వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రపంచానికి భారతదేశం తలుపులు తెరవడమే ఆత్మనిర్బర్ భారత్..తద్వారా భారత్‌ ప్రస్తుత స్థితినుండి అభివృద్ధి చెందడంతో పాటు ఇతర దేశాలతో పరస్పర ప్రయోజనాలను పొందగలిగే అవకాశం లభిస్తుంది: శ్రీ పియూష్ గోయల్

ఇతర దేశాల ఉత్పత్తులకు భారతదేశంలో మార్కెట్ యాక్సెస్‌ను అందించేటప్పుడు అధిక సాంకేతిక ఉన్న ఉత్పత్తులను అందించగల దేశాలతో ఎఫ్‌టిఎలు చేయడంపై భారతదేశం తన శక్తిని కేంద్రీకరించాలని మంత్రి తెలిపారు

Posted On: 28 NOV 2020 6:35PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, రైల్వేలు, మరియు వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్‌ ఈ రోజు మాట్లాడుతూ''ప్రపంచానికి భారతదేశం తలుపులు విస్తృతంగా తెరవడమే ఆత్మనిర్బర్ భారత్‌ అని ..తద్వారా భారత్‌ ప్రస్తుత స్థితినుండి అభివృద్ధి చెందడంతో పాటు ఇతర దేశాలతో పరస్పర ప్రయోజనాలను పొందగలిగే అవకాశం లభిస్తుందని చెప్పారు. స్వరాజ్యమాగ్ కార్యక్రమంలో 'ఆత్మనిర్భర్ భారత్ విజన్ & ఫిలాసఫీ' లో ముఖ్య ఉపన్యాసం చేస్తూ ఆయన మాట్లాడుతూ ''దేశంలో వనరుల సృష్టిపై ఆత్మ నిర్భర్ భారత్ దృష్టి పెడుతోందని, ప్రపంచం నుండి అనుభవాలు నేర్చుకోవాలని, భారతదేశానికి ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడంతో పాటు నైపుణ్య , అధిక నాణ్యత కలిగిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణను ఆకర్షించాలని చెప్పారు. ఆత్మ నిర్బర్‌ భారతాన్ని సాధించడంలో టెక్నాలజీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని..సాంకేతిక రంగానికి అవసరమైన వనరులను అందించేందుకు ప్రభుత్వం అంకరు మరియు పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి  పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరిస్తేనే ఆత్మనిర్భర్ భారత్ కల సాకారమవుతుందని శ్రీ గోయల్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనేది జన భాగీదారీ (ప్రజల భాగస్వామ్యం) తో మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఖచ్చితంగా సాకారమవుతుందని అయితే ప్రతి పౌరుడు చురుకుగా పాల్గొనడం వల్లే అధి సాధ్యమవుతుందని అన్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో భాగం కావాలని ప్రతిఒక్కరినీ ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ "మనం దృడ నిశ్చయం, ఉత్సాహం, వేగంతో ముందుకు కదిలితే ఖచ్చితంగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటామనడంలో సందేహం లేదు. మీరు ధర్మం గురించి మాట్లాడినప్పుడు మన ప్రాచీన వారసత్వాలు మరియు సాంస్కృతిక వారసత్వం ఎల్లప్పుడూ దాన్నే భోదిస్తుందన్నారు. ఆత్మనిర్భర్ వ్యక్తి - ఆత్మనిర్భర్ సమాజం- ఆత్మనిర్భర్ దేశం. ఆత్మనిర్భార్‌భారత్‌ బాధ్యత మనందరిపై సమిష్టిగా ఉంది" అని చెప్పారు.

మనకు పారదర్శక వాణిజ్య యంత్రాంగం ఉన్న, పారదర్శక వ్యాపార వ్యవస్థలతో పనిచేసే దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టిఎ) చేసుకోవడానికే కచ్చితంగా కృషి చేయాలని శ్రీ గోయల్ అన్నారు. బలం ఉన్న కొన్ని ఉత్పత్తులకు స్థానం పొందడంలో పాల్గొనవచ్చని చెప్పారు.  భారతదేశం వంటి అతిపెద్ద మార్కెట్లలో మార్కెట్ యాక్సెస్ కోసం చూస్తున్న అభివృద్ధి చెందిన దేశాలతో ఎఫ్‌టిఎలు చేయడంపై భారత్ తన శక్తిని కేంద్రీకరించాలని, అయితే భారతదేశానికి బలం ఉన్న ఉత్పత్తుల కోసం తమ దేశాల్లో తలుపులు తెరిచేటప్పుడు ఎవరు తమకు అధిక సాంకేతిక ఉత్పత్తులను అందించగలరూ చూసుకోవాలన్నారు. ఆర్‌సిఇపిలో మనం చేరలేకపోవడానికి ఒక ప్రధాన కారణం ఆర్‌సిఇపిలోని కొన్ని దేశాలు ప్రజాస్వామ్య, పారదర్శక వాణిజ్య వ్యవస్థలు కాదని మంత్రి అన్నారు. "ఒక స్థాయి ఆటలో పరస్పర ప్రాధాన్యత ఇవ్వని భాగస్వామితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన తెలిపారు.

