కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎఐ), వెరెనిగింగ్ వాన్ రిజిస్టర్ కంట్రోలర్స్ ( విఆర్ సి) ,

నెదర్లాండ్స్ ల మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Posted On: 25 NOV 2020 3:29PM by PIB Hyderabad

నెదర్లాండ్స్ లోని వెరెనిగింగ్ వాన్ రిజిస్టర్ కంట్రోలర్స్ (విఆర్ సి)తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం నెదర్లాండ్స్ మరియు భారతదేశంల మధ్య అకౌంటింగ్, ఫైనాన్షియల్ మరియు ఆడిట్ నాలెడ్జ్ అంశాల అభివృద్ధి అవగాహనకు ఈ ఒప్పందం సహాయపడుతుంది.
అమలు వ్యూహం మరియు లక్ష్యాలు
i.నెదర్లాండ్స్ లో సాంకేతిక కార్యక్రమాలు, సెమినార్లు, సమావేశాలు, సదస్సులు నిర్వహించడానికి ఐసీఎఐ మరియు విఆర్ సి కలిసి పనిచేస్తాయి.

ii.సభ్యుల నిర్వహణ, వృత్తిపరమైన నైతిక విలువలు,సాంకేతిక పరిశోధన, వృత్తి విద్య కొనసాగింపు, విద్య మరియు పరీక్షల నిర్వహణ అంశాలతో పాటు అకౌంటెన్సీ వృత్తి అవకాశాలను మెరుగు పరచడానికి రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయి.
iii. నెదర్లాండ్స్ లో అకౌంటింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఆడిట్ రంగాలలో స్వల్పకాలిక ప్రొఫెషనల్ కోర్సులను అందించడం.
iv.విద్యార్థులు మరియు బోధనా సిబ్బందిని ఒక దేశం నుంచి మరో దేశానికి పంపుతూ అధివృద్ధి సాధించడానికి గల అవకాశాలను చర్చించడం
v. అవసరమైనప్పుడు భారతదేశం మరియు నెదర్లాండ్స్ మరియు అంతర్జాతీయంగా అకౌంటెన్సీ వృత్తికి సంబంధించిన అనియంత్రిత సమాచారాన్ని పంచుకోవడం
ప్రయోజనాలు

రెండు దేశాలకు చెందిన గుర్తింపు పొందిన సంస్థల మధ్య కుదిరిన అవగాహన వల్ల భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు నెదర్లాండ్స్ లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా భారతదేశానికి తిరిగి నిధులు ఎక్కువగా వస్తాయి.

ప్రభావం
ఐసీఎఐ యూరోపియన్ ప్రాంతంలో 1500 మందికి పైగా సభ్యులను నెదర్లాండ్స్ లో దాదాపు 80 మంది సభ్యులను కలిగి ఉంది. నెదర్లాండ్స్ కి చెందిన విఆర్ సికి సహకారం అందించడం కోసం కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ఆ దేశంలో సంస్థ సభ్యులకు మరిన్ని వృత్తిపరమైన అవకాశాలు లభిస్తాయి.
నేపధ్యం
చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం,1949 కింద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు అయింది.భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ వృత్తి నియంత్రణ కోసం ఇది పనిచేస్తున్నది. 1988 లో స్థాపించబడిన వెరెనిగింగ్ వాన్ రిజిస్టర్ కంట్రోలర్స్ (విఆర్ సి) ఒక స్వచ్ఛంద వృత్తిపరమైన సంస్థ. దీని సభ్యులు మేనేజ్ మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ కంట్రోల్ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్ మరియు కార్పొరేట్ గవర్నెన్స్ లో తమ సర్వీసులను అందిస్తున్నారు.

***
 


(Release ID: 1675684) Visitor Counter : 190