రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల పిఎల్‌ఐ పథకాలకు ఔషధ మరియు వైద్య పరికరాల పరిశ్రమ నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది

దరఖాస్తుకు చివరి తేదీ 30.11.2020 కాగా 28.11.2020 నుండి 30.11.2020 వరకు బ్యాంక్ సెలవులను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రన్ట్లు దరఖాస్తు రుసుమును ఎన్‌ఈఎఫ్‌టి ద్వారా చెల్లించాలని సూచించడమైనది

Posted On: 27 NOV 2020 5:57PM by PIB Hyderabad

బల్క్ డ్రగ్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకం మరియు వైద్య పరికరాల పిఎల్ఐ పథకాలకు ఔషధ మరియు వైద్య పరికరాల పరిశ్రమ నుండి చాలా ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన వస్తోంది.  బల్క్ డ్రగ్స్ కు చెందిన పిఎల్ఐ పథకం నాలుగు వర్గాల ఉత్పత్తులలో 247 దరఖాస్తులు నమోదు చేయబడ్డాయి. వీటిలో గరిష్టంగా 136 మంది దరఖాస్తుదారులు ఈ పథకం కింద ఎంపిక చేయబడతారు. అదేవిధంగా, మెడికల్ పరికరాల కోసం పిఎల్‌ఐ పథకం మొత్తం నాలుగు ఎంపిక చేసిన విభాగాలలో 28 రిజిస్ట్రేషన్లు అందాయి. అందులో గరిష్టంగా 28 మంది దరఖాస్తుదారులు ఈ పథకం కింద ఎంపిక చేయబడతారు. పథకాలకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన ఐఎఫ్‌సీఐ లిమిటెడ్ ఈ  దరఖాస్తులను సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వీకరిస్తున్నారు.

రెండు పథకాల కింద దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ 30.11.2020.

28.11.2020 నుండి 30.11.2020 వరకు బ్యాంక్ సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత మరియు చేయబోతున్న రిజిస్ట్రన్ట్‌ల దరఖాస్తు రుసుము చెల్లింపును ఎన్‌ఎఫ్‌టి విధానంలో చేయవచ్చు. బ్యాంకు ఖాతాల వివరాలు సంబంధిత మార్గదర్శకాలలో పేర్కొనబడ్డాయి. దరఖాస్తుదారులకు సహాయం చేయడానికి, వారి వెబ్‌సైట్‌లో పేర్కొన్న సంప్రదింపు వివరాలపై దరఖాస్తుల చివరి తేదీ వరకు ఐఎఫ్‌సిఐ లిమిటెడ్ బృందం అందుబాటులో ఉంటుంది.

బల్క్ డ్రగ్స్ మరియు ఔషధ పరికరాల కోసం పిఎల్ఐ పథకాన్ని 20.03.2020 న ప్రభుత్వం ఆమోదించింది. రెండు పథకాల అమలుకు మార్గదర్శకాలు 27.07.2020 న జారీ చేయబడ్డాయి. అనంతరం పరిశ్రమ నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా అవి సవరించబడ్డాయి. సవరించిన మార్గదర్శకాలను 29.10.2020 న జారీ చేశారు.

***



(Release ID: 1676629) Visitor Counter : 175