రాష్ట్రప‌తి స‌చివాల‌యం

నాలుగు దేశాల రాయబారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత రాష్ట్రపతికి రిపోర్ట్‌ను అందజేశారు

Posted On: 20 NOV 2020 1:56PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు (నవంబర్ 20, 2020) వర్చువల్ కార్యక్రమంలో హంగేరీ, మాల్దీవులు, చాడ్ మరియు తజికిస్తాన్ నుండి రాయబారి మరియు హైకమిషనర్ నుండి జాయినింగ్ రిపోర్ట్‌ను స్వీకరించారు. రిపోర్ట్‌ను సమర్పించిన వారు:

1. హెచ్.ఇ. మిస్టర్ ఆండ్రాస్ లాస్లో కిరాలీ, హంగెరీ రాయబారి

2. హెచ్.ఇ. డాక్టర్ హుస్సేన్ నియాజ్, మాల్దీవుల హై కమిషనర్

3. హెచ్.ఇ. మిస్టర్ సౌంగుయ్ అహ్మద్, చాడ్ రాయబారి

4. హెచ్.ఇ. మిస్టర్ లుక్మోన్, తజికిస్తాన్ రాయబారి

ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్రపతి వారి నియామకంపై రాయబారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ నాలుగు దేశాలతో భారతదేశానికి చక్కని, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. శాంతి మరియు శ్రేయస్సు కోసం మన సంబంధాలు ధృడంగా ఉన్నాయని తెలిపారు. 2021-22 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించినందుకు వారి ప్రభుత్వాలకు రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో మానవజాతి సమిష్టి ఆరోగ్యం మరియు ఆర్థిక శ్రేయస్సు కోసం ప్రపంచ దేశాల మధ్య మరింత మెరుగైన సహకారం
అవసరమని రాష్ట్రపతి కోవింద్ వ్యాఖ్యానించారు. మహమ్మారికి పరిష్కారం కనుగొనడంలో అంతర్జాతీయ సమాజం చాలా దగ్గరగా ఉందని, సంక్షోభం నుండి మరింత బలంగా, ధృడంగా తిరిగి పుంజుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



(Release ID: 1674397) Visitor Counter : 137