ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆస్తులను ద్రవ్యరూపంలోకి మార్చేందుకు ప్రపంచబ్యాంకు సలహా సేవల ఒప్పందంపై సంతకాలు చేసిన డిఐపిఎఎం
Posted On:
16 NOV 2020 5:54PM by PIB Hyderabad
పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తి నిర్వహణ విభాగం (డిఐపిఎఎం) సోమవారంనాడు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం పై సంతకాలు చేసింది. ఒప్పందం కింద ప్రపంచ బ్యాంకు ఆస్తులపై ఆదాయాన్ని ఆర్జించడం లేక వాటిని ద్రవ్య రూపంలోకి మార్చేందుకు సలహాలను అందిస్తుంది.
వ్యూహాత్మక పెట్టుబడుల కింద ప్రభుత్వ సిపిఎస్ిలకు చెందిన మౌలిక ఆస్తులను ద్రవ్యరూపంలోకి మార్చడం లేక మూసివేతకు, రూ.100 కోట్లు ఆపైన విలువ కలిగిన శత్రువుల ఆస్తులను ద్రవ్యంగా మార్చడం డిఐపిఎం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.మౌలిక ఆస్తులు కాని వాటిని ద్రవ్యరూపంలోకి మార్చేందుకు డిఐపిఎంకు ఒక చట్రం ఉంది. ఆర్థిక మంత్రి ఆమోదించిన ప్రపంచ బ్యాంక్ సలహా ప్రాజక్టు భారతదేశంలో ప్రభుత్వ ఆస్తులను ద్రవ్యరూపంలోకి మార్చడాన్ని లేక దానిపై ఆదాయాన్ని ఆర్జించే విధానాలను విశ్లేషించి,అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా వ్యవస్థాగతమైన, వ్యాపార నమూనాలను బెంచి మార్కు చేయడంతో పాటుగా, కార్యాచరణ మార్గదర్శకాలను, వాటి అమలుకు అవసరమైన సామర్ధ్య నిర్మాణానికి తోడ్పడుతుంది.
ఈ ప్రాజెక్టు అదనపు పెట్టుబడులు, వృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను పెంచే సంభావ్యతగల మౌలికేతర ఆస్తులను ద్రవ్య రూపంలోకి మార్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు, ఈ ఉపయోగించని/ లఏక స్వల్పంగా ఉపయోగించే ఆస్తుల విలువను బహిర్గతం చేసేందుకు తోడ్పడుతుంది.
***
(Release ID: 1673344)
Visitor Counter : 177