పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉడాన్ పధకం కింద హైదరాబాద్-నాశిక్ మధ్య ప్రారంభమైన - స్పైస్ జెట్ విమాన సర్వీసు

Posted On: 20 NOV 2020 4:25PM by PIB Hyderabad

భారత ప్రభుత్వానికి చెందిన ఆర్.‌సి.ఎస్-ఉడాన్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ - ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద భారతదేశంలో ప్రాంతీయ వైమానిక అనుసంధానతను పెంపొందించడంలో తదుపరి పురోగతి సాధిస్తూ, తెలంగాణా లోని హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని నాసిక్ వరకు రెండవ ప్రత్యక్ష (డైరెక్టు) విమాన సర్వీసు ఈ రోజు ప్రారంభమైంది.   నాసిక్ గార్డియన్ మంత్రి శ్రీ చాగన్ భుజ్ బల్; నాసిక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ హేమంత్ గాడ్సే; నాసిక్ జిల్లా కలెక్టర్ శ్రీ సూరా మంధారే; నాసిక్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ సునీల్ పాటిల్; నాసిక్ మౌలిక సదుపాయాల కమిటీ - నిమా - చైర్మన్ శ్రీ మనీష్ రావల్; నాసిక్ లోని హెచ్.ఏ.ఎల్. విమానాశ్రయం సి.ఈ.ఓ. శ్రీ శేషగిరిరావు సంయుక్తంగా నాశిక్ విమానాశ్రయంలో విమాన సర్వీసును జండా ఊపి ప్రారంభించారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.సి.ఏ), భారత విమానాశ్రయ సాధికార సంస్థ (ఏ.ఏ.ఐ) అధికారులు కూడా పాల్గొన్నారు. ఉడాన్ పథకం కింద ఇప్పటివరకు 53 విమానాశ్రయాల నుండి, 297 మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 

హైదరాబాద్ - నాసిక్ మార్గంలో అలయన్స్ ఎయిర్ సంస్థ విజయవంతంగా విమాన సర్వీసులు ప్రారంభించిన తరువాత, స్పైస్ జెట్ సంస్థ  ఈ మార్గంలో ప్రత్యక్ష (డైరెక్టు) విమాన సర్వీసులు ప్రారంభించిన రెండవ విమానయాన సంస్థగా నిలిచింది.  ఆర్.‌సి.ఎస్-ఉడాన్ -2 వేలం పాట ప్రక్రియలో స్పైస్ జెట్ సంస్థ ‌కు హైదరాబాద్-నాసిక్ మార్గం లభించింది.  సరసమైన మరియు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఉడాన్ పథకం కింద విమానయాన సంస్థలకు, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వి.జి.ఎఫ్) అందిస్తోంది.  ఈ విమానయాన సంస్థ వారానికి నాలుగు విమానాలను నడుపుతుంది. ఇందు కోసం 78 సీట్లతో  ఉన్న క్యూ400 అనే  విమానాలను వినియోగిస్తోంది.  స్పైస్ జెట్ ద్వారా ఉడాన్ కింద అనుసంధానించబడిన గమ్య స్థానాలలో నాసిక్ 14వ విమానాశ్రయం.  

నాసిక్ నగరం కలిగి ఉన్న వాణిజ్య, పర్యాటక అవకాశాల కారణంగా, హైదరాబాద్ - నాసిక్ మార్గానికి, ప్రయాణికుల నుండి భారీ డిమాండ్ వచ్చింది.  నాసిక్ ‌ను పవిత్ర తీర్థయాత్రా స్థలంగా కూడా పరిగణిస్తారు.  12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా ను నిర్వహించే 4 తీర్థయాత్రా స్థలాలలో నాసిక్ ఒకటి.  షిర్డీ సాయి ఆలయం మరియు త్రయంబకేశ్వర్ ఆలయానికి ప్రవేశ ద్వారంగా నిలిచిన నాసిక్ కూడా అనేక పవిత్ర దేవాలయాలకు నిలయంగా, ఒక యాత్రికుల పర్యాటక కేంద్రంగా పేరు గాంచింది.   అంతేకాక, దీనిని భారతదేశం యొక్క ద్రాక్ష మరియు ద్రాక్ష సారాయి కి రాజధానిగా కూడా వ్యవహరిస్తారు. ఇంకా, నాసిక్ నగరంలో  హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్) విమానాల తయారీ విభాగం ఉంది. ఇక్కడ కె -13 క్షిపణులతో పాటు మిగ్ మరియు సు విమానాలు తయారవుతాయి.  వీటితో పాటు, మహీంద్రా & మహీంద్రా, బాష్, ఎ.బి.బి, క్రాంప్టన్ గ్రీవ్స్, థైసెన్ క్రుప్ప్, సియాట్, వంటి అనేక పెద్ద పెద్ద తయారీదారులకు నాసిక్ ఒక ముఖ్య కేంద్రంగా ఉంది.

విమాన సర్వీసు రాకపోకల వివరాలు :  

విమాన సర్వీసు నెంబరు 

బయలుదేరే విమానాశ్రయం

చేరే విమానాశ్రయం 

బయలుదేరే సమయం 

చేరే సమయం

ప్రయాణ సమయం

ఫ్రీక్వెన్సీ 

2789

HYD

హైదరాబాద్ 

ISK

నాశిక్ 

10:35

12:05

1:30

మంగళవారం 

బుధవారం 

గురువారం 

శుక్రవారం 

2790

ISK

నాశిక్ 

HYD

హైదరాబాద్ 

12:35

14:10

1:35

మంగళవారం 

బుధవారం 

గురువారం 

శుక్రవారం 

 

*****



(Release ID: 1674563) Visitor Counter : 151