రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ హాస్పిటల్‌లో ఐసియు సామర్థ్యం పెంపు

Posted On: 29 NOV 2020 6:41PM by PIB Hyderabad

ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కొరోనా కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆసుపత్రిలో ఐసియు పడకల సంఖ్యను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) 500 పెంచింది. ఈ అన్ని పడకలకు  ఆక్సిజన్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (డిజిఎఎఫ్ఎంఎస్), లెఫ్టినెంట్ జనరల్ అనుప్ బెనర్జీ, ఎస్ఎమ్, పిహెచ్ఎస్ ఈ ఆధునీకరణను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ఢిల్లీ ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.

 డిఆర్డీవో ఆధ్వర్యంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ హాస్పిటల్ లో 1000 పడకల సౌకర్యం ఉంది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొవిడ్-19 పాజిటివ్ రోగులకు చికిత్స చేయాలన్న ఆదేశంతో ఢిల్లీలో ఈ ఆస్పత్రిని జూలై 5, 2020 న ప్రారంభించారు.ఇప్పుడు ఈ ఆస్పత్రిలో పడకల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఐసియు మానిటర్లు, హెచ్‌ఎఫ్‌ఎన్‌సి యంత్రాలు అలాగే ఇప్పటికే ఉన్న ఆక్సిజన్ పైప్‌లైన్ ను ఆధునీకరించాల్సిన అవసరం ఏర్పడింది. కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి ఎఎఫ్ ఎంఎస్ వైద్య సదుపాయాలను పెంచింది. ఐటిబిపి, సిఎపిఎఫ్ మరియు ఇతర సర్వీసులకు చెందిన వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది విధుల్లో చేరారు. వారంతా రోజంతా విధులు నిర్వహిస్తున్నారు.


ఆసుపత్రిలో ఇప్పటివరకు 3271 మంది రోగులు చేరారు. వారిలో 2796 మంది రోగులు నయం / డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 434 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 356 మంది పౌరులు కాగా 78 మంది సేవా సిబ్బంది ఉన్నారు.


ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాలైన హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మరియు మధ్య ప్రదేశ్ నుండి రోగులను ఈ ఆస్పత్రి చేర్చుకుంటోంది. ఇక్కడ రోగులకు అత్యాధునిక వైద్య చికిత్స అందించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (డిజిఎఎఫ్ఎమ్ఎస్)  వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారామెడిక్స్ మరియు అనుబంధ విభాగాల సిబ్బందిని అందిస్తోంది. హౌస్‌కీపింగ్ సర్వీసెస్, లాండ్రీ, సిఎస్‌ఎస్‌డి, ఫుడ్ అండ్ బేవరేజెస్, మరియు ఫైర్ సర్వీసెస్ వంటి సాధారణ ఆసుపత్రి కార్యకలాపాలకు సహాయక సేవలు మరియు సాంకేతిక సేవలు డిసిడబ్లు&ఈ మరియు సిసిఆర్ &డి సెంట్రల్,డీఆర్డీవో సంస్థలతో నిర్వహించబడుతున్నాయి. కోవిడ్ -19 రోగులకు ఐసియుల పరంగా ఢిల్లీలో ఇదే అతిపెద్ద సదుపాయం అని డిఆర్‌డిఓ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సివిల్ వర్క్స్ & ఎస్టేట్) చీఫ్ ఇంజనీర్ ఎస్ హెచ్ అజయ్ సింగ్ తెలిపారు. అలాగే అవసరానికి అనుగుణంగా అదిక సంఖ్యలో ఐసియు పడకలు అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ(ఎంహెచ్ఎ) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్ఎఫ్డబ్లు), సాయుధ దళాలు, టాటా సన్స్ మరియు ఇతర పరిశ్రమల సహకారంతో డీఆర్డీవో కేవలం 12 రోజుల రికార్డు సమయంలో డిఆర్డీవో దీనికి రూపకల్పన, అభివృద్ధి మరియు కార్యాచరణను చేపట్టింది. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ప్రతి బెడ్ ఆక్సిజన్ సరఫరా, ఎక్స్‌రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఇసిజి), హేమాటోలాజికల్ టెస్ట్ సదుపాయాలు, వెంటిలేటర్లు, కోవిడ్ టెస్ట్ ల్యాబ్, వీల్ చైర్స్, స్ట్రెచర్స్ మరియు ఇతర వైద్య పరికరాలు ఉన్నాయి. కొవిడ్-19 చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు, డికంటైన్ మెంట్ టన్నెల్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇలు), ఎన్ 95 మాస్క్ లు, కాంటాక్ట్-ఫ్రీ శానిటైజర్ డిస్పెన్సర్లు, శానిటైజేషన్ చాంబర్లు మరియు మెడికల్ రోబోట్లు, ట్రాలీలు మొదలైనవి డిఆర్డిఓ అభివృద్ధి చేసింది.

ఈ ఆసుపత్రిలో రోగులకు  డయాగ్నస్టిక్స్ తో పాటు మందులు, ఆహారం అందించడంతో పాటు ఉచితంగా చికిత్స అందిస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఆసుపత్రిలో సంరక్షణ మరియు పరిశుభ్రమైన సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

***



(Release ID: 1677074) Visitor Counter : 144