శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020 (ఐఐఎస్ఎఫ్ 2020) లో సాంప్రదాయ కళలు మరియు హస్తకళలను ప్రోత్సహించనున్న సిఎస్‌ఐఆర్-ఎఎంపీఆర్

ఐఐఎస్ఎఫ్ -2020 కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి సి.ఎస్.ఐ.ఆర్ వివిధ రాష్ట్రాల్లో ముందస్తు కార్యక్రమాలు చేపడుతోంది.

Posted On: 28 NOV 2020 3:23PM by PIB Hyderabad

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్- 2020 పై అవగాహన కల్పించేందుకు సిఎస్ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎమ్ఇఆర్ఐ)  పలు మందస్తు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిలో పురపాలక ఘన వ్యర్ధాలు, ఉభయచర రోబోట్లు, గాలి మరియు నీటి పరిశుభ్రత, సౌర శక్తి పరిజ్ఞానం, స్మార్ట్ గ్రిడ్, మినీ-గ్రిడ్ మరియు వ్యవసాయ పరికరాలు వంటి మొత్తం 8 విభాగాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో  17,000 మందికి పైగా ఇవి చేరుకున్నాయి.  2020 నవంబర్ 27 న ఆన్‌లైన్‌ విధానంలో జరిగినన ప్రీ-ఈవెంట్స్ యొక్క ముగింపు వేడుకకు  ముఖ్యఅతిథిగా విజ్ఞానభారతి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ జయంత్ సహస్రబుద్‌ హాజరయ్యారు.


శ్రీ జయంత్ సహస్రబుద్‌ తన ముఖ్య ఉపన్యాసంలో మాట్లాడుతూ" పునరుత్పాదక ఇంధనం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాల్లో సిఎస్ఐఆర్-సిఎమ్ఇఆర్ఐ అత్యద్భుతంగా పనిచేస్తోందని అది సామాజిక ప్రయోజనంతో ముడి పడి ఉందని చెప్పారు. సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు సమాజంలో వ్యాప్తి చెందడానికి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సరైన వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. “ఇది ఆధునిక భారతదేశం యొక్క అద్భుతమైన సైన్స్ & టెక్నాలజీ సామర్థ్యాన్ని అలాగే గొప్ప శాస్త్రీయ వారసత్వాన్ని ప్రదర్శించే వాహకమన్నారు. ఈ ఏడాది ఐఐఎస్‌ఎఫ్ నినాదమైన సెల్ఫ్‌ రిలయన్స్ అండ్ గ్లోబల్ వెల్ఫెర్‌ ప్రస్తుత పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తోందని చెప్పారు. " చరక సంహిత మరియు సుశ్రుత సంహితలు ఆధునిక అనారోగ్య  సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయని ఎలా అంటే అవి  నిర్దిష్ట వ్యాధులను లక్ష్యంగా చేసుకోకుండా వ్యక్తుల రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయత్నిస్తాయని చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా అధికారిక విద్యా విధానం లేనప్పుడు ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయానికి భారతదేశం నిలయంగా ఉందని ఇది అప్పట్లో ప్రపంచ విద్యా కేంద్రంగా ఉందని చెప్పారు. జాతి నిర్మాణంలో పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తేనే మన ఘన వారసత్వం, ప్రపంచస్థాయి గుర్తింపు భారత్‌కు తిరిగి లభిస్తాయని వివరించారు.


ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ మాట్లాడుతూ మానవజాతికి ఉపయోగపడే  సరసమైన-సుస్థిర-పర్యావరణ స్నేహపూర్వక సాంకేతిక ఆవిష్కరణల ద్వారా మానవజాతిని శక్తివంతం చేయడానికి సిఎస్‌ఐఆర్-సిఎంఈఆర్‌ అంకితమయిందని తెలిపారు. "సిఎస్‌ఐఆర్‌-సిఎంఈఆర్‌ఐ కాలనీ శక్తి మరియు వనరుల సమర్ధతకు సరైన ఆదర్శం. స్థానికంగా ఉన్న గెస్ట్ హౌస్ కిచెన్ ఎల్‌పిజికి బదులు వేస్ట్ మేనేజ్మెంట్ ఉప ఉత్పత్తులపై నిర్వహించబడుతుంది. కాలనీ వాసులు గృహ వ్యర్ధాలను కాలనీలోనే ప్రాసెస్ చేస్తారు. అలాగే ఆ వ్యర్ధాల నుండి  ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. సిఎస్‌ఐఆర్-సిఎంఇఆర్‌ఐ వివిధ సాంకేతిక ఆవిష్కరణల ద్వారా స్వయం సంమృద్ధి గల గ్రామ ఆర్ధిక వ్యవస్థను కూడా చేపట్టింది.సుస్థిరమైన వ్యవసాయ విధానం కోసం  శుద్ది చేసిన మురుగునీటిని వ్యవసాయనికి ఉపయోగించడం, పర్యావరణ మరియు ఆర్థికంగా స్థిరమైన విధానాలను అభివృద్ధి చేయడానికి ఇన్స్టిట్యూట్ కృషి చేస్తోంది." అని చెప్పారు.


