రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఎస్.బి.ఐ. యోనో క్రిషి యాప్‌తో ఇఫ్కో బజార్ భాగస్వామ్యం -

భారతదేశంలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల అందుబాటుకు ప్రోత్సాహం


"వోకల్ ఫర్ లోకల్" మరియు "ఆత్మ నిర్భర్" వంటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా చర్యలు

Posted On: 06 NOV 2020 4:13PM by PIB Hyderabad

రైతు అవసరాలను తీర్చడానికి అంకితమైన ఎస్.బి.ఐ. యోనో కృషి యాప్ తో అనుసంధానమైనట్లు, ఇఫ్కో యొక్క ఇ-కామర్స్ పోర్టల్ www.iffcobazar.in, ప్రకటించింది. దీని వల్ల అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు లక్షలాది మంది భారతీయ రైతులకు అందుబాటులో ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేని చెల్లింపు పోర్టల్ - ఎస్.బి.ఐ. యానో పోర్టల్ మరియు ఇఫ్కో యొక్క నాణ్యమైన ఉత్పత్తుల కలయిక  ఈ విభాగంలో డిజిటల్ అమ్మకాలను పెంచే లక్ష్యంతో ఏర్పడింది. 

 

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ఆధారిత ఇ-కామర్స్ పోర్టళ్ళలో  www.iffcobazar.in ఒకటి.  ఈ పోర్టల్ ను దేశంలో అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ అయిన ఇఫ్కో అభివృద్ధి చేసింది.  12 భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఉచిత హోమ్ డెలివరీ హామీ ఇస్తుంది.  ఈ పోర్టల్ భారతదేశం అంతటా 26 రాష్ట్రాల్లో 1200 కు పైగా దుకాణాలను కూడా నిర్వహిస్తోంది.  ప్రత్యేకమైన ఎరువులు, సేంద్రీయ వ్యవసాయానికి పనికివచ్చే సామాగ్రి, విత్తనాలు, వ్యవసాయ రసాయనాలు, వ్యవసాయ యంత్రాలు వంటి వివిధ రకాల ఉత్పత్తులను ఈ పోర్టల్లో అందుబాటులో ఉంచారు.

ఈ భాగస్వామ్యంపై ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యు.ఎస్. అవస్థీ మాట్లాడుతూ, “ఇఫ్కో మరియు ఎస్.బి.ఐ. రెండూ భారతదేశంలోని పురాతన వ్యాపార సంస్థలు. మా పేర్లలోని 'ఐ' అనే అక్షరం భారతదేశానికి ప్రతీకగా నిలుస్తుంది, మమ్మల్ని అన్ని విధాలుగా బంధిస్తుంది. ఈ ఏకీకరణ ద్వారా ఈ రెండు ప్రముఖ 'భారతీయ' సంస్థలు కలిసి ఉత్తేజంతో భారతీయ రైతుల శ్రేయస్సు కోసం పనిచేయగలవని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను." అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “ఇఫ్కో గత 50 సంవత్సరాలుగా రైతుల సేవలో ఉంది.  iffcobazar.in అనే ఈ వేదిక రైతులను డిజిటల్‌గా అనుసంధానించి, వారికి సేవ చేస్తుంది. "డిజిటల్ ఫస్ట్" మరియు రైతు కేంద్రీకృత విధానం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మన ప్రధానమంత్రి స్వప్నాన్ని సాకారం చేయడమే దీని లక్ష్యం.  ఈ పోర్టల్ ద్వారా, రైతులు ఉత్తమ నాణ్యమైన సబ్సిడీ లేని ఎరువులు మరియు ఇతర వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు, వారి ప్రశ్నలకు రైతుల ఫోరం మరియు అంకితమైన హెల్ప్ ‌లైన్ ద్వారా సమాధానాలు కూడా పొందవచ్చు. " అని వివరించారు. "భారతదేశంలో ఒక ఆర్థిక సంస్థగా ఎస్.బి.ఐ. ప్రశంసనీయమైన పని చేస్తోంది, గ్రామీణ భారతదేశంలో దాని పరిధి సాటిలేనిది. ఎస్.బి.ఐ. యానో ద్వారా,  iffcobazar.in పోర్టల్ భారతదేశం అంతటా రైతుల మధ్య తన పరిధిని విస్తృతం చేయగలదని నాకు నమ్మకం ఉంది.” అని ఆయన పేర్కొన్నారు. 

ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ యోగేంద్ర కుమార్ మాట్లాడుతూ, " ఆర్ధిక వనరులు మరియు ఎరువులు రైతులకు రెండు కీలకమైన పెట్టుబడులు.   ఎస్.బి.ఐ. యోనో మరియు iffcobazar.in ల మధ్య భాగస్వామ్యంతో ఆయా రంగాలలోని రెండు అతిపెద్ద భారతీయ సంస్థలు చివరకు రైతులకు ఇంటి వద్దనే ఉత్తమ నాణ్యమైన వ్యవసాయ పెట్టుబడులను అందించడానికి కలిసి పనిచేస్తున్నాయి". అని పేర్కొన్నారు.  " 3 కోట్లకు పైగా నమోదు చేసుకున్న యోనో వినియోగదారులను చేరుకోవడానికి ఇఫ్కో బజార్ కు, ఈ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వినియోగదారుల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ భారతదేశంలో బలమైన బ్రాండ్ ఈక్విటీని ఉపయోగించుకుని విశ్వసనీయమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించవచ్చు, ఇది చివరికి రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించటానికి సహాయపడుతుంది ". అని  ఆయన పేర్కొన్నారు. 

*****(Release ID: 1670812) Visitor Counter : 157