శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భవిష్యత్తులో రాబోయే నీటి కొరత సవాళ్లను ఎదుర్కోవడానికి మురుగునీటి శుద్ధియే కీలకపరిష్కారం : డాక్టర్ హర్షవర్ధన్
దేశవ్యాప్తంగా వినియోగించడానికి వీలుగా మురుగు నీటి శుద్ధి సాంకేతికత తయారీని రూపొందించాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి
నాగపూర్ కు చెందిన సిఎస్ ఐ ఆర్ - నీరి, పుణేకు చెందిన సిఎస్ ఐఆర్ ఎన్ సిఎల్ తయారు చేసిన పర్యావరణ హిత మురుగునీటి శుద్ధి ప్లాంటు ప్రారంభం.
ఫైటోరిడ్ సాంకేతికను ఉపయోగించి మురుగునీటి శుద్ధి ప్లాంటు తయారీ. వ్యర్థజలాల శుద్ధికి సంబంధించి స్వీయ స్థిరత్వ సాంకేతికగా పేరొందిన ఫైటోరిడ్ సాంకేతికత
Posted On:
02 DEC 2020 6:47PM by PIB Hyderabad
భవిష్యత్తులో రాబోయే నీటి కొరత సవాళ్లను ఆదుకోవడానికి మురుగునీటి శుద్ధి కీలకపరిష్కారంగా నిలుస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. మురుగునీటి శుద్ధి సాంకేతికతను విస్తరించి బలోపేతం చేయడానికిగాను సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ ( సిఎస్ ఐ ఆర్ ) శాస్త్రవేత్తలు కృషి చేయాలని దేశవ్యాప్తంగా వున్న తమ కార్యాలయాల్లో దీనికి సంబంధించిన సాంకేతికతను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పర్యావరణ హితమైన, సమర్థవంతమైన ఫైటోరిడ్ సాంకేతికత కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంటు ( ఎస్ టిపి)ను విర్చువల్ పద్ధతిద్వారా డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. దీనిని పుణెలోని సిఎస్ ఐఆర్ నేషనల్ కెమికల్ లాబరేటరీ ( ఎన్ సి ఎల్) లో ఏర్పాటు చేశారు. దీన్ని సిఎస్ ఐఆర్ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (నీరి), నాగపూర్ , సిఎస్ ఐఆర్- ఎన్ సిల్ అభివృద్ధి చేశాయి. ఫైటోరిడ్ సాంకేతికత ద్వారా మురుగునీటి శుద్ధి విధానాన్ని తయారు చేసినందుకు సిఎస్ ఐఆర్ శాస్త్రవేత్తలను మంత్రి అభినందించారు. ఈ పద్ధతిద్వారా శుద్ధి అయిన నీటిని వివిధ పనులకోసం ఉపయోగించుకోవచ్చని తాగడానికి కూడా ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్నించి ప్రేరణ పొంది దీన్ని విస్తరింప చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బయోటెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టాయని వాటిలో కూడా వ్యర్థ జలాల శుద్ధ జరుగుతోందని ఆయన అన్నారు.
ఫైటోరిడ్ సాంకేతికతను నాగపూర్ కు చెందిన సిఎస్ ఐఆర్ -నీరిలో తయారు చేశారు. దీనికి గాను పేటెంట్ కూడా పొందారు. దీన్ని గత పది సంవత్సరాలుగా విజయవంతంగా పరీక్షించారు. ఈ రంగంలో ప్రత్యేకతను చాటుతున్న సాంకేతికతగా ఇది పేరొందింది.
చిత్తడి నేలల్లో సహజంగా సంభవించే పద్ధతులద్వారా మురుగునీటి శుద్ధి జరుగుతుంటుంది. దీని ఆధారంగా ఫైటోరిడ్ సాంకేతికతను తయారు చేశారు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను ఉపయోగిస్తారు. మట్టి లేకుండానే ఈ మొక్కలు పొషకాలను గ్రహిస్తాయి.
ఫైటోరిడ్ సాంకేతికతను ఉపయోగించి మురుగునీటినిశుద్ధి చేసిన తర్వాత తద్వారా వచ్చే నీటిని పెరటితోటల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు.
నీరి ఫైటోరిడ్ నీటి శుద్ధి సాంకేతికను ఉపయోగించడంలో సిఎస్ ఐ ఆర్ - ఎన్ సి ఎల్ అనేది సిఎస్ ఆర్ కు చెందిన మొదటి ల్యాబరేటరీ. పలు సంప్రదాయ విధానాలతో పోలిస్తే ఈ సహజ వ్యవస్థ ఆధారిత ఫైటోరిడ్ సాంకేతికత అనేది నిర్వహించడానికి సులువైనది. ఏమాత్రం నిర్వహణా వ్యయం లేనిది. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తులు,ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1677875)
Visitor Counter : 134