అభివృద్ది చెందిన సరఫరా వ్యవస్థలో భారత్‌ ప్రపంచ ఆటగాడిగా ఎదగాలని ప్రధాని భావిస్తున్నట్లు శ్రీ గోయల్ అన్నారు. భారత్‌తో సారూప్య భావాలు కలిగిన దేశాలు వాణిజ్యాన్ని విస్తరించాలని చూస్తున్నప్పుడు లేదా తమ వస్తువుల తయారీకి మరియు సేవలను అందించడానికి ప్రత్యామ్నాయ వనరులను వెతుకుతున్నప్పుడు భారతదేశం విశ్వసనీయ భాగస్వామిగా ఎదగాలని ఆయన అన్నారు.


తయారీ మరియు ఉత్పత్తిలో తాము అధిక నాణ్యత మరియు అధిక ఉత్పాదకత ఉత్పత్తులను పరిశీలిస్తున్నామని శ్రీ గోయల్ చెప్పారు. క్వాలిటీ & ప్రొడక్టివిటీ భారతదేశ భవిష్యత్ ఉత్పాదక పరిశ్రమకు ముఖ్య లక్షణంగా ఉంటుందని పేర్కొన్న ఆయన..ప్రతి రంగం వాటిపై దృష్టి పెట్టడానికి, వాటిని ప్రోత్సహించడానికి వచ్చే నెల నుండి ఒక రోజును అంకితం చేస్తామని చెప్పారు. భారతదేశాన్ని, భారతీయ ఉత్పత్తిని సమర్ధించే జాతీయవాద స్ఫూర్తిని ప్రతి భారతీయుడిలోనూ ప్రోత్సహించడంతోపాటు, భారతదేశాన్ని సరుకుల తయారీదారు మరియు సేవల ప్రదాతగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. మరో 10 రంగాలకు విస్తరించిన ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక కార్యక్రమం 3 కోట్ల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొందడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. సహాయక పర్యావరణ వ్యవస్థలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు పొందడానికి ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. "డి-రెగ్యులేషన్, హ్యాండ్ హోల్డింగ్ & కొన్ని ఇతర రకాల మద్దతు & ప్రోత్సాహకాలు అవసరమయ్యే మరిన్ని రంగాలను తాము గుర్తించామమని..భారతదేశానికి పోటీ ప్రయోజనం ఉన్న ఉత్పత్తుల సామర్ధ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడానికిమరియు నిర్ణయించడానికి తాము పరిశ్రమతో సన్నిహిత భాగస్వామ్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రపంచ ప్రజలకు సేవ చేస్తున్న, గర్వించదగిన మరియు స్వావలంబన కలిగిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దెందుకు మేము కృషి చేస్తున్నాము. భారతదేశంలో వ్యాపారం సులభతరం చేయడానికి, పని చేయడానికి ప్రధాని నుండి మాకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఒప్పందాల అమలు కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయడం మా పనిలో చాలా క్లిష్టమైన అంశం. వ్యాపారం సులభతరం చేసే ప్రయత్నాలపై మేము దృష్టి సారించాము. మేము నిజమైన సింగిల్‌ విండో విధానంపై పని చేస్తున్నాం.."అని మంత్రి అన్నారు.

రైతుల గురించి మాట్లాడుతూ " మన రైతులను బలోపేతం చేయడానికి మరియు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తిని మార్కెట్ చేసే సామర్థ్యాన్ని పొందడానికి తాను దేశాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. " ఆహార ధాన్యాలలో మనల్ని స్వయం సమృద్ధిగా రైతులు నిలిపారు. మేము ఇప్పుడు రైతుల చేతులను బలోపేతం చేయడానికి చూస్తున్నాము"అని ఆయన అన్నారు.

భారత రైల్వే గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ "అది ఇప్పుడు అభివృద్ధితో  తదుపరి దశను పరిశీలిస్తోంది. రైల్వేకు అవసరమైన ఉత్పత్తులను అందించేందుకు  భారతీయ సరఫరాదారుల కోసం చూస్తున్నాము. ఈ రోజు రైల్వే దేశం వెలుపల నుండి ప్రస్తుత సేకరణలో 2% లోపు మాత్రమే సేకరిస్తుంది. అయితే ఆ 2% ని కూడా భారతీయ ఉత్పత్తులతో భర్తీ చేయాలని మేము ప్రణాళికి రూపొందిస్తున్నాం. 2023 డిసెంబర్ నాటికి రైల్వే పూర్తిగా విద్యుదీకరించబడుతుంది. 2030 నాటికి నెట్-జీరో కార్బన్ ఉద్గారిణిగా మారడానికి 20 జిడబ్లూ పునరుత్పాదక శక్తిలో పెట్టుబడి పెట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాము.."అని వివరించారు.

***


(Release ID: 1676964) Visitor Counter : 196