కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఉమాంగ్ యాప్‌పై గ‌రిష్ఠ‌స్థాయిలో లావాదేవీలు నిర్వ‌హించినందుకు ఇపిఎఫ్ఒకు ప్లాటినం పార్ట‌న‌ర్ అవార్డు

Posted On: 25 NOV 2020 4:09PM by PIB Hyderabad

ఉమాంగ్ యాప్ మూడు సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ క‌మ్యూనికేష‌న్స్‌, లా, జ‌స్టిస్ మంత్రి శ్రీ ర‌విశంక‌ర్ ప్ర‌సాద్  కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్య విభాగాల‌కు సంబంధించి న ఉమాంగ్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.అన్ని సేవ‌ల‌కు సంబంధించి గ‌త ఆరు నెల‌ల లావాదేవీల ఆధారంగా దీనిని ప్ర‌క‌టించారు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇపిఎఫ్ఒ) కు ప్లాటినం పార్ట‌న‌ర్ అవార్డు ప్ర‌క‌టించారు. ఈ సంస్థ ఉమాంగ్ యాప్‌పై 25 ల‌క్ష‌ల లావాదేవీల‌ను పూర్తి చేసింది.

 మెజారిటీ ఇపిఎఫ్ఒ స‌భ్యులు సామాజికంగా ఆర్ధికంగా అణ‌గారిన వ‌ర్గాల‌కు చెందిన వారు.ఇపిఎఫ్ఒ చందాదారుల‌ను చేర‌డానికి అందుబాటులో చౌకైన మార్గం కావాలి. ఇంట‌ర్నెట్ ఆధారిత ఉప‌క‌ర‌ణాలైన స్మార్ట్‌ఫోన్లు, కెయోస్ ఫీచ‌ర్ ఫోన్ల వంటి వాటిని, టాబ్లెట్‌లు, డెస్క్‌టాప్‌ల పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఇపిఎఫ్ఒ ఉమాంగ్ యాప్ ద్వారా సుల‌భ‌మైన , నిరంత‌రం త‌న సేవ‌లు అందుబాటులో ఉండేట్టు చేసింది. ప్ర‌త్యేకించి మారుమూల ప్రాంతాల‌లో ఉండే చందాదారుల‌కు త‌న సేవ‌ల‌ను అందుబాటులోకి తేవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఫ‌లితంగా ఇపిఎఫ్ొ సేవ‌లు ఉమాంగ్‌పై ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. 

ఉమాంగ్ యాప్‌ను ఉప‌యోగించి, ఇపిఎఫ్ఒ స‌భ్యులు ఇపిఎప్ఒ కు చెందిన 19 వివిధ ర‌కాల సేవ‌ల‌ను త‌మ మొబైల్‌పై పొంద‌వ‌చ్చు. స‌భ్యులు పాస్‌బుక్‌ను చూసుకోవ‌చ్చు, యుఎఎన్‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. క్లెయిమ్‌లు చేసుకోవ‌చ్చు, క్లెయిమ్ స్టేట‌స్ చూసుకోవ‌చ్చు. స్కీమ్ స‌ర్టిఫికేట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇపిఎఫ్ ఆఫీసు చిరునామా  వంటివి తెలుసుకోవ‌చ్చు. ఈ సేవ‌లు పొంద‌డాన‌కి ఆధార్ తో అనుసంధాన‌మైన యాక్టివ్ యుఎఎన్ (యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌ర్‌), ఇపిఎఫ్‌తో రిజిస్ట‌ర్ అయిన మొబైల్ నెంబ‌ర్ ఉండాలి.

ఉమాంగ్ యాప్ ఇపిఎఫ్ఒ చందాదారుల లో బాగా ఆదర‌ణ పొందిన యాప్‌. దీని ద్వారా ఇంటినుంచే ఇపిఎఫ్ఒ సేవ‌లు పొంద‌డానికి వీలు క‌లుగుతుంది.కోవిడ్ వంటి స‌మ‌యంలో కూడా ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుత ఆర్ధిక సంవత్స‌రంలో 

ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబ‌ర్ 2020 వ‌ర‌కు మొత్తం 7.91 ల‌క్ష‌ల క్లెయిమ్‌లను స‌భ్యులు ఉమాంగ్  యాప్‌లో దాఖ‌లు చేశారు.కోవిడ్ -19 కార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల వంటి అడ్డంకుల‌నుంచి ఉమాంగ్ విముక్తి క‌లిపించింది. ఉమాంగ్ సేవ‌ల వ‌ల్ల చందాదారులు భౌతికంగా ఇపిఎఫ్ఒ కార్యాల‌యాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం  లేకుండా పోయింది.

ఉమాంగ్ యాప్‌పై ఇపిఎఫ్ఒ సేవ‌లు చాలా పాపుల‌ర్‌. ఇందులో అక్టోబ‌ర్ 2019నుంచి 2020 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 42.63 కోట్ల మంది దానిని చూశారు. ఇందులో 37.93 కోట్ల హిట్‌లు ఇపిఎఫ్ఒ సేవ‌ల‌కు సంబంధించిన‌వి. 88 శాతం మంది ఉమాంగ్ సేవ‌లు చూశారు. ఉమాంగ్ పాపులారిటీకి ఇపిఎఫ్ఒ సేవ‌లు ఒక కార‌ణం అంటే అది అతిశ‌యోక్తి కాబొదు.

సుల‌భ‌మైన‌, ఎమాత్రం ఇబ్బంది లేని రీతిలో ఒకే మొబైల్ యాప్‌లొ ఇపిఎఫ్ఒ త‌న సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇపిఎప్ఒ ఈ గ‌వ‌ర్నెన్సు నుంచి ఎం గ‌వ‌ర్నెన్సుకు మారి దేశ‌వ్యాప్తంగా గ‌ల చందాదారులకు వారి అర‌చేతిలో సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చి వారికి కొత్త శ‌క్తిని స‌మ‌కూర్చింది. ఉమాంగ్ యాప్ ఇపిఎఫ్ఒకు కీల‌క ఉప‌క‌ర‌ణంగా మారిండి. ఇది నిరంత‌రాయ‌మైన సేవ‌ల‌ను దాని చందాదారుల‌కు అందిస్తున్న‌ది.

 

***



(Release ID: 1675836) Visitor Counter : 136