ఆయుష్
ఆయుష్-డిబిటి సమష్టి కృషి కోవిడ్ -19 కు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలను మరింత అధునాతన ధశకు తీసుకువెళుతున్నాయి.
Posted On:
20 NOV 2020 5:01PM by PIB Hyderabad
సార్స్ -సిఒవి -2 వైరస్ పై జంతువులకు సంబంధించిన తొలి అధ్యయనం ఆయుష్ మంత్రిత్వశాఖ,డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లమధ్య సమన్వయంతో జరిగింది. ఇది తుది దశకుచేరకుంది. దేశంలో కోవిడ్ -19 పరిశోధనప్రాజెక్టులలో ఇది అత్యంత అధునాతన మైనది.ఇది నాలుగు ఓరల్ ఇంటర్‌వెన్షన్‌లకు పై ప్రీ క్లినికల్ స్టడీలకు సంబంధిచినది.. ఆయుష్ మంత్రిత్వశాఖ, కౌన్సిల్‌ఫర్ సైంటిఫిక్ ఇండ్స్ట్రియల్ రిసెర్చ్ ద్వారా ఇప్పటికే క్లినికల్ అధ్యయనాలకో సం చేపట్టింది.
జంతువులపై అధ్యయనానికి (వివొ స్టడీ) సంబంధించి అవగాహనా ఒప్పందం ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మెడిసినల్‌ప్లాంట్ బోర్డు (ఎన్ఎంపిబి),డిబిటి మధ్య కుదిరింది.ఇది రివర్స్ ఫార్మకాలజీ పై ఆధారపడినది.ఆయుర్వేద వంటి వైద్య విధానాల వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను అన్వేషించేందుకు ఉద్దేశించినది. ఈ అధ్యయనం డిబిటి కి చెందిన ఫరీదాబాద్‌లోని అటానమస్ సంస్థ ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ , టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టిహచ్ెస్‌టిఐ)లో జరుగుతుంది.అత్యధునాతన బిఎస్ ఎల్ 3 స్థాయి టి.హెచ్.ఎస్.టి.ఐ పరిశోధనశాలలు ఈ అధ్యయనాలను చేపడతాయి.
ఈ అధ్యయనంతో దేశం సార్స్ -సిఒవి-2 వైరస్, కోవిడ్ -19 పరిశోధనలలో ఒక ముఖ్యమైన మైలురాయిని నమోదు చేసినట్టు.ఇది ఇండియా తొలి ఇన్ వివో యాంటి సార్స్ సిఒవి -2 వైరస్ స్టడీ. ఒరల్ ఇంటర్‌వెన్షన్లను ఉపయోగించేది. ఇందుకు సంబంధించి తొలి రౌండ్ పరిశోధనలు ఇప్పుడే పూర్తి అయ్యాయి. ఫలితాలు రావలసి ఉంది. కాగా ఇన్ విట్రో , యాంటీ వైరల్ అద్యయనాలను రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌సిబి) ఫరీదాబాద్ లో ప్రారంభించారు. ఈ అధ్యయనాలు 2021జనవరి 31న పూర్తి కానున్నాయి. ఈఫలితాలు కొత్త మూలికా ఔషధాలకు సంబంధించి మరిన్ని కొత్త ఆలోచనలకు వీలు కల్పించనుంది. ఆయుష్ మంత్రిత్వశాఖ,డిపార్టెమంట్ ఆఫ్ బయో టెక్నాలజీ లు కలసి దేశ తొలి ఓరల్ ఇంటర్‌వెన్షన్ స్టడీని నాలుగు ఎంపిక చేసిన ఆయుర్వేద ఫార్ములేషన్లపై టిహెచ్ఎస్‌టిఐ, ఫరీదాబాద్‌లో నిర్వహించారు.ఈ ఆనలుగు ఇంటర్‌వెన్షన్లు అశ్వగంధ,గుడుచ-పిప్పలి కాంబినేషణ్,ములేతి , ఆయుష్ -64 (పాలీ హెర్బల్‌కాంపౌండ్)
మార్చి 23న ప్రధానమంత్రి ఆయుష్ రంగానికి చెందిన మేధావులను ఉద్దేశించి మాట్లాడుతూ,కోవిడ్ -19కు ఆయుష్ పరిష్కారాలపై అధ్యయనం జరగాలని సూచించారు. అందుకు ప్రతిగా ఆయుష్ మంత్రిత్వశాఖ పలుచర్యలు తీసుకుంది. ఇందుకు ఒక ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్‌ఫోర్సును ఏప్రిల్ 2న ఆయుష్ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసింది.
టిహెచ్ెస్‌టిఐలో తొలిదశ ఇన్ వివో అధ్యయనం పూర్తి అయింది. అశ్వగంధకు సంబంధించి యాంటీ వైరల్ యాక్టివిటీ విశ్లేషణ కూడా పూర్తి అయింది. మిగిలిన మూడు ఇంటర్‌వెన్షన్‌ల అధ్యయనాలు పురోగతిలో ఉ న్నాయి. అధ్యయన ఫలితాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఇది ఆయుష్ మంత్రిత్వశాఖకు డిపార్టమెంట్ాఫ్ బయొటెక్నాలజీ లకు ఎంతో గర్వకారణమైన సమయం.అని ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా తెలిపారు. ఈ కొలాబరేషణ్ భారతదేశంలో గొప్ప పరిశొధనకు వీలుకల్పిస్తుందన్నారు. సార్స్ -సిఒవి -2 వైరస్ కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అధ్యయనాలపట్ల డిపార్టమెంట్ ఆఫ్ బయొటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ సంతృప్తి వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1674778)
Visitor Counter : 227