రక్షణ మంత్రిత్వ శాఖ
72వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఎన్‌సిసి
Posted On:
21 NOV 2020 2:22PM by PIB Hyderabad
ప‌్రపంచంలోనే అతిపెద్ద యూనిఫార్మ్ కలిగిన యువజన సంస్థ అయిన నేషనల్ కేడెట్ కార్్ప్స (ఎన్‌సిసి) తన 72వ రైజింగ్ డేను నవంబర్ 22వ తేదీన నిర్వహించనుంది. ఈ వేడుకలను జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద శనివారం నాడు రణభూమిలో అత్యున్నత త్యాగం చేసిన యోధులకు నివాళులు అర్పించడం ద్వారా ప్రారంభించారు. మొత్తం ఎన్‌సిసి సోదర ప్రపంచం తరఫున రక్షణశాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కమార్, ఎన్‌సిసి డిజి లెఫ్టనెంట్ జనరల్ రజీవ్ చోప్రా పుష్పాలను సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఎన్‌సిసి కేడెట్లు నిస్వార్ధంతో ఎక్స్ ఎన్‌సిసి యోగదాన్ ద్వారా పాలుపంచుకుని, ఈ మహమ్మారిపై పోరాటం చేసేందుకు అవసరమైన చర్యల పట్ల చైతన్యం కలిగించడంలో కరోనా యోధులుగా పని చేశారని, రక్షణ శాఖ కార్యదర్శి ప్రసంశించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్, ఆత్మనిర్భర్ భారత్, ఫిట్ ఇండియా వంటి కార్యకలాపాలలో కేడెట్లు, అసోసియేట్ ఎన్‌సిసి అధికారులు పాలుపంచుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. కేడెట్లు మనస్ఫూర్తిగా స్వచ్ఛ అభియాన్, మెగా పొల్యూషన్ పాఖ్వాడాలలో పాల్గొని, పలు ప్రభుత్వ చొరవలైన డిజిటల్ అక్షరాస్యత, అంతర్జాతీయ యోగా దినోత్సవం, చెట్లు నాటడం, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15, 2020న దేశంలోని సరిహద్దులలో, కోస్తా ప్రాంతాలలో నేషనల్ కేడెట్ కార్ప్స్ ఉనికి వ్యాప్తికి సంబంధించిన పథకాన్ని ప్రకటించారు. వైమానిక దళ స్టేషన్లు, తాలూక ఆవాసాలు, కోస్తా తాలుకాలు, సరిహద్దు జిల్లాలపై దృష్టి పెట్టి సైన్య, నావికాదళ, వైమానిక దళాలలో కేడెట్ బలం లక్షకు పెరిగింది. పుష్ప గుచ్ఛాన్ని సమర్పించిన తర్వాత రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, మన సరిహద్దు, కోస్తా జిల్లాలలో ఎన్‌సిసి బలాన్ని విస్తరించడం అన్నది ఈ ప్రాంతాలకు చెందిన యువత మరింత మంది సైన్యంలో చేరేందుకు ప్రేరణను ఇస్తుందన్నారు. సౌభ్రాతృత్వం, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, నిస్వార్ధ సేవ వంటి విలువలు యువతలో పెంచేందుకు జాతి ఎన్‌సిసి వైపు చూస్తోందన్నారు.
ఎన్‌సిసి బహుముఖ కార్యకలాపాలు, వివిధ పాఠ్యాంశాలు, యువత స్వీయ అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక అవకాశాలను కల్పిస్తుంది. క్రీడలు, సాహస క్రీడల క్షేత్రంలో అనేకమంది కేడెట్లు అసాధారణ విజయాలను సాధించి దేశానికి, సంస్థకు గర్వదాయకంగా నిలిచారు. నేటి యువతను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా మలచడంలో ఎన్‌సిసి అవిశ్రాంత కృషిని కొనసాగిస్తోంది.
ఎన్‌సిసి రైజింగ్ డేను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కేడెట్లు రక్తదాన శిబిరాలు, సామాజికాభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.
***
(Release ID: 1674782)
Visitor Counter : 223