చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఐ.టి.ఏ.టి. కటక్ ధర్మాసనం ఆఫీస్-కమ్-రెసిడెన్షియల్ భవన సముదాయాన్ని రేవు ప్రారంభించనున్న - ప్రధానమంత్రి
Posted On:
10 NOV 2020 2:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్న ఐ.టి.ఐ.టి. కటక్ ధర్మాసనం ఆఫీస్-కమ్-రెసిడెన్షియల్ భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ పి. పి. భట్ ఈ రోజు మీడియాకు వివరించారు. కటక్ లోని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క అత్యాధునిక కార్యాలయ-నివాస భావన సముదాయాన్ని, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, 2020, నవంబర్ 11వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు ప్రారంభిస్తారు. వర్చువల్ గా జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో - కేంద్ర చట్టం, న్యాయం, కమ్యూనికేషన్సు, ఎలక్ట్రానిక్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్; కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖల మంత్రి, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్; ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తులు; ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ పి.పి. భట్; కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ శ్రీ పి.సి. మోడీ; ఐ.టి.ఏ.టి. ఉపాధ్యక్షులు మరియు సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న శాఖాపరమైన అధికారులు, వివిధ బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లు మరియు సభ్యులు ఆన్ లైన్ లో పాల్గొంటారు.
1970 నుండి దాదాపు 50 సంవత్సరాలుగా ఐ.టి.ఎ.టి. కటక్ అద్దె ప్రాంగణం నుండి పనిచేస్తోందనీ, ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా ఉత్పన్నమయ్యే అప్పీళ్ళు ఈ ధర్మాసనం పరిధిలోకి వస్తాయనీ, శ్రీ భట్ చెప్పారు. కాబట్టి, ఈ భవన సముదాయ ప్రారంభోత్సవం అవసరమైన వారికి న్యాయం చేయడంలో ఐ.టి.ఏ.టి. కటక్ ధర్మాసనానికి ఎంతగానో సహాయపడుతుంది. మంచి అనుసంధాన సదుపాయంతో, కటక్ ధర్మాసనం కొత్త భవనంలో ఏర్పాటు చేసిన ఈ-కోర్టు సదుపాయం, కోల్‌కతా జోన్‌లో ప్రస్తుతం పనిచేయకుండా ఉన్న రాంచీ, పాట్నా, గౌహతి వంటి ఇతర ధర్మాసనాలలో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను కూడా విచారించి, పరిష్కరించడానికి, వీలు కల్పిస్తుంది.
ఐ.టి.ఏ.టి. కటక్ ధర్మాసనం 1970 మే, 23వ తేదీన ఏర్పాటై, పనిచేయడం ప్రారంభించింది. కటక్ ధర్మాసనం అధికార పరిధి మొత్తం ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది. కటక్ లో నూతనంగా నిర్మించిన ఈ ఆఫీస్-కమ్-రెసిడెన్షియల్ భవన సముదాయం, 2015 సంవత్సరంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన 1.60 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. మూడు అంతస్తులుగా నిర్మించిన ఈ కార్యాలయ సముదాయం లోపలి విస్తీర్ణం మొత్తం 1938 చదరపు మీటర్లు ఉంది. ఈ భావన సముదాయంలో- విశాలమైన కోర్టు గది, రికార్డులు భద్రపరిచే అత్యాధునిక గది, ధర్మాసనం సభ్యుల కోసం అన్ని సదుపాయాలతో చక్కగా అమర్చిన గదులు, గ్రంధాలయం, ఆధునిక సమావేశ మందిరం, న్యాయవాదుల బార్ రూమ్, కక్షిదారులకు, చార్టర్డ్ అకౌంటెంట్లు మొదలైన వారికి తగినంత స్థలం వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా, ఐ.