విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశం మొట్టమొదటి కన్వర్జెన్స్ ప్రాజెక్టును అమలు చేయడానికి గోవా డిఎన్ఆర్ఈ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఈఈఎస్ఎల్

వ్యవసాయ రంగంలో ఎంతో అవకాశం ఉన్న తాజా హరిత విప్లవానికి ఎంఓయు ప్రారంభమైంది: శ్రీ ఆర్.కె. సింగ్

వ్యవసాయం కోసం వికేంద్రీకృత సౌర,ఇంధన పొదుపు చేయగల పంపులు మరియు గ్రామీణ ఎల్‌ఈడీతో సహా, కన్వర్జెన్స్ ప్రాజెక్టులు రూపొందిస్తారు

Posted On: 17 NOV 2020 6:35PM by PIB Hyderabad

గోవాలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన విభాగం (డిఎన్ఆర్ఇ) క్రింద ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) దేశంలోనే మొట్టమొదటి కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ప్రారంభించడానికి ఈ రోజు అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.  కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి (ఇంచార్జి) శ్రీ ఆర్కె సింగ్, గోవా విద్యుత్ మంత్రి శ్రీ నీలేష్ కాబ్రాల్, విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ నందన్ సహాయ్ మరియు ఇతర సీనియర్ల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 

 

అవగాహన ఒప్పందం ప్రకారం, ఈఈఎస్ఎల్, డిఎన్ఆర్ఈ సాధ్యాసాధ్య అధ్యయనాలు, వికేంద్రీకృత సౌర శక్తి ప్రాజెక్టుల అమలును నిర్వహిస్తాయి. ఈఈఎస్ఎల్ సౌర శక్తి ప్రాజెక్టులను అమలు చేస్తుంది, 100 మెగావాట్ల వికేంద్రీకృత గ్రౌండ్ మౌంటెడ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను వ్యవసాయ పంపింగ్ కోసం ఉపయోగించుకోవాలి, సుమారు 6,300 వ్యవసాయ పంపులను బీఇ స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పంపులతో భర్తీ చేస్తుంది మరియు గ్రామీణ ప్రాంతాల గృహాలకు సుమారు 16 లక్షల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేస్తుంది.

ఈ సందర్భంగా విద్యుత్, కొత్త & పునరుత్పాదక ఇంధన శాఖ (ఇంచార్జి)మంత్రి శ్రీ ఆర్ కె సింగ్ మాట్లాడుతూ, ఈఈఎస్ఎల్ మరియు గోవా ప్రభుత్వాల మధ్య ఈ రోజు అవగాహన ఒప్పందం తాజా హరిత విప్లవానికి శ్రీకారం చుట్టినట్టు అని అన్నారు. 'మేము పీఎం-కుసుమ్ ను ప్రారంభించినప్పుడు, వ్యవసాయ రంగంలో తాజా హరిత విప్లవాన్ని పునః ప్రారంభించినట్టే అని అనుకున్నాము ఈ నమూనాను ఇతర రాష్ట్రాలు అవలంబిస్తాయని భావిస్తున్నాం, ఎందుకంటే వేల కోట్లను ఖర్చు చేస్తున్న అనేక రాష్ట్రాల్లో ఇది వ్యవసాయ రంగానికి నీటి ఖర్చుల పరంగా నష్టాలను తగ్గిస్తుంది' అని ఆయన అన్నారు. రైతులు విద్యుత్, భూగర్భ జలాలపై పొదుపు చేయడాన్ని ప్రోత్సహించాలని తన కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖను కోరినట్లు శ్రీ సింగ్ చెప్పారు. అలాగే పీఎం-కుసుమ్ క్రింద ఉన్న అవకాశాలను రాష్ట్రాలు ఉపయోగించుకుంటాయని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కొత్త రూఫ్ టాప్ సోలార్ స్కీమ్‌తో కలిసి ఇది రైతులు, రాష్ట్రాలకు ఇద్దరికీ లాభదాయకమే అనే విషయం రుజువు చేస్తుంది అని ఆయన తెలిపారు. వాటిని హరిత రాష్ట్రాలుగా మార్చడానికి సహాయపడుతుంది. కేంద్రం సాధ్యమయ్యే అన్ని విధాలా సహకారం అందిస్తుందని, ఈ విషయంలో సారథ్యం వహించాల్సిందిగా ఆయన గోవాను కోరారు.

******



(Release ID: 1673569) Visitor Counter : 204