భోపాల్‌లోని సిఎస్‌ఐఆర్ - అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఎమ్‌పిఆర్‌ఐ) లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020 (ఐఐఎస్‌ఎఫ్‌2020) లో సాంప్రదాయ కళాకారులు మరియు క్రాఫ్ట్స్ ఎక్స్‌పో యొక్క బాధ్యతను ఇనిస్టిట్యూట్‌కు ఇచ్చినట్లు సిఎస్‌ఐఆర్-ఎఎమ్‌పిఆర్ డైరెక్టర్ డాక్టర్ అవనీష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సందర్భంగా ‘యుటిలైజేషన్ ఆఫ్ పారాలి’, ‘ఐఐఎస్‌ఎఫ్ - 2020’ అనే రెండు బ్రోచర్‌లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కెవి, నవోదయ విద్యాలయాలు, ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఎన్‌ఐటిటిఆర్ చండీగడ్‌,  38 సిఎస్‌ఐఆర్ ల్యాబ్‌లు, కళాశాలలు, పాఠశాలలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొవిడ్- 19 యొక్క ప్రభావాలను ఎదుర్కోవడంలో సిఎస్‌ఐఆర్‌-ఎఎంపిఆర్‌ఐ చేపట్టిన కార్యక్రమాలను, ప్రజలకు మాస్క్‌లు శానిటైజర్ల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలను ఆయన నొక్కిచెప్పారు.

విభర్సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ ఎస్‌.ఎస్‌. భదౌరియా తన ప్రసంగంలో.."స్వదేశీ పరిజ్ఞానంతో సమాజాన్ని బలోపేతం చేయడంలో విజ్ఞానభారతి చురుకైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. సమతుల్య ఆహారానికి సంబంధించి ప్రపంచ రికార్డు సాధన కోసం ఐఐఎస్ఎఫ్ వద్ద విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పారు.  ప్రజలకు ఆరోగ్యం, స్వచ్ఛమైన నీరు మరియు గాలిని అందించగలిగినప్పుడే శాస్త్రవేత్త బాధ్యత పూర్తి అవుతుందని ఆయన స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.కె. సుబ్రమణియన్  ఇస్రో మాజీ గ్రూప్ డైరెక్టర్,ఎన్‌ఆర్‌ఎస్‌సి  "నీటి వనరులలో రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ టెక్నాలజీ పాత్ర" పైన; వాటర్ మేనేజ్‌మెంట్‌పైన యూకెలోని సెయింట్ జాన్ ఇన్నోవేషన్ సెంటర్,ట్రైవిసన్ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సేతుకెసేరా; “భారతదేశంలో కొవిడ్- 19 ఇబ్బందులు, ప్రజల్లో అవగాహన లేమి ఏసీఎస్‌ఐఆర్ డిఎస్‌టి మహిళా పరిశోధకురాలు శ్రీమతి సోనాలిమెహ్రా ఉపన్యాసాలు చేశారు.


సి.ఎస్.ఐ.ఆర్ యొక్క అత్యుత్తమ శాస్త్రవేత్త మరియు హెచ్ఆర్డిజి హెడ్ డాక్టర్ ఎ చక్రవర్తి తన ప్రసంగంలో"  జై విజ్ఞాన్ అవిష్కరణలు, పరిశోధనలు సమాజంలో ప్రతిబింబిస్తున్నాయని అదే ఐఐఎస్ఎఫ్ యొక్క నినాదమన్నారు. ఐఐఎస్‌ఎఫ్‌లో శాస్త్రీయ ఉపన్యాసాలు పండుగగా మార్చబడతాయని..ఫ్లై యాష్ వినియోగం మరియు ఇతర ఆవిష్కరణల రంగంలో ఎఎమ్‌పిఆర్‌ఐ చేస్తున్న కృషిని ఆయన వివరించారు.

డాక్టర్ శేఖర్ సి. మాండే, డిజి, సిఎస్‌ఐఆర్ పంపిన సందేశాన్ని డాక్టర్ అవనిష్ కుమార్ శ్రీవాస్తవ  చదివి వినిపించారు.

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఉత్సవం. మన నిత్య జీవితంలోని సమస్యలకు  సైన్స్ ఎలాంటి పరిష్కారాలను అందించగలదో ఐఐఎస్‌ఎఫ్ వేదికగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, రైతులు, సాంకేతిక నిపుణులు కలిసి చర్చిస్తారు. ఐఐఎస్‌ ప్రయాణం 2015 లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం జరుగుతున్నది ఐఐఎస్‌ఎఫ్ 6వ సదస్సు. 22-25 డిసెంబర్ 2020 తేదీల్లో ఈ సదస్సు వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించబడుతోంది. ఈ సంవత్సరం ఐఐఎస్‌ యొక్క థీమ్ “సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అండ్ గ్లోబల్ వెల్ఫేర్”. ఈ సంవత్సరం 41 కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిఎస్‌ఐఆర్ మరియు నోడల్ ఇన్ట్సిట్యూట్ సిఎస్ఐఆర్-నేషనల్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ (ఎస్‌ఐఎస్‌టిఏడిఎస్, న్యూ డిల్లీ ఐఐఎస్‌-2020 భారతదేశంతో పాటు విదేశాలలో శాస్త్రీయ దృక్పదాన్ని అభివృద్ధి చేయడంలోను భారతదేశ ఖ్యాతిని చాటడంలో కీలక భాగం పోషిస్తున్నాయి. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం విద్యార్థులు, యువ పరిశోధకులు మరియు సాధారణ ప్రజల కోసం భారతీయ విజ్ఞాన విజయాలు మరియు ఆవిష్కరణలను ప్రదర్శించడం. అలాగే ఎస్ & టి రంగంలో భారతదేశం యొక్క సహకారాన్ని ప్రదర్శించడం మరియు మన సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనటానికి యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం. ఐఐఎస్ఎఫ్ అనేది భారత ప్రభుత్వం మరియు విజ్ఞానభారతి (విభ) యొక్క ఎస్ అండ్ టి మినిస్ట్రీస్ మరియు విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన వార్షిక కార్యక్రమం. నవంబర్ 17, 2020 న మొదటి కర్టెన్ రైజర్ కార్యక్రమం న్యూఢిల్లీ నిర్వహించబడింది.

***


(Release ID: 1676868) Visitor Counter : 203