టి.ఏ.టి. ఈ-కాఫీ టేబుల్ బుక్కు మరియు ‘2014 నుండి ప్రత్యక్ష పన్నులలో సంస్కరణలు’ అనే ఈ-బుక్కు కూడా విడుదల కానున్నాయి.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఐ.టి.ఏ.టి. పనితీరు గురించి, ఐ.టి.ఏ.టి. అధ్యక్షుడు ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా ధర్మాసనాలన్నింటిలోనూ, ఐ.టి.ఏ.టి. వర్చువల్ కోర్టులను ఏర్పాటు చేసింది. ‘కోవిడ్-19 మహమ్మారి’ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ‘వర్చువల్ విచారణలు’ నిర్వహించడానికి ఐ.టి.ఏ.టి ఈ సౌకర్యాలను సమర్థవంతంగా ఉపయోగిస్తోంది. ఈ కాలంలో, 3778 కేసులు నమోదు కాగా, మొత్తం 7251 కేసులను ఐ.టి.ఏ.టి. పరిష్కరించింది. ప్రజలకు న్యాయం మరింత అందుబాటులోకి రావడానికి ఐ.టి.ఏ.టి. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తోందని ఆయన చెప్పారు. కక్షిదారులు అప్పీళ్ళు, దస్తావేజులు, ఇతర దరఖాస్తులను దాఖలు చేయడానికి వీలు కల్పించే, కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ సిద్ధంగా ఉంది. భౌతిక నోటీసు బోర్డుల స్థానంలో డిజిటల్ తెరలను అమర్చారు. వీటిలో ధర్మాసనాల ఏర్పాటు, కేసుల జాబితాలు వంటి ఇతర సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ-ఆఫీసు ద్వారా కార్యాలయంలో పరిష్కారాలు అమలు చేయబడుతున్నాయి. మంచి అనుసంధాన సదుపాయంతో, కటక్ ధర్మాసనం కొత్త భవనంలో ఏర్పాటు చేసిన ఈ-కోర్టు సదుపాయం, కోల్‌కతా జోన్‌లో ప్రస్తుతం పనిచేయకుండా ఉన్న రాంచీ, పాట్నా, గౌహతి వంటి ఇతర ధర్మాసనాలలో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను కూడా విచారించి, పరిష్కరించడానికి, వీలు కల్పిస్తుంది.
ఐ.టి.ఏ.టి. గురించి :
ఐ.టి.ఎ.టి. అని కూడా పిలువబడే ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రత్యక్ష పన్నుల రంగంలో ఒక ముఖ్యమైన చట్టబద్దమైన సంస్థ. దాని ఆదేశాలు నిజ నిర్ధారణలో తుది తీర్పుగా అంగీకరించబడతాయి. ప్రస్తుతం దీనికి గతంలో జార్ఖండ్ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన, మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పి.పి. భట్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
ఐ.టి.ఏ.టి. 1941 జనవరి, 25వ తేదీన ఏర్పాటైన మొదటి ట్రిబ్యునల్. దీనిని ‘మదర్ ట్రిబ్యునల్’ అని కూడా అంటారు. 1941 సంవత్సరంలో, ఢిల్లీ, బొంబాయి, కలకత్తాలలో మూడు ధర్మాసనాలతో ప్రారంభమైన ఐ.టి.ఏ.టి., ప్రస్తుతం, దేశవ్యాప్తంగా, 63 ధర్మాసనాలతో, 30 నగరాల్లో విస్తరించి ఉంది. “నిష్పక్ష సులభ్ సత్వర్ న్యాయ్” అంటే నిష్పాక్షికమైన, సులభమైన, వేగవంతమైన న్యాయం అందించడం - అనేది ఐ.టి.ఏ.టి. లక్ష్యం. తన 79 సంవత్సరాల అద్భుతమైన ఉనికిలో, ఐ.టి.ఏ.టి. కక్షిదారులకు న్యాయం అందించడంలో, అన్ని సాంకేతికతలకు అతీతంగా, చవకైన, వేగవంతమైన పద్ధతిలో సమయానుకూలంగా గొప్ప సేవలను అందించింది.
*****
(Release ID: 1671763)
Visitor Counter : 207