రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

240వ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకున్న భారత సైన్యం

प्रविष्टि तिथि: 18 NOV 2020 6:34PM by PIB Hyderabad

భారత సైన్యం ఈరోజు నవంబర్ 18న 240వ సైనిక ఇంజనీర్ సైనికుల దినోత్సవం జరుపుకుంది. నేషనల్ వార్ మెమోరియల్ ఆధ్వర్యంలో లాంఛనపూర్వకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీర్-ఇన్- చీఫ్ లెఫ్ట్ నెంట్ జనరల్ ఎస్ కె శ్రీవాస్తవ, ఇతర అధికారులు, జెసివోలు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ఈ సందర్భంగా ఘనంగా పుష్పాంజలి ఘటించారు.   

సైనిక ఇంజనీర్లు యుద్ధ సమయంలో అవసరమైన ఇంజనీరింగ్ సహాయం చేస్తారు. సాయుధ దళాలకు, ఇతర రక్షణ సంస్థలకు  అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం, సుదీర్ఘమైన మన సరిహద్దులలో రవాణాకు విఘాతం కలగకుండా చూడటం, సామాన్య ప్రజానీకానికి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించటం వీరి పని. యుద్ధ ఇంజనీర్లు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, సరిహద్దు రహదారి సంస్థ, మిలిటరీ సర్వే అనే నాలుగు విభాగాలు నాలుగు మూలస్తంభాలుగా నిలిచి ఈ కార్యక్రమాలు చేపడతాయి.

ఇంజనీర్ సైనికులలో మూడు బృందాలుండేవి. మద్రాస్ శాపర్స్, బెంగాల్ శాపర్స్, బాంబే శాపర్స్ ఉండగా 1932 నవంబర్ 18న వీటిని విలీనం చేశారు. అప్పటినుంచి వీరి అత్యున్నత సేవలు చరిత్రలో భాగమయ్యాయి. అటు యుద్ధ సమయంలోనూ, ఇటు శాంతి సమయాల్లోనూ వీరి సేవలు అసమానంగా సాగుతూ వస్తున్నాయి.

***

 


(रिलीज़ आईडी: 1673889) आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil