సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్ఐలకు సిపిఎస్ఇ అండ

ఆరు నెలల్లో గణనీయంగా పెరిగిన ఎంఎస్ఐల నుంచి చేసిన సేకరణ, చెల్లింపులు

2020 మే నుంచి వరకు అక్టోబర్ రెండున్నర రెట్లు పెరిగిన సేకరణ

2300 కోట్ల నుంచి 5000 కోట్లకు పెరిగిన సేకరణ

మేలో 76% ఉన్న చెల్లింపులు అక్టోబర్ నాటికి 80%పైగా పెరుగుదల

24 నుంచి 20 శాతానికి తగ్గిన నెలవారీ చెల్లింపు బకాయిల శాతం

Posted On: 24 NOV 2020 4:27PM by PIB Hyderabad

సూక్ష్మ​చిన్నమధ్య ​తరహా సంస్థల ​(ఎంఎస్ఎమ్ఇ) ల నుంచి కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్ఇ ) సేకరిస్తున్న వస్తువులు వాటికి చేస్తున్న చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలోఎంఎస్ఎమ్ఇ లకు పిఎస్ఇలు చెల్ల్లించవలసి ఉన్న నెలవారీ చెల్లింపుల బకాయిలు తగ్గుతున్నాయి. చేసిన సేకరణలో 1/5వ వంతు చెల్లింపులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఈ వివరాలను ఎంఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ సమాధాన్ పోర్టల్ లో విడుదల చేసింది. ఎంఎస్ఎమ్ఇల నుంచి సేకరిస్తున్న ఉత్పత్తుల పరిమాణం ప్రతి నెలా పెరుగుతున్నదని వీటికి చెల్లింపులు కూడా సకాలంలో జరుగుతున్నాయని ఎంఎస్ఎమ్ఇ తెలిపింది. చెల్లింపులు కూడా సాధారణ వ్యాపార లావాదేవీలలో జరిగే మాదిరిగానే 45 రోజులలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి ....
*మే 2020 లో, 25 మంత్రిత్వ శాఖలు మరియు 79 సిపిఎస్ఇలు ​వివరాలను అందించాయి. అక్టోబర్ 2020 నెలలో, 26 మంత్రిత్వ శాఖలు మరియు 100 సిపిఎస్ఇలు ​వివరాలను అందించాయి. ఈ సంఖ్య స్థిరంగా పెరుగుతోంది.
​*2020 మే తో పోల్చి చూస్తే ఆక్టోబరులో ఎంఎస్ఐల నుండి మొత్తం సేకరణ మరియు లావాదేవీ​లు రెండున్నర రెట్లు పెరిగాయి. మే నెలలో ఈ మొత్తం 2300 కోట్ల రూపాయల వరకు ఉంటే అక్టోబర్ నాటికి 5000 కోట్ల రూపాయలకు చేరింది.
​ *
ఎంఎస్ఐలకుచేసిన ​ చెల్లింపు​ల నిష్పత్తిలోకూడా పెరుగుదల కనిపించింది.మేలో 76%​ ఉన్న ఈ మొత్తం అక్టోబర్ లో 80% కి పెరిగింది.
* ఈ నెలలన్నిటిలో, ఒక నెల చివరిలో పెండింగ్ లో ఉన్న బకాయిలు, మొత్తం లావాదేవీలో ఐదవ వంతు మాత్రమేవున్నాయి.సాధారణ వ్యాపారలావాదేవీలలో మాదిరిగానేఉంది. వాస్తవానికి ఈ నిష్పత్తి గత ఆరు నెలల్లో 24% నుం​చి 20% వరకు తగ్గింది.


గత ఆరు నెలల​వివరాలను పరిశీలిస్తే ఎంఎస్ ఇల నుండి సేకరించడంలో సిపిఎస్ ​​లు ​ప్రాధాన్యత ఇస్తున్నాయని వెల్లడవుతున్నదని ఎంఎస్ ఇ మంత్రిత్వ శాఖ తెలిపింది. మే, 2020 తరువాత సమాదాన్ పోర్టల్ లో ​వివరాలను పొందుపరచడానికి రూపొందించిన నమూనాలో వివరాలను అందించడంలో కూడాఅభివృద్ధి చేసిన కొత్త రిపోర్టింగ్ ఫార్మాట్ వివరాలను నివేదించడంలో ​ ​సిపిఎస్ఇలు ​ ​​​ఎంఎస్ఇ మంత్రిత్వ శాఖతో సహకరించా​యని తెలిపారు. ​. గత ఆరు నెలల్లో ఎంఎస్ఇలతో సిపిఎస్ఇ​లు చేసినవ్యాపారం ​వివరాలను పరిశీలిస్తేసిపిఎస్ఇల మూలధన ​వ్యయం పెరిగిందని అదేవిధంగాఎంఎస్ఇల​కు కలుగుతున్న ప్రయోజనాన్ని తెలియచేస్తున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రెండు రంగాల ద్రవ్య పరపతి పెరిగిందని పేర్కొంది.

​కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రియాశీల విధానాలు ​​ఎంఎస్ఇ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఈ సానుకూల వాతావరణం ఏర్పడిందని అధికారవర్గాలు తెలిపాయి. సానుకూల చర్యలు ఇలా ఉన్నాయి.

  • ​ప్రధానమంత్రి ఇచ్చిన ' ఆత్మా నిర్భర్ భారత్' పిలుపు ఎంఎస్ఐలలో స్ఫూర్తిని​,​ ​చైతన్యాన్ని నింపి కొవిడ్ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ వారు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేలా చేసి సరఫరాలు సేవల పునరుద్ధరణకు అవకాశం కలిగించింది.నింపింది, కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడే వస్తువులు మరియు సేవలను తిరిగి తెరిచి సరఫరా చేయాలనే విశ్వాసాన్ని బలపరిచింది.
  • వోకల్ ఫర్ లోకల్అనే ప్రధానమంత్రి పిలుపు వ్యక్తిగత మరియు కార్పొరేట్ వినియోగదారులను​ ​​ఎంఎస్ఐల ల నుండి కొనుగోలు చేయడానికి ప్రేరేపించింది.
  • 45 రోజుల్లో ​ ​​ఎంఎస్ఐల బకాయిలు చెల్లించాలని ​ఆత్మ నిర్భర్ భరత్ ప్యాకేజీకింద ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ప్రభుత్వమరియు ​కార్పొరేట్ కొనుగోలుదారులు ​ ​ఎంఎస్ఐ వస్తువులు మరియు సేవల ​ప్రాధాన్యత ఇచ్చేలా చేసింది.
  • ​ఈ ప్రకటన​వెలువడిన తరువాత ​​​ఎంఎస్ఐచేసిన ప్రయత్నాలు ఫలించాయి.
  • ​తమకు సహకరించాలని కోరుతూఎంఎస్ఐ​ ​కార్యదర్శి​ ​​​సిపిఎస్ఇలకు​ ​అనేక లేఖలను ​రాయడమే కాకుండా వాటి అధిపతులతో చర్చలు జరిపారు.
  • ​ ​ఎంఎస్ఐ మంత్రిత్వ శాఖ ఆన్ లైన్ రిపోర్టింగ్ ఫార్మాట్ ను అభివృద్ధి చేసింది, ఇక్కడ ​ ​సిపిఎస్ఇల ​నుంచి చేసిననెలవారీ సేకరణ వివరాలు, చేసిన చెల్లింపులు మరియు చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయిఅన్న వివరాలను పొందుపరిచారు.
  • ​ ​ఎంఎస్ఐ చెల్లింపులు సకాలంలో ​జరిగేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వాలను​​ ​​​​ఎంఎస్ఐ​ ​​కార్యదర్శి అనేకసార్లు ​చర్చలు జరిపి వాటిని ఒప్పించడం జరిగింది.
  • ​కార్పొరేట్ సంస్థలకు​ ​​ఎంఎస్ఐ​ ​​కార్యదర్శి ​పంపిన లేఖలకు సానుకూల స్పందన లభించింది.
  • ​ఆ తరువాత పండుగ కాలంలో కార్పొరేట్ సంస్థలకు దాదాపు 3000 లేఖలను రాసి వాటి సహకారాన్ని అభ్యర్ధించడం జరిగింది.
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ ​రంగానికి చెందిన కార్పొరేట్ సంస్థలు దేశంలోని ​ ​ఎంఎస్ఐలకు సహాయం చేయడానికి సానుకూలంగా ​త్వరితగతిన స్పందించాయి.
  • అనేక ​కార్పొరేట్ సంస్థలు హామీ ఇచ్చినవిధంగానే పండుగలకు ముందే తమ బిల్లులను చెల్లించి ​​ ​​​​ఎంఎస్ఐ​లకు అండగా నిలిచాయి.

జతచేయబడిన పట్టికలో అత్యధిక సేకరణ, లావాదేవీలు మరియు సిపిఎస్ఇలచే ​ ​​​​ఎంఎస్ఐలకు గరిష్ట చెల్లింపులవివరాలను తెలియచేస్తుంది.కూడా ప్రతిబింబిస్తుంది.
​విపత్కర కాలంలో ఎంఎస్ఐరంగానికి సహకరించినమంత్రిత్వ శాఖలు,​ప్రభుత్వరంగ సంస్థలకు ​​​​ఎంఎస్ఐమంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు​ తెలిపింది.

 

***

 



(Release ID: 1675500) Visitor Counter : 158