హోం మంత్రిత్వ శాఖ

గౌతమ్ బుద్ధ నగర్ , ఘజియాబాద్ జిల్లాల్లో నివసిస్తున్న విదేశీ భారత పౌరుల(ఓసీఐ) కార్డ్ హోల్డర్లకు సంబంధించి సేవలను ఢిల్లీ ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలోకి తేవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.

కేరళలో మూడు ఎఫ్ఆర్ఆర్ఓలు ఏయే జిల్లాల ఓసీఐ కార్డ్ హోల్డర్లకు సేవలు అందించాలో స్పష్టంగా పేర్కొన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం విదేశీ యాత్రికుల భారతదేశంలో ఉండటానికి అనేక చర్యలు తీసుకున్నది.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) , కేరళ , లక్షద్వీప్‌లో నివసిస్తున్న విదేశీ పౌరులు మరింత సులభతరంగా సేవలు పొందేలా చేసే అవకాశం.

Posted On: 11 NOV 2020 7:29PM by PIB Hyderabad

గత కొన్నేళ్లుగా, ప్రధానమంత్రి   నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల భారతదేశంలో ఉండటానికి అనేక చర్యలు తీసుకుంది. ఈ దిశగా కేంద్ర హోంమంత్రి   అమిత్ షా ఆదేశాల మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) మరో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డ్ హోల్డర్లు మనదేశంలోని వివిధ ప్రాంతాలలో నివసించడం సులువు అవుతుంది.  అటువంటి కార్డుదారులకు సంబంధించి వివిధ సేవలకు దరఖాస్తులను స్వీకరించడం , ప్రాసెస్ చేయడం వంటి వాటి కోసం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ , ఘజియాబాద్ జిల్లాలను ఢిల్లీలోని ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలోకి తీసుకువచ్చారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) లో నివసించే విదేశీ పౌరులకు వీసా , ఓసిఐ సంబంధిత సేవలను పొందటానికి ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని భావిస్తున్నారు.

ఇప్పటివరకు, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ , ఘజియాబాద్ జిల్లాల ఓసీఐ కార్డుదారులు అందజేసే దరఖాస్తులను స్వీకరించడం , ప్రాసెస్ చేయడం చేసే బాధ్యత లక్నోలోని ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలో ఉండేది. ఈ జిల్లాల్లో నివసిస్తున్న ఓసిఐ కార్డుదారులకు ఇది అసౌకర్యంగా ఉంది. ఇప్పటికే మూడు జిల్లాల్లోని విదేశీయుల వీసా, ఓసీఆర్ వంటి సేవలు ఢిల్లీలోని ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలో ఉన్నాయి.  హర్యానా , రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించిన  ఓసీఆర్, వీసా సేవలు కూడా ఢిల్లీ, ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలోకే వస్తాయి.

 ఓసీఐ కార్డ్ హోల్డర్లకు సంబంధించి వివిధ సేవలకు దరఖాస్తులను స్వీకరించడం , ప్రాసెస్ చేయడం కోసం కేరళలోని మూడు ఎఫ్ఆర్ఆర్ఓ ల  అధికార పరిధిని స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించారు. దీని ప్రకారం, కేరళలోని కన్నూర్, కాసర్గోడ్, కోళికోడ్, మలప్పురం , వయనాడ్ జిల్లాలు కోళికోడ్లోని ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలో ఉంటాయి. అలప్పుజ, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, పాలక్కాడ్ , త్రిస్సూరు జిల్లాలు కొచ్చి. కొల్లాం, పతనమిట్ట, తిరువనంతపురం జిల్లాలు తిరువనంతపురం ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలో ఉంటాయి. కేరళ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో నివసిస్తున్న విదేశీయులకు ఓసిఐ సేవలను మంజూరు చేయడానికి ఈ ఎఫ్ఆర్ఆర్ఓ దోహదపడుతుంది.

కార్డు హోల్డర్లకు మరింత బాగా సేవలు అందించడానికి గత కొన్ని సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇ-ఎఫ్ఆర్ఓ మాడ్యూల్‌ను ప్రారంభించారు. భారతదేశంలోని విదేశీయులకు ఆన్‌లైన్లో వివిధ వీసా సంబంధిత సేవలను తీసుకువచ్చారు. ఏ కేటగిరీ వీసాలోనైనా విదేశీయులకు ఇండోర్ , ఔట్డోర్ వైద్యచికిత్స పొందటానికి అనుమతి ఇచ్చారు. వీసాను మెడికల్ వీసాగా మార్చకుండా 180 రోజుల వరకు చికిత్స పొందవచ్చు. విదేశీయులకు త్వరగా వీసా, ఇతర సేవలను అందించడానికి ఎఫ్ఆర్ఓలు, ఎఫ్ఆర్ఆర్ఓల మధ్య సమన్వయాన్ని పెంచింది. వారికి మరిన్ని అధికారాలను హోంమంత్రిత్వశాఖ ఇచ్చింది.  వివిధ జిల్లాల్లో ఎఫ్ఆర్ఆర్ఓల నిర్దిష్ట అధికార పరిధిని స్పష్టంగా నిర్వచించింది. ఎఫ్ఆర్ఓల విధులను స్పష్టంగా పేర్కొంది.  


(Release ID: 1672170) Visitor Counter : 148