ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీ20 ఆర్థిక మంత్రుల వర్చువల్ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Posted On:
20 NOV 2020 7:18PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఇక్కడ జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రుల వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక దృక్పథం మరియు ప్రతికూల ప్రమాదాలపై చర్చించేందుకు గాను జీ20 దేశాల ఆర్థిక మంత్రులు ఈ రోజు సమావేశమయ్యారు. సంక్షోభ సమయంలో ప్రారంభించిన సామూహిక ప్రపంచ చర్యలను జీ20 ఎలా ముందుకు తీసుకెళ్లగలదన్న అంశంపై కూడా చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్ సంక్షోభాన్ని అంతం చేయడానికి జీ20 సభ్యులు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు. ఈ దిశలో కీలకమైన దశగా అందరికీ వ్యాక్సిన్ల స్థోమత మరియు ప్రాప్యతను గురించి ప్రధానంగా చర్చించారు. శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ.. జీ20 కార్యాచరణ ప్రణాళికను, జీ20 దేశాల ఆర్ధిక ప్రతిస్పందనకు ప్రధానమైనవిగా ప్రస్తావించారు. మా తక్షణ ప్రతిస్పందనను సమన్వయం చేయడమే కాకుండా, మా దీర్ఘకాలిక పునరుద్ధరణ ప్రయత్నాలకు ఇది మార్గనిర్దేశం చేస్తుందని వెల్లడించారు. జీ20 సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ క్రింద డెట్ సర్తీస్ సస్పెన్షన్ ఇనిషియేటివ్ ఒక ప్రధానమైన ఫలితమని మంత్రి ప్రస్తావించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు గాను అన్ని జీ20 సభ్యుల సమిష్టి మరియు సమన్వయ ప్రయత్నాల ఆవశ్యకతను మంత్రి శ్రీమతి సీతారామన్ నొక్కి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందనగా జీ20 ఎజెండాను ముందుకు నడిపించడానికి సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ వారు చేసిన కృషి మరియు అసాధారణమైన నాయకత్వాన్ని సీతారామన్ అభినందించారు.
2020 డిసెంబర్ నుండి ట్రోయికా సభ్యునిగా ఇటాలియన్ ప్రెసిడెన్సీతో కలిసి పని చేయడానికి భారత్ ఎదురుచూస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
****
(Release ID: 1674626)