సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

'ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం' (పీఎంఈజీపీ) పథకంలో యోగ్య‌త లేని అంశాల‌ను ఎర‌గా చూపి ప్ర‌జల‌ను మోసం చేయ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించిన‌ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ‌

- పీఎంఈజీపీ ప‌థ‌కానికి దరఖాస్తు, నిధుల విడుదల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలో ఉచితంగా అందుబాటులో ఉందని వెల్ల‌డించిన‌ మంత్రిత్వ శాఖ

Posted On: 06 NOV 2020 4:53PM by PIB Hyderabad

'ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం' (పీఎంఈజీపీ) పథకం పేరిట జ‌రిగే మోసాలను గురించి సాధారణ ప్రజలను, సంభావ్య పారిశ్రామికవేత్తలను భారత ప్రభుత్వ‌పు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. పీఎంఈజీపీ ప‌థ‌కం కింద ఇచ్చే రుణాల‌ను పొందేందుకు గాను సంభావ్య వ్యవస్థాపకులు / లబ్ధిదారులు ప్రైవేటు వ్యక్తులు లేదా ఏజెన్సీలు సంప్రదిస్తున్నార‌ని.. వారు రుణ మంజూరు లేఖలను అందజేయడం, ఇందుకు డబ్బుల‌ను వసూలు చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలను మోసం చేస్తున్న సంఘ‌ట‌న‌లు కొన్ని ఎంఎస్‌ఎంఈ
శాఖ దృష్టికి వ‌చ్చిన‌ట్టుగా ఈ రోజులు మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
తమ పేరు మీద సామాన్య ప్రజల్ని మోసం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ విష‌య‌మై సరైన దర్యాప్తు మరియు త‌గిన చర్యల‌ను కోరుతూ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పోలీసులకు త‌గిన స‌మాచారాన్ని అందించిన‌ట్టుగా వెల్ల‌డించింది. 'ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం' (పీఎంఈజీపీ) పథకం అనేది కేంద్ర ప్ర‌భుత్వ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం. దీనిని దేశ వ్యాప్తంగా సూక్ష్మ సంస్థల స్థాపనకు గాను మొదటి తరం పారిశ్రామిక వేత్తలకు సహాయపడటానికి 2008-09 నుండి ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. పీఎంఈజీపీ పథకం కింద, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ నిర్వహిస్తున్న ప్రభుత్వ పోర్టల్ ద్వారా.. దరఖాస్తును స్వీకరించినప్పటి నుండి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయడం, విడుదల చేయడం వరకు మొత్తం ఆన్‌లైన్ ద్వారా చేప‌డుతున్నారు. ఈ పోర్ట‌ల్‌ను
https://www.kviconline.gov.in/pmeepeportal/pmegphome/index.jsp వద్ద యాక్సెస్ చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఖర్చు లేకుండా ఉంటుంది.
పీఎంఈజీపీ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి మరియు మంజూరు చేయడానికి లేదా పీఎంఈజీపీ పథకం కింద ఏదైనా ఆర్థిక సహాయం అందించడానికి ప్రైవేట్ పార్టీ / ఏజెన్సీ / మిడిల్‌మెన్ / ఫ్రాంచైజ్‌ల‌ను ప్ర‌భుత్వం నియ‌మించ లేదు.  
సంభావ్య వ్యవస్థాపకులు / లబ్ధిదారులను ప్రైవేట్ వ్యక్తులు లేదా ఏజెన్సీలు
పీఎంఈజీపీ పథకం కింద రుణాలు ఇచ్చి, రుణ మంజూరు లేఖలను ఇవ్వ‌డం, మరియు వారి నుండి డబ్బు వసూలు చేయడం ద్వారా వ్యవస్థాపకులను మోసం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం మరియు పూర్తిగా అవాస్త‌వ చ‌ర్య అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి చ‌ర్య‌ల ప‌ట్ల జాగ్రత్తగా ఉండాలని సాధారణ ప్రజలకు సూచించింది.
                                   

****


(Release ID: 1670852) Visitor Counter : 460