నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
వ్యవసాయ రంగంలో మరింత సౌర విద్యుత్ ఉత్పాదనకు వీలుగా పిఎం-కుసుమ్ పథకం పరిధిని విస్తరించిన ఎం.ఎన్.ఆర్.ఇ
రైతులకు చెందిన పచ్చికబయళ్లు, బీడు భూములు, చిత్తడి నేలలు, వ్యవసాయభూములు, సాగులో లేని భూములలో సౌరవిద్యుత్ ప్లాంటులు ఏర్పాటు చేసుకోవచ్చు
చిన్నరైతులు కూడా ఇందులో పాల్గొనేందుకువీలుగా సౌరవిద్యుత్ కేంద్రం సైజునుకూడా తగ్గించారు.
నీటివినియోగ సంఘాలు (డబ్ల్యుఎలు), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్.పి.ఒలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) లేదా క్లస్టర్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలకు సోలార్‌పంపుసెట్లు ఏర్పాటు చేసి వాడుకునేందుకు సిఎఫ్ఎ అంగీకరించింది.
యూనివర్సల్ సోలార్ పంప్ కంట్రోలర్‌తో సౌరవిద్యుత్ పంపులకు ప్రత్యేక బిడ్లు ఆహ్వానించనున్నారు.
యుఎస్ పిసి పంపు లకు సబ్సిడీకూడా అందనుంది.
Posted On:
13 NOV 2020 1:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాఅభియాన్ (పిఎం-కెయుఎస్‌యుఎం) పథకం అమలులో తొలి ఏడాది అనుభవాలనుంచి తెలుసుకున్న అంశాల ఆధారంగా ఎం.ఎన్.ఆర్.ఇ పథకం అమలు మార్గదర్శకాలను సవరించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ క మిటీ 19-02-2019 న జరిగిన సమావేశంలో పిఎం-కెయుఎస్‌యుఎం పథకాన్ని ఆమోదించింది. ఈ పథకంలో మూడు భాగాలున్నాయి. కాంపొనెంట్ -ఎ లో వికేంద్రీకృత గ్రౌండ్ మౌంటెడ్ గ్రిడ్ అనుసంధానిత పునరుత్పాదక ఇంధన ప్లాంట్లుల ఏర్పాటు ఉండగా , కాంపొనెంట్ బి లో సౌర విద్యుత్ తో నడిచే వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. కాంపొనెంట్ -సి కింద గ్రిడ్ అనుసంధానిత వ్యవసాయ పంపులకు సౌర విద్యుత్ కల్పించడం ఉన్నాయి.
ఈ పథకం అమలు మార్గదర్శకాలకు సంబంధించి మంత్రిత్వశాఖ కింది సవరణలు, వివరణలు జారీచేసింది.
కాంపొనెంట్ ఎ కు సంబంధించి సవరణలు, వివరణలు:
కాంపొనెంట్ -ఎ, విషయంలో పచ్చికబయళ్లు కలిగిన రైతులు,చిత్తడి నేలలు కలగిన రైతులకు దీని పరిధిని విస్తరింపచేశారు.
చిన్న రైతులుకూడా పాల్గొనేందుకు వీలుగా సౌరవిద్యుత్ ప్లాంటు సైజును తగ్గించారు.పూర్తిచేయడానికి సమయాన్ని 9 నెలలనుంచి 12 నెలలకు పెంచారు. దీనికితోడు రైతులు సులభంగా దీనిని అమలు చేయడానికి వీలుగా విద్యుత్ ఉత్పత్తిలో కొరత ఏర్పడితే దానికి పెనాల్టీ విధించడాన్ని తొలగించారు.
కాంపొనెంట్ ఎ విషయంలో సవరణలు, వివరణలు:
బీడుభూములు, వ్యవసాయ భూములతోపాటు పచ్చికబయళ్లు కలిగిన భూములు చిత్తడి నేలలలో కూడా సౌరవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.
