రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఔషధ, పోషకాహార పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా తగిన వసతులతో పారిశ్రామిక పార్కులు

జాతీయ ఫార్మసీ వారోత్సవం నేపథ్యంలో కేంద్ర మంత్రి సదానంద గౌడ సందేశం

Posted On: 22 NOV 2020 7:06PM by PIB Hyderabad

మందుల తయారీలో వినియోగించే క్రియాశీల ఔషధ వస్తువుల నాణ్యత పెంపుదలకు, ఔషధ, పోషకాహార పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తగిన వసతులతో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా పనిచేస్తుందని కేంద్ర రసాయనాలు, ఎరువులు, శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ చెప్పారు. 2020 సవంత్సరపు జాతీయ ఔషధ శాస్త్ర వారోత్సవాల నేపథ్యంలో నవంబరు 21న ఔషధ తయారీదార్ల అంతర్జాతీయ వెబినార్ సదస్సు సందర్భంగా కేంద్రమంత్రి సదానంద గౌడ ఈ  మేరకు సందేశం ఇచ్చారు. వృత్తిపరమైన ఔషధ తయారీదార్ల ప్రతిష్టను పెంచడమే లక్ష్యంగా నిర్వహించే జాతీయ ఔషధ వారోత్సవాలపై ఈ వెబినార్ సదస్సు తన దృష్టిని కేంద్రీకరించింది. ఆయన సందేశాన్ని ఆర్.ఆర్. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ్ స్వామి చదవి వినిపించారు. జాతీయ ఔషధ శాస్త్ర వారోత్సవాలు నిర్వహించాలన్న భావన అభినందనీయమని, కోవిడ్-19 వైరస్ మహమ్మారిపైనే కాక, ఇతర అనారోగ్య పరిస్థితులపై పోరాటాన్ని బలోపేతం చేయడంలో అగ్రశ్రేణి ఔషధ తయారీ సంస్థలన్నీ కీలకపాత్ర పోషించినట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల వినియోగం కోసం నాణ్యమైన జనరిక్ మందులు, వ్యాక్సీన్లను తయారీలో ఔషధ తయారీ రంగ వృత్తి నిపుణులు, పరిశ్రమ ఎంతో కృషి చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో కోవిడ్-19.కు కూడా భారతదేశంలో వ్యాక్సీన్ తయారయ్యే అవకాశాలున్నాయని అన్నారు. నాణ్యమైన పుస్తకాలను ప్రచురణ, పరిశోధనా పత్రాల తయారీలో ఔషధ రంగం విద్యావేత్తల కృషిని, చిత్తశుద్ధిని కేంద్రమంత్రి ప్రశంసించారు. ఫార్మసీ రంగ విద్యావేత్తలకు, ఔషధ పరిశ్రమకు, వృత్తినిపుణులకు మార్గదర్శకంగా ఉపయోగపడేలా ఔషధరంగంలో వినియోగదారుల ఫిర్యాదులు అన్న శీర్షికతో వెలువడిన ప్రచురణను మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. మణిపాల్ యూనివర్సల్ ప్రెస్ ముద్రించిన ఈ ప్రచురణ,.. డాక్టర్ గిరీశ్ పాయ్, తదితర బృందం సంపాదకీయంలో వెలువడింది. సామాజిక ప్రగతి, ఆరోగ్యం లక్ష్యంగా ఔషధ తయారీదార్లు తమ కృషిని కొనసాగించాలని గౌడ సూచించారు.  వెబినార్ సదస్సు నిర్వహణ ద్వారా జాతీయ ఔషధ తయారీ దార్ల వారోత్సవాలు విర్వహిస్తున్న కర్ణాటక రిజిస్టర్డ్ ఫార్మాసిస్టుల సంఘం (కె.ఆర్.పి.ఎ.), ఆర్.ఆర్. ఫార్మసీ కళాశాల (బెంగళూరు), బెంగుళూరు ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధుల బృందం తదితరులను ఆయన అభినందించారు.

  దేశంలో ఔషధ తయారీ వృత్తి నైపుణ్యాన్ని, ఔషధ తయారీ పరిశ్రమను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ ఔషధాగతారంగా భారతీయ ఔషధ పరిశ్రమ తన ప్రధాన పాత్రను కొనసాగించగలదన్నారు. “ఔషధాల ఉత్పాదన, వైద్య పరికరాల తయారీలో సృజనాత్మకతను మేం ప్రోత్సహిస్తున్నాం. పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు, ఇతర సదుపాయాల కల్పనపైనే మోదీ ప్రభుత్వం దృష్టినికేంద్రీకరించింది. ఔషధ తయారీ రంగం మెరుగుదలకు ఇది దోహపడుతుంది.  ఔషధ తయారీదార్ల సమస్యలపట్ల మే సానుకూల స్పందనతో ఉంటాం. వారి ప్రయోజనాల రక్షణకే కట్టుబడి ఉన్నాం.” అని గౌడ అన్నారు.

 పుణెలోని ఔషధ విద్యా, పరిశోధనా సంస్థ డైరెక్టర్,. డాక్టర్ మహేశ్ బురండే వెబినార్ లో ప్రధాన ప్రసంగం చేశారు. సమాజానికి సేవలందించడంలో ఔషధ తయారీ రంగం తమ పాత్రను మరింత మెరుగుపరుచుకోవలసి ఉందని ఆయన అన్నారు. డిజిటలీకరణ, ఆన్ లైన్ కార్యకలాపాలను పరిశ్రమకు ప్రమాదకర ధోరణులుగా భావించకుండా, వాటిని ఔషధ రంగానికే ప్రయోజనకరంగా ఎలా వినియోగించుకోవచ్చో వివరించారు. 

  ప్రొఫెసర్ రవీంద్ర ముగింపు ప్రసంగం చేస్తూ,..మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో ఔషధ తయారీదార్లకు బహుముఖ ప్రమేయం ఉందన్నారు. ఫార్మా పార్కులు, ఔషధ విధానాలు, శాసనాల రూపంలో ఫార్మాసిస్టులకు, ఫార్మసీ పరిశ్రమలకు తగిన మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  కె.ఆర్.పి.ఎ. సలహా సంఘం సభ్యుడు సునీల్ ఎస్. చిప్లూంకర్ సహవక్తగా ప్రసంగించారు. భారతీయ ఔషధ తయారీదార్ల సంఘం (ఐ.పి.ఎ.) నిర్వహిస్తున్న పాత్ర, జాతీయ ఔషధతయారీదార్ల వారోత్సవ కార్యకలాపాలను గురించి ఆయన వివరించారు. వెబినార్.లో మాడరేటర్ గా కూడా ఆయన వ్యవహరించారు. కె.ఆర్.పి.ఎ. అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ దెన్వరాజు వందన సమర్పణతో వెబినార్ ముగిసింది.

 

*******



(Release ID: 1674984) Visitor Counter : 144