ఆర్థిక మంత్రిత్వ శాఖ

సుమారు 685 కోట్ల రూపాయల బోగస్ ఇన్వాయిస్‌ల కుంభకోణం బట్టబయలు

Posted On: 12 NOV 2020 10:06AM by PIB Hyderabad

నకిలీ జీఎస్టీఎన్లు, డమ్మీ కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్లు, ఈ–వేలు బిల్లులు సృష్టించి ఐజీఎస్టీ రీఫండ్లు పొందిన కంపెనీల సిండికేట్  డేటా మైనింగ్ / విశ్లేషణ ఆధారంగా ఢిల్లీ సౌత్ కమిషనరేట్ సీజీఎస్టీ అధికారులు ఛేదించారు.

దీంతో మెసర్స్ బాన్గంగా ఇంపెక్స్,  ఎల్ -10 ఎ, గంగా టవర్, మహిపాల్పూర్, న్యూ ఢిల్లీ -110037 (జిఎస్టీన్ 07AAMFB0425A1Z4)పై కేసు నమోదయింది. ఇక్కడే ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంది. స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించగా, ఈ-వే పోర్టల్ / జిఎస్టిఎన్ పోర్టల్ లో లభించే డేటా / సమాచారం ఆధారంగా గంగా ఇంపెక్స్, ప్రస్తుతం ఉనికిలో లేని 48 సంస్థల నుండి ఇన్వాయిస్లను సృష్టించింది. ఐటీసీలను వీటి మధ్య బదిలీ చేసింది. చివరగా, అన్ని సరఫరాదారుల నుండి ఐటిసిలు బాన్ గంగా ఇంపెక్స్కు వెళ్లాయి. బదులుగా రిజిస్టర్ కాని సప్లయర్లు చేసిన ఎగుమతుల ద్వారా ఇది రీఫండ్లు పొందింది.  ఈ-వే బిల్లులను తయారు చేయడానికి నకిలీ వాహన సంఖ్యలను ఉపయోగించింది. వీటిలో ద్విచక్ర వాహనాలు, బస్సులు, జెసిబి, ప్రైవేట్ కార్లు , అంబులెన్స్ మొదలైనవి ఉన్నాయి.

గంగా ఇంపెక్స్ నకిలీ సంస్థల నుండి రూ. 685 కోట్లు (సుమారుగా) విలువైన ఇన్వాయిస్లను పొందింది.  రూ. 50 కోట్లు (సుమారుగా) జీఎస్టీని కట్టినట్టు చూపింది. ఫలితంగా రూ. 35 కోట్లు (సుమారు) కోట్ల విలువైన రీఫండ్లను పొందింది.   ప్రధాన లబ్ధిదారుడు , ఈ కుంభకోణం సూత్రధారి గంగా ఇంపెక్స్  భాగస్వామి అయిన  రాకేశ్ శర్మను 09.11.2020 న అరెస్టు చేసి, అదేరోజు సాకేత్ కోర్టులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోవిడ్ సహా ఇతర వైద్య పరీక్షల అనంతరం రాకేశ్ శర్మను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

***


(Release ID: 1672253) Visitor Counter : 239