చిన్న రైతులకు మద్దతు ఇవ్వడానికి సౌర విద్యుత్ ప్రాజెక్టులు 500 కిలోవాట్ల కంటే తక్కువ వాటిని రాష్ట్రాలు వాటి సాంకేతిక వాణిజ్య సాధ్యాసాధ్యాలను బట్టి చేపట్టడానికి అనుమతించవచ్చు.
ఎంపిక చేసిన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిదారు సౌరవిద్యుత్ ప్లాంటును లెటర్ ఆఫ్ అవార్డు అందుకున్న నాటి నుంచి 12 నెలల లోగా సోలార్ పవర్ ప్లాంటును ప్రారంభించాలి.
సౌరవిద్యుత్ ఉత్పత్తి విషయంలో కనీస నిర్దేశిత సామర్ధ్యానికంటే తక్కువ ఉత్పత్తి (సియుఎఫ్) జరిగితే దానిపై పెనాల్టీ ఉండదు.
కాంపొనెంట్ -బి కి సవరణలు ,వివరణలు :
కాంపొనెంట్ -బికి సవరణలు ,వివరణలలో భాగంగా , ఎం.ఎన్.ఆర్.ఇ 33 శాతం అర్హతకలిగిన సర్వీసు చార్జీలను దేశవ్యాప్త సమాచార విద్య, కమ్యూనికేషన్ కార్యకలాపాలకు ఉంచుకుంటుంది.ముందస్తు కార్యకలాపాలకు ఎల్.ఒ.ఎ కుదుర్చుకున్న తర్వాత ఎంపికచేసిన మొత్తానికి అర్హత కలిగిన సర్వీసు చార్జీలలో 50 శాతం మొత్తాన్ని మంత్రిత్వశాఖ విడుదల చేయవచ్చు. సోలార్ పంపులను ఏర్పాటు చేసి వాటిని నీటి వినియోగ సంఘాలు, రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, లేదా క్లస్టర్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలు వినియోగించుకోవచ్చు. గ్రూప్‌లో ఒక్కొక్కటి 5 హెచ్‌పి కెపాసిటీ వరకు పరిగణనలోకి తీసుకుంటూ సొలార్ పంపుల సామర్ధ్యాన్ని 7.5 హెచ్‌పికి మించి సిఎఫ్ఎ అనుమతించనున్నారు.
కేంద్రీకృత టెండర్‌లో పాల్గొనడానికి అర్హతలో మార్పు చేశారు. చివరి బిడ్ సమయంలో కేవలం సోలార్ పంపులు, సోలార్ పానల్ తయారీదారులు మాత్రమే పాల్గొనడానకి అనుమతిస్తారు. రాగల 5 సంవత్సరాలకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు తర్వాత సేవల నాణ్యతలను పరిగణనలోకి తీసుకుని దీనిని అనుమతిస్తారు. అమలు సమయంలో ఈ తయారీదారులకు తగినంత మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో లేక , స్థౄనిక ఇంటిగ్రేటర్లమీద ఈ పనులకు ఆధారపడాల్సి వస్తుంది. ఇది సోలార్ పంపుల ఏర్పాటులో జాప్యానికి కారణమౌతుంది.
ఈ సమస్యను అధిగమించడానికి అలాగే నాణ్యతను పరిరక్షించి, యూనిట్ స్థాపన తర్వాత సేవలు కొనసాగడానికి సోలార్‌పంపు, సోలార్ ప్యానల్ సోలార్ పంప్ కంట్రోలర్లను ఇంటిగ్రేటర్లతో కలవడానికి వీలుకల్పిస్తూ నిర్ణయించారు. కేంద్రీకృత టెండర్ విధానంలో ఏదైనా ఒక కేటగిరీకి చెందిన వారు లేదా రెండు కేటగిరీలకు చెందిన వారిని టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఈ ఆర్డర్ అనుమతిస్తుంది:
సోలార్ పివి మాడ్యూళ్లు లేదా సోలార్ పంపుల తయారీ లేదా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సోలార్ పంప్ కంట్రోలర్లుతయారు చేసేవారు.
సిస్టమ్ ఇంటిగ్రేటర్లతో కలిసి పైన పేర్కొన్న ఏదైనా తయారీ దారుకు చెందిన సంయుక్త వెంచర్.
