పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
50 ఎల్ ఎన్ జి ఇంధన కేంద్రాలకు పెట్రోలియం మంత్రి శంకుస్థాపన: వచ్చే మూడేళ్ళలో 1000 కేంద్రాల లక్ష్యం
Posted On:
19 NOV 2020 2:58PM by PIB Hyderabad
స్వర్ణచతుర్భుజితోబాటు ప్రధాన జాతీయ రహదారులమీద 50 ద్రవరూప సహజవాయు ఇంధన కేంద్రాలకు కేంద్ర చమురు, సహజవాయు శాఖామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు. భారతదేసాన్ని చమురు ఆధారిత దేసంగా మార్చాలన్న ప్రధాని ఆకాంక్షలకు కార్యరూపం ఇచ్చే క్రమంలో మంత్రిత్వశాఖ ఈ చర్య చేపట్టింది. వాహన కాలుష్యాన్ని నియంత్రిమ్చే క్రమంలో సహజవాయువును రవాణాకు ఇంధనంగా వాడుకోవాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతా అంశాల్లో చేర్చింది. అదే సమయంలో దిగుమతుల ద్వారా కోల్పోయే విదేసీ మారకద్రవ్యాన్ని ఆదాచేసుకోవటం కూడా మరో లక్ష్యం. రవాణా సంస్థలకు, వాహనాల తయారీదారులకు కూడా దీనివలన ఎన్నో ఉపయోగాలున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, దేసాన్ని సహజవాయు ఆధారిత ఆర్థిక వ్యుఅవస్థ వైపు నడపటంలో ఎంతో ముందు చూపుతో ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నామన్నారు. పైప్ లైన్ల నిర్మాణం, టెర్మినల్స్ ఏర్పాటృ, సహజవాయు ఉత్పత్తి పెంపు, సరళమైన, సహేతుకమైన పన్ను విధానం అమలు లాంటి చర్యలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రవాణాకు భవిష్యత్తులో సహజవాయువే ప్రధాన ఇంధనంగా మారబోతున్నదని వ్యాఖ్యానించారు. ఇందుకు తగినట్టుగా వాహనాల తయారీని సిద్ధం చేయటం, ఇకమీదట అధికశాతం సహజవాయు వాహనాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. డీజిల్ కంటే సహజవాయువు దాదాపు 40 శాతం చౌకగా అందటంతో బాటు అతి తక్కువ కాలుష్య కారకమవుతుందన్నారు. స్వర్ణ చతుర్భుజి మీద, అన్ని ప్రధాన జాతీయ రహదారులమీద ప్రతి 200-300 కిలోమీటర్ల దూరానికి ఒక సహజవాయు ఇంధన కేంద్రం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. వచ్చే మూడేళ్ళలో ప్రధాన రహదారులు, పారిశ్రామిక హబ్ లు, గని త్రవ్వక ప్రదేశాలలో 1000 కేంద్రాలు సిద్ధమవుతాయని మంత్రి చెప్పారు. కనీసం 10 శాతం లారీలు గ్యాస్ వైపు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాలుష్య నివారణ దిశలో కాప్-21 లో ప్రధాని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించటానికి కట్టుబడి ఉందని శ్రీ ప్రధాన్ వెల్లడించారు. పిఎంయువై పథకం కింద 8 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఎల్ పి జి కనెక్షన్లు ఇవ్వటాన్ని ఆయన ప్రస్తావించారు. కరోనా మహమ్మారి సమయంలో 14 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఒడిదుడుకులు లేని ఇంధన సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం సి ఎన్ జి, ఎలక్ట్రిక్, ఆటో ఎల్ పిజి వాహనాలను బాగా ప్రోత్సహిస్తుందని, అదే సమయంలో ఎల్ ఎన్ జి కి ఎంతో భవిష్యత్ ఉన్న విషయం గుర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ లో కారు చౌకగా ఎన్ ఎన్ జి అందుబాటులో ఉంటుందన్నారు. ఎంత ఎక్కువగా ఎల్ ఎన్ జి వాడుకుంటే ముడి చమురు మీద అధారపడటం అంత తక్కువగా ఉంటుందన్నారు.
చమురు, సహజావాయు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ కపూర్ మాట్లాడుతూ, ఎల్ ఎన్ జి ని ప్రోత్సహించటానికి ప్రభుత్వం దీర్ఘకాల ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. మొదటి ట్రయల్ 2015 లో ఆరంభం కాగా ఇప్పుడు వాణిజ్యపరంగా అమ్మకం మొదలైందన్నారు. త్వరలోనే ఇది విరివిగా ట్రక్కులు, బస్సుల వాడకంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశపు ప్రధానమైన ఆయిల్ కంపెనీలు ఐఒసిఎల్, హెచ్ పి సి ఎల్, పిఎల్ ఎల్, గుజరాత్ గాస్ లాంటి సంస్థలు ఈ 50 కేంద్రాలను నెలకొల్పుతున్నాయి. ఇందులో ఐఒసిఎల్ కేంద్రాలు 20 కాగా, బిపిసిఎల్, హెచ్ పి సిఎల్, ఒక్కొక్కటి 11 చొప్పున ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం 6.3% మాత్రమే వినియోగం ఉండగా ప్రభుత్వం 2030 నాటికి 15% కి పెంచాలని భావిస్తోంది.
ఎల్ ఎన్ జి వాడకం వలన వాహనాలు విడుదలచేసే కాలుష్యం గణనీయం<గా తగ్గుతుంది. అది సమాజానికి ఎంతగానో మేలు చేసినట్టవుతుంది. అదే విధంగా భారీ రవాణా వాహనాలు బాగా పెరుగుతాయి. ఈ లారీల నిర్వాహకులు ఏటా ఒక్కో లారీ మీద దాదాపు 2 లక్షల రూపాయలు ఆదా చేసుకోవటం సాధ్యమవుతుంది. 2035 నాటికి ఎల్ ఎన్ జి డిమాండ్ కూడా బాగా పెరుగుతుందని అంచనావేస్తున్నారు. భారతదేశ ఇంధన అవసరాలలో దాదాపు న్15% దీని ద్వారా భర్తీ అవుతుందని భావిస్తున్నారు.
***
(Release ID: 1674114)
Visitor Counter : 214