సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
రికార్డ్ అమ్మకాలు నమోదు చేసిన ఖాదీ
- గడిచిన 40 రోజుల్లో ఫ్లాగ్‌షిప్ సీపీ అవుట్‌లెట్లలో నాలుగు సార్లు ఒక్కరోజు అత్యధిక అమ్మాకాలు నమోదు
Posted On:
16 NOV 2020 3:43PM by PIB Hyderabad
దేశంలో ఆర్థిక ఇబ్బందులు, కరోనా మహమ్మారి చుట్టుముడుతున్న భయాలు నెలకొన్నప్పటికీ.. ప్రస్తుత పండుగ సీజన్‌లోనూ ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలలో నమోదవుతున్నాయి.తద్వారా ఖాదీ చేతి వృత్తులవారికి గొప్ప డివిడెండ్లను పంచుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 2 నుండి మొదలుకొని కేవలం 40 రోజుల వ్యవధిలో న్యూఢిల్లీ కన్నెట్‌ప్లేస్‌లోని ఖాదీ ఇండియా అవుట్‌లెట్‌లో నాలుగుసార్లు కోటి రూపాయలకు పైగా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ నెల 13న ఈ అవుట్‌లెట్‌లో మొత్తం అమ్మకం రూ.1.11 కోట్లుగా నిలిచాయి. ఈ ఏడాది లాక్‌డౌన్ తరువాత వ్యాపార కార్యకలాపాలు మొదలైయ్యాక అత్యధికంగా జరిగిన ఒకే రోజు అమ్మకం ఇదే. ఈ ఏడాది గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజు ఖాదీ అమ్మకాలు 1.02 కోట్ల రూపాయలను తాకింది. అక్టోబర్ 24న రూ.1.05 కోట్ల రూపాయలు, నవంబర్ 7న 1.06 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి.
అంతకుముందు 2018లో నాలుగు సందర్భాలలో ఒక్క రోజు అమ్మకాలు రూ.1 కోటి మార్క్‌ను దాటాయి. అక్టోబర్ 13న సంవత్సరానికి అత్యధిక సింగిల్-డే అమ్మకం రూ.1.25 కోట్ల రూపాయలను తాకింది. ఖాదీ అత్యధిక సింగిల్-డే అమ్మకం అక్టోబర్ 2, 2019న నమోదుఅయింది. ఆ రోజున అమ్మకాలు రూ.1.27 కోట్లుగా నమోదుఅయింది. 2016 కి ముందు ఖాదీ యొక్క ఒకే రోజు అమ్మకాలు ఎప్పుడూ రూ.1 కోట్ల మార్కును దాటలేదు. అక్టోబర్ 22, 2016న సీపీలో గల ఖాదీ ఇండియా అవుట్‌లెట్‌లో ఒకే రోజు అమ్మకం రూ.116.13 లక్షలకు చేరుకుంది. కేవీఐసీ ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ "స్వదేశీ" మరీ ముఖ్యంగా ఖాదీని ప్రోత్సహించాలంటూ ప్రధాన మంత్రి మోడీ తరచూ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా భారీగా ఖాదీ అమ్మకపు గణాంకాలు ఉన్నాయని ఆయన అన్నారు. "ఖాదీ, గ్రామ పరిశ్రమల రంగాలకు వెన్నెముకగా నిలిచిన చేతివృత్తులవారికి మద్దతును ఇవ్వడానికి.. పెద్ద సంఖ్యలో ఖాదీ ప్రేమికులు ముందుకు రావడం హృదయ పూర్వకంగా కనిపిస్తోంది. దేశంలో మహమ్మారి విస్తరించివున్నప్పటికీ, ఖాదీ చేతివృత్తులవారు ఉత్పాదక కార్యకలాపాలను పూర్తి శక్తితో కొనసాగించారు, తోటి దేశస్థులు అదే ఉత్సాహంతో పరస్పర సహకారంతో వ్యవహరించారు” అని సక్సేనా అన్నారు. ఆర్థిక మందగమనం నెలకొని ఉన్నప్పటికీ కేవీఐసీ ఖాదీ యొక్క వృద్ధి వేగాన్ని కొనసాగించగలిగింది. ఈ సంవత్సరం ఖాదీ ఉత్పత్తుల యొక్క విపరీతమైన అమ్మకం ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది. కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో దాదాపు అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ కేవీఐసీ దేశవ్యాప్తంగా దాని విభిన్న కార్యకలాపాలతో ముందుకు సాగింది. దీనిలో ముఖ మాస్క్‌ల తయారీ కూడా ఉంది. హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్స్ వంటి వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు కాకుండా విస్తృత శ్రేణి ఫ్యాబ్రిక్, గ్రామ పరిశ్రమల ఉత్పత్తులు తదితరాలు ఉన్నాయి. లాక్‌డౌన్ ఖాదీ చేతివృత్తులవారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది. "ఆత్మ నిర్భర్ భారత్" మరియు "వోకల్ ఫర్ లోకల్" కోసం ప్రధాన మంత్రి చేసిన విజ్ఞప్తి స్థానిక తయారీని మరీ ముఖ్యంగా ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల రంగాలలో కొత్త జీవితాన్ని నింపింది.
ఖాదీ యొక్క ఒక్క రోజు అమ్మకాల వివరాలు:
· అక్టోబరు 4, 2014 – రూ.66.81 లక్షలు
· అక్టోబరు 2, 2015 – రూ. 91.42 లక్షలు
· అక్టోబరు 22, 2016 – రూ. 116.13 లక్షలు
· అక్టోబరు 17, 2017 – రూ. 117.08 లక్షలు
· అక్టోబరు 2, 2018 – రూ.105.94 లక్షలు
· అక్టోబరు 13, 2018 – రూ. 125.25 లక్షలు
· అక్టోబరు 17, 2018 – రూ. 102.72 లక్షలు
· అక్టోబరు 20, 2018 – రూ. 102.14 లక్షలు
· అక్టోబరు 2, 2019 – రూ. 127.57 లక్షలు
· అక్టోబరు 2, 2020 – రూ.102.24 లక్షలు
· అక్టోబరు 24, 2020 – రూ. 105.62 లక్షలు
· నవంబరు 7, 2020 – రూ.106.18 లక్షలు
· నవంబరు 13, 2020 – రూ.111.40 లక్షలు
*****
(Release ID: 1673348)
Visitor Counter : 163