వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఇథనాల్ ను పెట్రోల్‌లో కలిపే లక్ష్యాన్ని చేరుకునేందుకు, చెరకు రైతుల ఆదాయం పెంచేందుకు మిగులు చక్కెరను ఇథనాల్‌కు బదిలీ
గత రెండు సంవత్సరాలలో 70 ఇథనాల్ ప్రాజెక్టులకు రూ 3600 కోట్ల రూపాయల మంజూరు
ఏడాదికి 468 కోట్ల లీటర్ల అదనపు సామర్ధ్యాన్నిసమకూర్చుకునేందుకు మరో 185 చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు 12,500 కోట్ల రూపాయల రుణం పొందేందుకు సూత్రప్రాయంగా అనుమతి
प्रविष्टि तिथि:
20 NOV 2020 2:35PM by PIB Hyderabad
సాధారణ చక్కెర సీజన్‌లో సుమారు 320 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుంది. దేశీయంగా వినియోగం 260 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 60 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు చక్కెర అమ్ముడు పోక మిగిలిపోతున్నది.ఇది ప్రతి ఏటా 19,000 కోట్ల రూపాయల మేరకు చక్కెర మిల్లుల నిధులను బ్లాక్ చేస్తున్నది.దీనితో లిక్విడిటీ సమస్య ఏర్పడుతున్నది. ఫలితంగా రైతులకు చెరకు కొనుగోళ్లపై బకాయిలు ఉండిపోతున్నాయి. ఇలా మిగులు చక్కెర నిల్వ సమస్యకు పరిష్కారంగా చక్కెరను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం మిల్లులను ప్రోత్సహిస్తున్నది. ఇందుకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం కూడా అందజేస్తున్నది. అయితే ఇండియా వర్ధమాన దేశం కనుక ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారం 2023 వరకు మాత్రమే మన దేశం మార్కెటింగ్, ట్రాన్స్‌పోర్టుకు ఆర్ధిక సహాయాన్ని అందించగలదు. అందువల్ల దీర్ఘకాలిక పరిష్కరాంగా మిగులు చక్కెర సమస్యకు పరిష్కారం కనుగొనడంతోపాటు సకాలంలో రైతులకు బకాయిల చెల్లింపు, దీర్ఘకాలం చక్కెర పరిశ్రమ మనగలగడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మిగులు చెరకు, చక్కెరను వివిధ రంగాలలో ఉపయోగానికి వినియోగించేలా ప్రోత్సహిస్తున్నది. ఇథనాల్ తయారీ ద్వారా చమురు మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసి, దానిని పెట్రోలులో కలపడం వల్ల ఈచర్య దేశంలో ముడిచమురు దిగుమతుల భారం తగ్గడమే కాకుండా ఇథనాల్‌ను ఇంధనగా ప్రోత్సహించడానికి వీలు కలుగుతుంది. ఇది పర్యావరణ హితకరమైనది కూడా. ఇది రైతుల రాబడినికూడా పెంచుతుంది.
ఇంతకు ముందు ప్రభుత్వం 2022 నాటికి 10 శాతం బ్లెండింగ్ టార్గెట్‌గా నిర్ణయించుకుంది. 2030 నాటికి 30 శాతం బ్లెండింగ్ టార్గెట్ ను నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ప్రభుతవం20 శాతం బ్లెండింగ్ టార్గెట్‌ను ముందుకు జరిపేందుకు ప్రణాళికరూపొందిస్తున్నది. ప్రస్తుతం బ్లెండింగ్ టార్గెట్‌లను చేరుకోవడానికి ప్రభుత్వం చక్కెర మిల్లులు, డిస్టిలరీలు, ఎంటర్‌ప్రెన్యుయర్లను కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు అలాగే ప్రస్తుతం ఉన్న డిస్టిలరీల సామర్ధ్యాన్ని పెంచడానికి ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నది. చక్కెర మిల్లులు, డిస్టిలరీలు బ్యాంకులనుంచి ప్రాజెక్టులు పెట్టేందుకు తీసుకున్న రుణంపై ఐదు సంవత్సరాలపాటు ఆరుశాతం గరిష్ఠ రేటుతో ఇంట్రెస్ట్ సబ్‌వెర్షన్ ద్వారా రుణాలు పొందేందుకు వీలు కల్పించడం జరుగుతోంది.