ఈ ఆదేశాల ప్రకారం మొత్తం పరిమాణంలో పది శౄతం మొత్తానికి సమానమైన (సమీప పూర్ణ సంఖ్యకు దగ్గరగా) ప్రత్యేక కేటటగిరీ, క్లస్టర్‌కు చెందిన ఆయా రకాల పంపులను ఎల్ -1 బిడ్డర్‌కు కేటాయిస్తారు. మిగిలినవాటిని మార్కెట్ మోడ్‌లో అందరు ఎంపిక చేసిన బిడ్డర్లకోసం కేటాయిస్తారు.ఇందులో ఎల్ 1 బిడ్డర్‌కూ అవకాశం ఉంటుంది.
ఈ విధమైన హామీతోకూడిన కేటాయింపు వల్ల బిడ్ విషయంలో శ్రద్ధ, పోటీ ఉంటుంది. దానికితోడు ఎల్ 1 ధరతో సమానధరకు ప్రాధమికంగా అందరు బిడ్డర్లకూ అంటే ఎల్ -1 + 15 శాతం కేటగిరీ కిందికి వచ్చే వారికి అవకాశం కల్పిస్తారు. ఒకవేళ ఈరేంజ్‌లో బిడ్డర్ల సంఖ్య 5 కంటే తక్కువ ఉంటే దీనిని ఇతర బిడ్డర్లకు కూడా వర్తింపచేసి ఎగువ దిశగా వారు కోట్ చేసిన ధరను ఐదుగురు బిడ్డర్లు ఎల్ -1 మ్యాచింగ్ కు అంగీకరించేవరకు లేదా అందరు బిడ్డర్లకు ఎల్ -1 ధరతో పోలిన ధర వరకు ఏది ముందు అయితే దానికి అవకాశం ఇస్తారు.
స్పెసిఫికేషన్లు, టెస్టింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను సవరించారు. ఒకే నమూనాను పదే పదే పరీక్షించకుండా ఉండేందుకు , సత్వర అమలుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సోలార్ పంపు స్పెసిఫికేషన్లను ఎం.ఎన్.ఆర్.ఇ 2019 జూలైలో అప్‌డేట్ చేసింది. ఆ నిబంధనలను పిఎం-కెయుఎస్‌యుఎం పథకానికి వర్తింపచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న దాని ప్రకారం, వెండర్కు ప్రతి కేటగిరీ సోలర్ పంపుకు సంబంధించి టెస్టు సర్టిఫికేట్, వెండర్ పేరుమీద జారీ అయినది ఉండాలి. దీనితో ఒకే సోలార్ నీటి పంపు వ్యవస్థను పలుమార్లు పరీక్షించవలసి వస్తుంది. ఇది సమయం వృధాకావడమే కాక, ఖర్చుతో కూడుకున్నది. దీనివల్ల ఎలాంటి విలువ అదనంగా వచ్చి చేరదు.
దీనిని అధిగమించడానికి, సొలార్ పంపు వ్యవస్థకు ఇప్పటికే అందుబాటులో ఉన్న టెస్ట్ సర్టిఫికేట్‌ను ఇతర వాటికి ఉపయోగించవచ్చు. అయితే అదే టెస్ట్ సర్టిఫికేట్‌ను ఉపయోగించుకోవడానికి దానిని ఉపయోగించేవారు యజమాని నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవలసి ఉంటుంది. దానికితోడు, ఇప్పటికే పరీక్షించిన సోలార్ పంపు వ్యవస్థ విషయంలో ఏవైనా మార్పులు ఉంటే దానికి టెక్నికల్ కంపాటబిలిటీ సర్టిఫికేట్ను , యజమాని నుంచి అంగీకార పత్రాన్ని తీసుకురావలసి ఉంటుంది.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం యూనివర్సల్ సోలార్ పంప్ కంట్రోలర్ (యుఎస్‌పిసి) కలిగిన, సోలార్ వాటర్ పంపింగ్ వ్యవస్థకు వేరుగా బిఢ్ ధరను ఆహ్వానిస్తారు. అలాగే ఈ పంపులకు యుఎస్‌పిసి లేకుండా వాటిబెంచ్‌మార్క్‌ధర ప్రకారం సబ్సిడీ అందుబాటులో ఉండేట్టు చూస్తారు.
