బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశ వాణిజ్య బొగ్గుగనుల తొలి మైనింగ్ వేలం చరిత్రాత్మక విజయం ద్వారా రూ 6,656 కోట్ల వార్షిక రెవిన్యూ పొందనున్న రాష్ట్రాలు : శ్రీ ప్రహ్లాద్ జోషి
Posted On:
09 NOV 2020 7:20PM by PIB Hyderabad
దేశ బొగ్గుగనుల తొలి వాణిజ్య వేలం విజయవంతం కావడం ద్వారా రాష్ట్రాలు మొత్తం6,656 కోట్ల రూపాయల వార్షిక రాబడిని పొందనున్నట్టు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తెలిపారు. వేలం బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, 19 బొగ్గుగనులను విజయవంతంగా వేలం వేయడం జరిగిందని, వివిధ బొగ్గు వేలంలలో వేలం వేసిన వాటిలో కంటే విజయవంతంగా ఎక్కువ సంఖ్యలో వేలం వేసినవి ఇవి అని చెప్పారు.
“ ఈ వేలం ఫలితాలు చరిత్రాత్మకం, ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జీ నాయకత్వంలో, ఆయన దార్శనిక నాయకత్వంలో బొగ్గు రంగానికి తలుపులు తెరవడం జరిగింది. ఇది సరైన దిశగా తీసుకున్న చర్య. ఇది బొగ్గు రంగంలో దేశాన్ని ఆత్మనిర్భర్‌వైపు ముందుకు తీసుకువెళుతుంది. ” అని శ్రీ జోషీ అన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , భారతదేశ బొగ్గుగనులను వాణిజ్య మైనింగ్‌కు 2020 జూన్ 18న తొలిసారిగా వేలంను ప్రారంభించారు.
ఈ బొగ్గుగనులకు విపరీతమైన పోటీ వచ్చిందని, కంపెనీలు ఎంతో ఎక్కువ ప్రీమియంతో ముందుకు వచ్చాయన్నారు. గరిష్ఠస్థాయి ప్రీమియం 66.75 శాతం కాగా, సగటు ప్రీమియం 29 శాతంగా ఉందన్నారు.
38 గనులను వేలానికి పెట్టగా, 10 గనులకు ఫైనాన్షియల్ బిడ్లు అందాయి. ఇందులో వేలం 50 శాతం విజయవంతమైంది. గత 10 భాగాల బొగ్గు వేలాలలో విజయం 30 శాతంగానే ఉండేది. గడచిన 10 భాగాల బొగ్గువేలాలలో 116 గనులను వెలానికి పెట్టగా 35 గనులను మాత్రమే వేలం వేయగలిగారు.
బిడ్డింగ్ పద్ధతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ శ్రీ జోషి, దాదాపు 65 శాతం వేలం దారులు నాన్ ఎండ్ యూజర్లని అంటే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా తదితర రంగాలకు చెందిన వారన్నారు. బిడ్డింగ్ ప్రక్రియనుంచి ఎండ్‌యూజ్ ప్రాతిపదికను తొలిగించిన తర్వాత ఇతరులు కూడా వచ్చి వేలంలో పాల్గొంటున్నారని,ఇది సానుకూల పరిణామమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయన్నారు. ఇందులో 40 ప్రైవేట్ ప్లేయర్లని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన నాల్కో, ఆంధ్రప్రదేశ్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు వేలంలో పాల్గొన్నట్టు కూడా ఆయన తెలిపారు.
విజయవంతంగా వేలం వేసిన 19 గనులలో 11 ఓపన్ కాస్ట్ గనులు కాగా, 5 గనులు భూగర్భగనులని అన్నారు. మిగిలిన మూడు గనులు భూగర్భ, ఓపన్ మైన్లని అన్నారు. ఈ గనులు ఐదు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, జార్ఖండ్, మహారాష్ట్రలలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఏడాదికి 51 మిలియన్ టన్నుల (ఎంటిపిఎ) సంఘటిత పీక్ రేటెడ్ కెపాసిటీ (పిఆర్‌సి ) కలిగినవి.
***
(Release ID: 1671518)
Visitor Counter : 179