రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రాష్ట్రపతి మంత్రి కోవింద్ ప్రజాస్వామ్య విలువలు, నైతికతపై చేసినప్రసంగాలను ఆవిష్కరించిన రక్షణ మంత్రి

ప్రజాసేవకు రాష్ట్రపతి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు : రచనల్లో ఇదే ప్రతిబించింది

Posted On: 19 NOV 2020 6:53PM by PIB Hyderabad

ప్రజాస్వామ్య విలువలు నైతిక వివువ్లు అనే అంశంపై రాష్ట్రపతి శ్రీ రామనాధ్ కోవింద్ చేసిన రచనల మూడవ భాగాన్ని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, సమాచార, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈ రచనలు రాష్ట్రపతి వ్యక్తిత్వాన్ని అయ్యన ఉన్నత భావాలను, నైతిక విలువలకు ఆయన ఇచ్చే గౌరవాన్ని  ప్రతిబింబిస్తున్నాయని  అన్నారు. నైతిక విలువలతో ఒక ప్రజా ప్రతినిధి ఏవిధంగా మెలుగుతూ పనిచేయాలన్న ప్రశ్నకు రాష్ట్రపతి రచనల్లో సమాధానం లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రజా సేవ తన మతం అని రాష్ట్రపతి చెబుతూ వస్తుంటారని ఇదే అంశాన్ని ఆయన తన రచనల్లో స్పష్టంగా పేర్కొన్నారని మంత్రి  అన్నారు. తన రచనల్లో పేర్కొన్న అంశాలను రాష్ట్రపతి తన దైనందిన జీవితంలో కూడా పాటిస్తూ జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చెత్తల్లో మాటల్లో ఒకవిధంగా ఉండేవారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీస్కోవాలనిమంత్రి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగాలు సూటిగా మానవతా వివువలతో కూడి వుంటాయని అన్నారు.  ప్రజలు ముఖ్యంగా పేదలకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ పని చేయాలని రాష్ట్రపతి చెబుతారని రక్షణ శాఖ మంత్రి వివరించారు.  భారత దేశం ఏవిధంగా అభివృద్ధి చెందాలన్న అంశంపై రాష్ట్రపతికి ఒక స్పష్టమైన అవగాహన ఉందని, ఇది ఆయన ప్రసంగాలను వింటే తెలుస్తుందని మంత్రి అన్నారు. ఏకత్వంలో భిన్నత్వం, ప్రజాస్వామ్య విలువలకు భారతదేశం ప్రతీకగా నిలుస్తుందని, ఇదే అంశాలను రాష్ట్రపతి తన ప్రసంగాలలో పేర్కొన్నారని ఆయన చెప్పారు.భారతదేశ గొప్పదనాన్ని తెలుసుకోవడానికి రాష్ట్రపతి ప్రసంగాల సంకలనం ఉపయోగపడుతుందని అన్నారు. బాలికలకు విద్య, మహిళా సాధికారిత, బడుగుబలహీన వర్గాల సంక్షేమం లాంటి అంశాలకు రాష్ట్రపతి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రపతితో తనకు ఏంతో కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపిన మంత్రి ఆయన నైతిక విలువలు, మానవతా భావాలకు గౌరవం ఇస్తున్నారని అన్నారు. సియాచిన్ లాంటి ప్రాంతాలను సందర్శించి దేశ సైనికులను గౌరవించాలని భావిస్తున్న రాష్ట్రపతి ఉన్నత పదవిలో ఉంటూ కూడా తన గురువుల పాదాలకు నమస్కరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని ఆయన అన్నారు. 

సమాచారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ రాష్ట్రపతి ప్రసంగాల ఈ-వెర్షన్ ను విడుదలచేసి రాష్ట్రపతి ప్రసంగాలు ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భారతదేశ గొప్పదనాన్ని తెసుసుకోవాలని అనుకొనే ప్రతి ఒకారూ వీటిని చదవాలని మంత్రి అన్నారు. 

సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శిశ్రీ అమిత్ ఖరే, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావా, వైమానిక దళ ఉప ప్రధానాధికారి నరవాణే రాష్ట్రభావం సీనియర్ అధికారులు , సమాచారశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

***



(Release ID: 1674175) Visitor Counter : 97