స్టాండ్ అలోన్ సోలార్ పంపులను కేవలం ఏడాదిలో 100 నుంచి 150 రోజులు మాత్రమే వాడుతారు. మిగిలిన రోజులలో ఉత్పత్తి అయ్యే సౌరవిద్యుత్‌ను ఉపయోగించుకోరు. సౌర విద్యుత్‌ను మరింత పకడ్బందీగా వినియోగించుకునేందుకు యుఎస్‌పిసిని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడం జరిగింది.ఇది వాటర్ పంప్ ను నడిచేట్టు చేయడమే కాక ఇతర విద్యుత్ పరికరాలైన కోల్డ్ స్టోరేజ్, బ్యాటరీ చార్జింగ్ , పిండి మిల్లు, వంటి వాటికి విద్యుత్ ను అందిస్తుంది. యుఎస్‌పిసి రైతుకు రాబడి పెంచుతుంది. ఇదే పిఎ-కెయుఎస్‌యుఎం పథకం లక్ష్యం.
సి -కాంపొనెంట్‌కు సవరణలు, వివరణలు :
కాంపొనెంట్ -సి కింద మంత్రిత్వశాఖ ఐఇసి కార్యకలాపాలకు 33 శాతం సర్వీసు చార్జీలను వాడుతుంది. ముందస్తు కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు వీలుగా సర్వీసు చార్జీలను ముందస్తుగా విడుదల చేసేందుకు వెసులుబాటు ఉంది. ఎం.ఎన్.ఆర్.ఇ , అర్హత కలిగిన సర్వీసు చార్జీలలో 50 శాతం మొత్తాన్ని, ఆమోదిత పరిమాణానికి ఎల్.ఒ.ఎ తర్వాత ఆయా కార్యకలాపాలు చేపట్టడానికి విడుదల చేయవచ్చు.
కాంపొనెంట్ -సి కింద, రైతులు వ్యక్తిగతంగా గ్రిడ్ అనుసంధానిత వ్యవసాయ పంపులు కలిగినవారు తమ పంపులను సోలార్ విద్యుత్‌తో నడిచేలా చేసేందుకు మద్దతునిస్తారు. రైతులకు సోలార్ ప్యానళ్లు అందిస్తారు. దీనివల్ల వారు ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తమ వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకుని మిగిలిన సౌర విద్యుత్‌ను అమ్ముకోవచ్చు. డిస్కంలు వారి నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి.ఇందుకు ముందుగా నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తారు. దీనిని సంబంధిత రాష్ట్రాలు, ఎస్.ఇ.ఆర్‌సిలు నిర్ణయిస్తాయి. పంపు కెపాసిటీ కన్నా రెండు రెట్ల సోలార్ పివి సామర్ధ్యం గల వాటిని ఈ పథకం కింద అనుమతిస్తారు. నీటివినియో సంఘాలు, కమ్యూనిటీ , క్లస్టర్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలు వాడే భారీ కెసాసిటీ పంపుల విషయంలో సిఎఫ్ఎ వర్తింపును గతంలో స్కీమ్ మార్గదర్శకాలలో ప్రస్తావించలేదు. అయితే ఇప్పడు ఆ విషయంలో స్పష్టత ఇచ్చారు. నీటివినియోగ సంఘాలు, రైతుల ఉత్పత్తి సంస్థలు , ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు లేదా క్లస్టర్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలు ఉపయోగించే గ్రిడ్ అనుసంధానిత పంపులకు సిఎఫ్ ఎ ని అనుమతిస్తారని అయితే సౌరవిద్యుత్‌తో నడిచే పంపు సామర్ధ్యం 7.5 హెచ్‌పి కంటే ఎక్కువ సామర్ధ్యం గ్రూప్‌లొని ప్రతి ఒక్కటి కలిగి ఉండాలని తెలిపింది.
***
(Release ID: 1672784)
Visitor Counter : 547