ఆర్థిక మంత్రిత్వ శాఖ
జిఎస్‌టి అమలులో తక్కువపడిన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి ఆప్షన్ 1ను ఎంచుకోవాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్రం
ప్రత్యేక రుణ విండో ద్వారా రూ 2,380 కోట్లు, అదనపు రుణాల ద్వారా రూ 5,017 కోట్ల సమీకరణకు అనుమతి
Posted On:
17 NOV 2020 6:50PM by PIB Hyderabad
జిఎస్‌టి అమలులో తక్కువపడిన రెవిన్యూను సర్దుబాటు చేసుకునేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ సూచించిన రెండు ఆప్షన్లలో ఆప్షన్ -1కి తెలంగాణా రాష్ట్రప్రభుత్వం తన ఆమోదాన్ని కేంద్రానికి తెలియజేసింది. దీనితో ఆప్షన్ -1ని ఎంచుకున్న 22 ఇతర రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు(ఢి్లీ, జమ్ముకాశ్మీర్, పుదుచ్చేరి) సరసన చేరింది.
ఆప్షన్ 1 ఎంపిక చేసుకున్న రాష్ట్రాలు జిఎస్‌టి అమలు వల్ల తక్కువపడిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక రుణ విండో ద్వారా సమకూర్చుకోవచ్చు.ఈ విండో ప్రస్తుతం అమలులో ఉంది. భారత ప్రభుత్వం రాష్ట్రాల తరఫున మూడు వాయిదాలలో 18,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని దానిని 22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు 2020 అక్టొబర్ 23న 2020 అక్టొబర్ 23న,2020 నవంబర్ 2న బదిలీ చేసింది. ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ విండోద్వారా నిధులు అందుకుంటుంది. తదుపరి వాయిదా రుణం 2020 నవంబర్ 23న విడుదల కానుంది.
ఆప్షన్ 1 నిబంధనల కింద జిఎస్‌టి అమలువల్ల తగ్గిన మొత్తాన్ని సర్దుబాటు చేసేందుకు , రుణాలకు స్పెషల్ విండొ సదుపాయం లభించడమే కాక, రాష్ట్రాలు ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రస్థూల దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 0.5 శాతాన్ని తుది ఇన్‌స్టాల్‌మెంట్‌గా రుణంగా అందుకునేందుకు అనుమతి కలిగి ఉన్నాయి. ఇది భారత ప్రభుత్వం 2020 మే 17 న
ప్రకటించిన ఆత్మనిర్భర్ అభియాన్ కింద అనుమతించిన 2 శాతం అదనపు రుణసదుపాయ అనుమతిలో భాగం.
ఇది స్పెషల్‌విండో రూ 1.1 లక్షల కోట్ల రూపాయల కంటే అధికం. ఆప్షన్ 1 ని ఎంచుకున్నట్టు తెలంగాణా రాష్ట్రప్రభుత్వం తెలిపిన తర్వాత, భారత ప్రభుత్వం ఈరోజు తెలంగాణా రాష్ట్రప్రభుత్వానికి అదనంగా 5,017 కోట్ల రూపాయలు రుణం పొందేందుకు ( తెలంగాణా జిఎస్‌డిపిలో 0.5 శాతం. ) అనుమతి ఇచ్చింది.
ఆప్షన్ -1 ఎంపిక చేసుకున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, రాజస్థాన్,సిక్కిం, తెలంగాణా, త్రిపుర, తమిళనాడు, ఉత్తరప్రదేవ్, ఉత్తరాఖండ్ తొపాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, పుదుచ్చేరి ఉన్నాయి.ఈ రాష్ట్రాలకు ఇచ్చిన అదనపు రుణాల అనుమతి,స్పెషల్ విండో కింద సమీకరించిన మొత్తం, 22 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన మొత్తం అనుబంధంలో పొందుపరచడం జరిగింది.
రాష్ట్రాల వారీగా జిఎస్‌డిపిలో 0.50 రుణానికి అదనంగా అనుమతించిన రుణాలు, స్పెషల్ విండో ద్వారా రాష్ట్రాలకు 17-11-2020 వరకు బదలాయించిన మొత్తం.
S. No.
|
Name of State / UT
|
Additional borrowing of 0.50 percent allowed to States
|
Amount of fund raised thrugh special window passed on to the States/ UTs
|
1
|
Andhra Pradesh
|
5051
|
512.96
|
2
|
Arunachal Pradesh*
|
143
|
0.00
|
3
|
Assam
|
1869
|
220.87
|
4
|
Bihar
|
3231
|
866.51
|
5
|
Goa
|
446
|
186.36
|
6
|
Gujarat
|
8704
|
2046.80
|
7
|
Haryana
|
4293
|
966.04
|
8
|
Himachal Pradesh
|
877
|
381.13
|
9
|
Karnataka
|
9018
|
2754.08
|
10
|
Madhya Pradesh
|
4746
|
1008.21
|
11
|
Maharashtra
|
15394
|
2658.85
|
12
|
Manipur*
|
151
|
0.00
|
13
|
Meghalaya
|
194
|
24.77
|
14
|
Mizoram*
|
132
|
0.00
|
15
|
Nagaland*
|
157
|
0.00
|
16
|
Odisha
|
2858
|
848.39
|
17
|
Rajasthan
|
5462
|
327.01
|
18
|
Sikkim*
|
156
|
0.00
|
19
|
Tamil Nadu
|
9627
|
1385.52
|
20
|
Telangana#
|
5017
|
0.00
|
21
|
Tripura
|
297
|
50.43
|
22
|
Uttar Pradesh
|
9703
|
1333.32
|
23
|
Uttarakhand
|
1405
|
514.28
|
|
Total:
|
88931
|
16085.53
|
1
|
Delhi
|
0.00
|
1301.77
|
2
|
Jammu & Kashmir
|
0.00
|
504.26
|
3
|
Puducherry
|
0.00
|
108.44
|
|
Total:
|
0.00
|
1914.47
|
|
Grand Total
|
88931
|
18000.00
|
* These States have ‘NIL’ GST compensation gap
# Funds will be released starting from next round of borrowing.
******
(Release ID: 1673540)
Visitor Counter : 207