రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జమ్మూలోని ఫ్రంట్‌లైన్‌ ఎయిర్ బేస్‌ను సంద‌ర్శించిన‌ ఎయిర్ మార్షల్ వి.ఆర్‌.చౌదరి

प्रविष्टि तिथि: 18 NOV 2020 8:50PM by PIB Hyderabad

వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్ మార్షల్ వి.ఆర్. చౌదరి
జమ్మూలోని ఫ్రంట్లైన్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. జమ్మూలోని బేస్‌కు చేరుకున్నప్పుడు,
ఏఓసీ- ఇన్‌-సీకి ఎయిర్ కమోడోర్ అజయ్ సింగ్ పఠానియా వీఎస్ఎం, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జమ్మూ స్వాగ‌తం ప‌లికారు. ఈ బేస్ యొక్క కార్యాచరణ సంసిద్ధత మరియు కేటాయించిన ల‌క్ష్యాల‌ను సామర్థంగా నిర్వ‌ర్తించే విష‌యంలో త‌మ‌కు గ‌ల పూర్తి సంసిద్ధ‌త‌ను గురించి వివరించారు. ఏఓసీ- ఇన్‌-సీ తన సందర్శన సమయంలో స్టేషన్ యొక్క ఎయిర్ వారియ‌ర్లు, దాని లాడ్జర్ యూనిట్ల వారితోనూ సమావేశమై సంభాషించారు.
ఎయిర్‌ఫోర్స్ విష‌యంలోని అన్ని పాత్రలలోనూ త‌మ‌ నైపుణ్యాన్ని కాపాడుకోవడంలో స్టేషన్
దృష్టి పెట్టిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.తగిన శ్రద్ధతో తమ కర్తవ్యాన్ని కొనసాగించాలని వారికి సూచించారు.

 

   

***

 


(रिलीज़ आईडी: 1673990) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil