ఆర్థిక మంత్రిత్వ శాఖ

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 12 NOV 2020 1:47PM by PIB Hyderabad

ప్రముఖ టోకు బులియన్,  బంగారు ఆభరణాల వ్యాపారికి చెందిన ఒక కేసుకు సంబంధి ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ నెల 10వ తేదీన సోదాలు నిర్వ‌హించింది.
చెన్నై, ముంబ‌యి, కోల్‌కతా, కోయంబ‌త్తూర్, సేలం, తిరుచ్చి, మధురైల‌తో పాటు తిరునెల్వేలిలోని 32 చోట్ల ఈ సోదాలు జరిపారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారుల‌కు సోదాల్లో ల‌భించిన సాక్ష్యాల‌లో వివిధ ప్రదేశాలలో మదింపుదారుడు లెక్కించని స్టాక్ ఉన్నాయి. సుమారు రూ.400 కోట్ల విలువైన దాదాపు 814 కిలోల అదనపు స్టాక్‌ను క‌నుగోన్న అధికారులు.. దానిని ఆదాయ‌పు ప‌న్న ప‌రిధిలోనికి తేనున్నారు. ఇది వ్యాపారానికి సంబంధించిన స్టాక్‌ కాబట్టి, ఆదాయపు పన్ను చట్టం 1961 ప్ర‌కారం దీనిని స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదు. వ్యాపారికి సంబంధించిన గ్రూపు నిర్వ‌హిస్తున్నసిస్ట‌మ్స్‌లో స‌మాచారం ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి పుస్త‌కాల‌లో చూప‌ని రూ.102 కోట్ల నిక‌ర ఆదాయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. సిస్ట‌మ్స్‌లో నిక్ష‌ప్త‌మై ఉన్న‌2019-20, 2020-2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి వెలికితీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అదే విధంగా సంస్థ వ్యాపార ప్రాంగణంలో లభించిన 50 కిలోల అదనపు స్టాక్‌ను కూడా స్వాధీనం చేసుకోలేదు. కానీ దీనిలో లెక్క‌కు చూప‌ని ఆదాయంను గుర్తించే చ‌ర్య‌లు చేప‌ట్టారు. వ్యాపార వాస్తవాలను తెలివిగా దాచడానికి ఈ గ్రూపు జేప్యాక్ అనే కస్టమ్ మేడ్ ప్యాకేజీ నిర్వహిస్తోంది. బిల్లులు/ ఇన్వాయిస్‌లను ర‌ఫ్ ఎస్టిమేష‌న్ రూపంలో పెంచడం ద్వారా వస్తువులు రవాణా చేశార‌ని గుర్తించారు. వీటిని సరుకు పంపిణీ త‌రువాత అందుబాటులో లేకుండా చేశారు. సేకరించిన డేటా ఆధారంగా ఇతర పార్టీల వారి లెక్కించని లావాదేవీలను వెలికితీసేందుకు ఇలా పొందిన డేటా ఉపయోగించబడుతుంది. ప్రత్యేక సాధనాలను ఉపయోగించే ఫోరెన్సిక్ నిపుణులు లెక్కించని ఆదాయంను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని తుది ఆదాయ‌పు పరిమాణాన్ని తెలుసుకోవ‌డానికి ఎక్కువ డేటాను శోధిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన సోదాల‌లో దాదాపు ప‌న్ను ప‌రిధిలో వెల్ల‌డించ‌ని దాదాపు రూ.500 కోట్ల మేర ఆదాయాన్ని గుర్తించారు. ఇందులో మదింపుదారుడు రూ.150 కోట్ల సొమ్మును స్వ‌చ్ఛంద ఆదాయ‌పు వెల్ల‌డి ప‌థ‌కం కింది బ‌య‌ట‌కు వెల్ల‌డించారు. ఈ గ్రూపు వ్యాపారేతర పెట్టుబడులపై దర్యాప్తుతో పాటుగా లాభాలను త‌క్కువ‌గా చూపేందుకు వసతి ఎంట్రీలను ఉపయోగించిన విష‌యంపై విచార‌ణ పురోగతిలో ఉంది.


 

****


(Release ID: 1672284) Visitor Counter : 362