన ఆకర్షణలు కాగలవని, మరోవైపు,..దేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన సంప్రదాయక వంటకాల రుచులను కూడా ఇక్కడ చవిచూడవచ్చని కేంద్రమంత్రి చెప్పారు. జాన్.బీ,.. జహాన్.బీ అనే ఇతివృత్తంతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రముఖ కళకారులు ప్రదర్శిస్తారన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రబోధించిన ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు,నిపుణులైన కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న స్వదేశీ ఉత్పాదనలకు వోకల్ ఫల్ లోకల్ నినాదంతో ప్రోత్సాహం అందించేందుకు హునర్ హాట్ ప్రదర్శనలుపటిష్టమైన వేదికలుగా పనికివస్తాయని ఇప్పటికే రుజువైనట్టు కేంద్రమంత్రి చెప్పారు.

గత ఆరేళ్లలో 5లక్షలకు పైగా భారతీయ తయారీ కళాకారులకు, నిపుణులకు, పాకశాస్త్ర ప్రవీణులకు, వారితో కలసి పనిచేసే వారికి, ఇతరులకు హునర్ హట్ఉపాధిని, ఉద్యోగావకాశాలను కల్పించిందని, ఎంతో ప్రజాదరణ కూడా పొందిందని మంత్రి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన హస్తకళాకారుల, నిపుణుల ఉత్పత్తులకు హునర్ హాట్చక్కని మార్కెట్ అవకాశాలుకల్పిస్తూ వస్తోందని, స్వదేశీ, చేతి తయారీ కళాఖంఢాలకు ఇది విశ్వసనీయమైన బ్రాండ్ గా మారిందని నఖ్వీ తెలిపారు.

రాబోయే రోజుల్లో జైపూర్, చండీగఢ్, ఇండోర్, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ (ఇండియాగేట్), రాంచీ, కోట, సూరత్/అహ్మదాబాద్, కోచి తదితర ప్రాంతాల్లో హునర్ హాట్ ప్రదర్శనలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి  తెలిపారు. ఈ హునర్ హాట్ ప్రదర్శనలు జరిగే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.

hunar-haat-to-restart-from-september-2020-with-the-theme-of-local-to-globalHunar Haat - भारतीय दस्तकारों, शिल्पकारों, कारीगरों एवं... | Facebook

***************


(Release ID: 1678063)