పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషిచేస్తోంది: శ్రీ ప్రకాశ్ జావడేకర్
వాయు కాలుష్యాన్ని అణచివేసి ఉపశమనం కలిగించడానికి వీలుగా సాధ్యమైన అన్నిరకాల సాంకేతిక
పరిజ్ఞానాన్ని స్వాగతిస్తూ వాటిని ప్రోత్సహిస్తాం
Posted On:
06 NOV 2020 4:42PM by PIB Hyderabad
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం అన్ని రకాలుగా కృషి చేస్తోందని కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో విశేషంగా జాతీయ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి చాలా ఎక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వాయు కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం కాలుష్య ఉత్పత్తిస్థానాలలో ప్రధానమైన పరిశ్రమలు లేక థర్మల్ విద్యుత్ కేంద్రాలు, వాహన కాలుష్యం, నిర్మాణ, కూల్చివేత వ్యర్ధాలు లేక గడ్డిదుబ్బు/కొయ్య మొదళ్ళు కాల్చడం వంటిచోట్లలోనే అణచివేయడానికి ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. వాయు కాలుష్యం సమస్యను అంతం చేయడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేయగలదని ఇందుకోసం అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని, ప్రమేయాన్ని ప్రోత్సహించగలదని ఆయన అన్నారు.
https://fb.watch/1ARDHTaoxj/
పూణేలో ప్రజ్ టెక్నాలజీస్ సంస్థ దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన జీవద్రవ్యంతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే బాహ్య ప్రదర్శన ప్లాంటును చాక్షుష పద్ధతిలో ప్రారంభించిన తరువాత మంత్రి మాట్లాడారు. కలప కోయగా మిగిలిన కొయ్య మొదళ్ళ వంటి వాటిని తగులబెట్టడం కూడా కాలుష్యానికి హేతువవుతోందని ఇటువంటి టెక్నాలజీ సంస్థలు ఈ సమస్య తీవ్రతను తగ్గించడానికి తోడ్పడగలవనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'పూసా' (PUSA) సంస్థ మొదళ్ళను ఎరువుగా మార్చడం ఎలాగో ప్రదర్శించి చూపిందని ఇప్పుడు దానిని ఢిల్లీతో సహా ఐదు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పంట అవశేషాలతో పనిచేయడానికి దానిని ఉపయోగించవచ్చని, చాలా చవకైనదని ఆయన అన్నారు. కొయ్య మొదళ్ళు కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి భవిష్యత్తులో అనేక మార్గాలు ఉండగలవనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
ఇంధన సంపత్తిని పెంచుకునే దిశలో ఇండియా ముందుకు వెళ్తోందని మంత్రి అన్నారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి సౌర ఇంధనాన్ని , అక్షయ ఇంధనాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారని చెప్తూ, పరిశుభ్రమైన ఇంధనం సరఫరా ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధం (ఆత్మ నిర్భర్ భారత్) చేయడానికి అక్షయ ఇంధన వనరులను మరింత ఎక్కువగా వినియోగంలోకి తెచ్చేందుకు మనం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సూత్రీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మంత్రి అన్నారు.
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎడతెగకుండా కృషి చేస్తోందని కూడా మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా 122 నగరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు వాయు శుద్ధత కోసం జాతీయ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
***
(Release ID: 1671091)
Visitor Counter : 150