గత రెండు సంవత్సరాలలో సుమారు 3,600 కోట్ల రూపాయల మేరకు 70 ఇథనాల్ ప్రాజెక్టులకు (మొలాసిస్ ఆధారిత డిస్టిలరీలకు) రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఇది 195 కోట్ల లీటర్ల సామర్ధ్యం పెంపుతో ముడిపడినది. ఈ 70 ప్రాజెక్టులలో 31 ప్రాజెక్టులు పూర్తి అయి 102 కోట్ల లీటర్ల సామర్ధ్యాన్నిఅదనంగా సమకూర్చాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మొలాసిస్ ఆధారిత డిస్టిలరీల స్థాపిత సామర్ధ్యం 426 కోట్ల లీటర్లకు చేరుకుంది. ఇథనాల్ ఇంట్రస్ట్ సబ్‌వెర్షన్ పథకం కింద ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో చక్కెర మిల్లులు, డిస్టిలరీలనుంచి మరిన్ని దరఖాస్తుల స్వీకరణకు 30 రోజుల విండోను ప్రారంభించింది. వీటిని డిఎఫ్‌పిడి పరిశీలించింది. ఇందులో 185 దరఖాస్తులకు (85 చక్కెర మిల్లులు, 100 మొలాసిస్ ఆధారిత ప్రత్యేక డిస్టిలరీలు) సంబంధించి 12,500 కోట్ల రూపాయల రుణం పొందేందుకు సూత్ర ప్రాయంగా అనుమతి ఇవ్వడం జ రిగింది. దీనితో అదనపు సామర్ధ్యం ఏటా 468 కోట్ల లీటర్లు వస్తుంది.ఈ ప్రాజెక్టులు రాగల 3-4 సంవత్సరాలలో పూర్తి కానున్నాయి. ఇది ఆశించిన బ్లెండింగ్ టార్గెట్‌లను చేరుకోవడానికి ఉపకరిస్తుంది.
అయితే, బ్లెండింగ్ టార్గెట్ చెరకు , చక్కెరను ఇథనాల్‌కు బదలాయించినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వం ఇతర ఉత్పత్తుల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నది. దానికి ప్రస్తుత డిస్టిలేషన్ సామర్ధ్యం సరిపొదు. అందువల్ల దేశంలో ఇథనాల్ డిస్టిలేషన్ సామర్ధ్యాన్ని 720 కోట్ల లీటర్లకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
దేశంలో బియ్యం మిగులు ఉ ండడంతో ప్రభుత్వం మిగులు బియ్యం నుంచి ఇథనాల తయారీకి కృషి చేస్తున్నది. ఎఫ్.సి.ఐ దీనిని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు సరఫఱా చేయనుంది.అవి దీనిని2020-21(డిసెంబర్ -నవంబర్ ) సంవత్సరంలో పెట్రోలులో కలుపుతాయి. ఇతర వ్యవసాయ ఉత్పత్తులనుంచి కూడా ఇథనాల్‌ను తయారు చేయసేందుకు కృషి జరుగుతోంది.
.ప్రస్తుత ఇథనాల్ సరపరా సంవత్సరం 2019-20లో కేవలం 168 కోట్ల ఇథనాల్ ను చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోలులో కలపడం కోసం సరఫరా చేయడం జరుగుతోంది. ఫలితంగా 4.8 శాతం బ్లెండింగ్ స్థాయిని చేరుకొవడానికి వీలు కలుగుతుంది. అయితే , రానున్న ఇథనాల్ సరఫరా సంవత్సరం 2020-21 లో 325 కోట్ల ఇథనాల్‌ను చమురు మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీనిద్వారా 8.5 శాతం బ్లెండింగ్ సాధించడానికి వీలు కలుగుతుంది. నవంబర్‌తో అంతమయ్యే 2021-22 సంవత్సరంలో 10 శాతం బ్లెండిగ్ లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న కృషినిబట్టి చూసినపుడు ఈ లక్ష్యం సాధించడం సాధ్యమే. 2020-21 సంవత్సరానికి 322 కొట్ల లీటర్ల కు బిడ్లు ( 289 కోట్లు మొలాసిస్‌నుంచి 34 కోట్ల లీటర్లు ధాన్యం నుంచి ) అందాయి. తదుపరి టెండర్లలో మరింత పరిమాణం మొలాసిస్, ధాన్యం ఆధారిత డిస్టిలరీలు రావచ్చు. తద్వార ప్రభుత్వం 8శాతం బ్లెండింగ్ టార్గెట్‌తో 325 కోట్ల లీటర్ల లక్ష్యాన్ని చేరుకోగలదు.
రాగల కొద్ది సంవత్సరాలలో పెట్రోలుతో 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోనున్నారు. ఫలితంగ ప్రభుత్వం ముడిచమురు దిగుమతులను తగ్గించుకో గలుగుతుంది. ఇది పెట్రోలియం రంగంలో ఆత్మనిర్భర్ దిశగా పనికి వస్తుంది. ఇది రైతుల రాబడి ని పెంచడమే కాక డిస్టిలరీలలో అదనంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
***
(रिलीज़ आईडी: 1674800)
आगंतुक पटल : 211