రక్షణ మంత్రిత్వ శాఖ
డిఆర్‌డిఒ భవన్‌లో ఎ-శాట్ మిసైల్ మోడల్‌ను ప్రారంభించిన కేంద్ర రక్షణశాఖమంత్రి శ్రీరాజ్‌నాథ్ సింగ్
Posted On:
09 NOV 2020 5:22PM by PIB Hyderabad
డి.ఆర్.డి.ఒ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉపగ్రహ వ్యతిరేక(ఎ-శాట్) క్షిపణి నమూనాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఆవిష్కరించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖమంత్రి శ్రీ నితిన్‌గడ్కరి, డిడిఆర్ అండ్ డి కార్యదర్శి, డిఆర్‌డిఒ ఛైర్మన్ శ్రీ సతీష్ రెడ్డిల సమక్షంలో ఆయన దీనిని ఆవిష్కరించారు.
మనదేశం పరీక్షించిన తొలి ఉపగ్రహ వ్యతిరేక క్షిపణి (ఎ-శాట్) పరీక్ష పేరు మిషన్ శక్తి. ఈ పరీక్షను 2019 మార్చి 27న ఒడిషాలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ దీవులనుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో వేగంగా తిరుగుతున్న తక్కువ ఎత్తు భూ కక్ష్యలోని ఉపగ్రహాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నిర్వీర్యం చేశారు. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. దీనిని అత్యంత వేగంతో అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టడం జరిగింది.
మిషన్ శక్తిని విజయవంతంగా నిర్వహించడంతో , అంతరిక్షానికి ఆవల ఆస్తుల సంరక్షణ సామర్ధ్యాన్ని సంపాదించుకున్న దేశాలలో ప్రపంచంలోనే నాలుగోదేశంగా ఇండియా సమకూర్చుకున్నట్టయింది.
ఈ సందర్భంగా రక్షామంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ వినూత్న విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.
డిడిఆర్,డి కార్యదర్శి, డిఆర్‌డిఒ ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, ఎ-శాట్ నమూనాను ఏర్పాటు, డిఆర్‌డిఒ సిబ్బందికి ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సవాళ్లతో కూడిన మిషన్‌లను చేపట్టడానికి ప్రేరణనిస్తుందని అన్నారు.
అంతకు ముందు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ నితిన్ గడ్కరీలు ప్యాసింజర్ బస్సులలో అగ్ని ప్రమాదాన్ని గుర్తించి , మంటలు ఆర్పివేసే విధానాన్ని పరిశీలించారు. ఇంజిన్ మంటలే ఆర్పే విషయంయలో ఏరోసెల్ ఆధారిత ఎఫ్‌డిఎస్ ఎస్, పాసింజర్ కంపార్టమెంట్ ప్రమాదాలకు నీటి మంచు బిందువుల ఆధారిత ఎఫ్‌డిఎస్ఎస్‌లకు సంబంధించిన ప్రదర్శననను వారు తిలకించారు.
డిఆర్‌డిఒ కు చెందిన సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోసివ్, ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సిఎఫ్ ఇఇఎస్) ఢిల్లీ, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. పాసింజర్ బస్సులలో అగ్ని ప్రమాదాన్ని 30 సెకండ్ల వ్యవధిలోపలే ఇది ఇది గుర్తించి 60 సెకన్లలో మంటలను అదుపులోకి తెస్తుంది. దీనివల్ల ప్రాణ నష్టం ,ఆస్తినష్టం చెప్పుకోదగిన స్థాయిలో తగ్గించడానికి వీలు కలుగుతుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సాంకేతిక పరిజ్ఞానంపట్ల సంతృప్తి వ్యక్తం చేసి, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లవలసిందిగా కోరారు.
***
(Release ID: 1671505)
Visitor Counter : 295