రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణరంగ పరిశ్రమల్లో భాగస్వామ్యంపై ఇండొనేసియాతో వెబినార్, ఎక్స్ పో
Posted On:
18 NOV 2020 5:57PM by PIB Hyderabad
భారత రక్షణరంగ పరిశ్రమ- సహకార భాగస్వామ్యం కోసం అంతర్జాతీయ అనుబంధం అనే అంశం మీద నిన్న భారత్-ఇండొనేసియా మధ్య ఒక వెబినార్, ఎక్స్ పో జరిగింది. రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మిత్ర దేశాలతో వరుసగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా దీన్ని చేపట్తారు. దీనివలన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో 500 కోట్ల డాలర్ల మేరకు రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ఇరు దేశాలకు చెందిన కీలక అధికారులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు. సాయుధ బలగాలను ఆధునీకరించే క్రమంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం మీద, మరిన్ని అవకాశాలను వాడుకోవటం మీద వారు ఈ వెబినార్ లో చర్చించారు.
భారతదేశానికి చెందిన ఎల్ అండ్ టి డిఫెన్స్, అశోక్ లైలాండ్, భారత్ ఫోర్జ్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎంకెయు, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి వాటి గురించి వివరించాయి. ఇండొనేసియా వైపు నుంచి పిటి పిండాడ్, పిటి పాల్, పిటి ఎల్ ఇ ఎన్, పిటి దహనా , పిటి దిర్గంతర తమ ప్రజెంటేషన్ ఇచ్చాయి.
150 మందికి పైగా ఈ వెబినార్ లో పాల్గొన్నారు. ఎక్స్ పో లో 100 కి పైగా వర్చువల్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి.
***
(Release ID: 1673885)
Visitor Counter : 151