జల శక్తి మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్ మారుమూల మైమి గ్రామానికి చేరిన జల్‌జీవన్ మిషన్
2021 మార్చి నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నప్రజలు
Posted On:
05 NOV 2020 3:29PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని నామ్‌సాయి జిల్లా చౌఖామ్ బ్లాక్‌లో జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మైమీ గ్రామం పచ్చటి పంటపొలాల మధ్య ఉన్న గ్రామం. ఈ గ్రామంలో శాంతిని ప్రేమించే 42 ఇళ్లకు చెందిన బౌద్ధులు ఉన్నారు. వ్యవసాయం వారి ప్రధాన జీవనాధారం. కొందరు ప్రభుత్వ సర్వీసులో, ఇతర వ్యాపారాలలో ఉన్నారు. ప్రజలు ఎంతో సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు. అయితే మంచినీటి కొరతను చాలా ఏళ్లుగా వారు ఎదుర్కొంటున్నారు.
ఈ గ్రామంలోని మహిళ గ్రామం గుండా వెళ్లే ఒక చిన్న వాగునుంచి నీటిని తెచ్చుకోవలసి వచ్చేది. ఇది వారి ఇంటినుంచి సుమారు 30 మీటర్ల దూరం ఉంటుంది. వారికి పరిశుభ్రమైన తాగునీరు, వంటకు ఉపయోగించేందు, స్నానాలకు, బట్టలు ఉతికేందుకు మంచినీరు అవసరం. ఇంటి వెనుక చేతి పంపు ఉన్నా అది ఇనుముతో కలుషితమైంది. దానినుంచి దుర్గంధం రావడమే కాక, ఎర్రటి మురకినీరు వస్తోంది. ఆమె కుమార్తె దూరం నుంచి మంచినీరు తేవడానికి సహాయపడేది. వర్షాకాలంలో
ఆ వాగు పొంగిప్రవహించేది. దాంట్లో మురికినీరు వచ్చేది. దీనితో గ్రామస్థులు అక్కడి ఒక కొద్దిపాటిలోతులోని బావిపై ఆధారపడాల్సి వచ్చేది. దీనితో పిల్లలకు అనారోగ్యాలు. ఫలితంగా వారు ఆరునెలల పరీక్షలకు హాజరుకాలేని పరిస్థితి.కలుషిత జలాలలవల్ల వారు అనారోగ్యం పాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రతి ఇంట్లో ఇలాంటి కథనాలే ఉండేవి. వారు చేతిపంపులు , వాగుఈను, ఒరల బావులపై ఆధారపడాల్సి వచ్చేది . గ్రామంలోని మహిళలు మంచినీటికి ఇబ్బందులు పడేపరిస్థితి.
ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం జల్ జీవన్ మిషన్ ను గ్రామస్థులు గ్రామసభ సమావేశంలో ప్రవేశపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజారోగ్య ఇంజనీర్లు , నీటిసరఫరా విభాగం అధికారులు ఈ కార్యక్రమాన్ని ఆమోదించారు.
హర్ ఘర్‌జల్ కార్యక్రమం వారి కళ్లల్లో ఆనందాన్ని నింపింది. వారి కల సాకారమైంది.గ్రామంలో ప్రజలు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు. ఈ మిషన్‌లో భాగస్వాములు కావడానికి వారు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. జల్ జీవన్ మిషన్ అమలుకు అడుగు ముందుకు పడింది. గ్రామసభను నిర్వహించి, గ్రామ కార్యాచరణ ప్రణాళిక (విఎపిని) చర్చించారు.
సౌర విద్యుత్ ఆధారిత నీటిశుద్ధి ప్లాంటు , బోర్ వెల్ నుంచి హెచ్‌డిపిఇ పైప్ నెట్‌వర్కుతో ఇంటి వరకు నీటి సరఫరా పైపు లైనును గ్రామసభ ఆమోదించింది. గ్రామ నీటి, పారిశుద్ధ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ బాధ్యతలు, కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడం జరిగింది. ఈ కమిటీలోకి గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలను తీసుకున్నారు. గ్రామపెద్దలు, అంగన్‌వాడీ , ఆశా కార్యకర్తలు,పాఠశాల టీచర్లు వంటి వారిని ఇందులో చేర్చారు. విడబ్ల్యుఎస్‌సిలో 50 శాతం మంది మహిళౄ సభ్యులు ఉంటారు.జెజెఎం విజయానికి ఇది కీలకం.
మిమీ గ్రామానికి మంచినీటి సరఫరాకు రాష్ట్రస్థాయి ఆమోద కమిటీ (ఎస్.ఎల్ ఎస్ ఎస్ సి) ఆమోదం తెలిపింది. దీనిని మార్చి 2021 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.గ్రామస్థులు లేబర్ రూపంలో 5 శాతం పనిని సమకూర్చడం మొదలుపెట్టారు.నీటి నాణ్యత, కార్యక్రమ అమలు, క్షేత్రస్థాయిలో నీటిని పరిశీలించే కిట్‌లను ఉ పయోగించడం, వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టడం అందుకు తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఇదంతా స్థానిక ప్రజల చురుకైన భాగస్వామ్యంతో జరుగుతోంది.
కేంద్రప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమమైన జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి మంచినీటి కనెక్షన్ మంజూరు చేసేందుకు జల్‌జీవన్ మిషన్‌ను నిర్దేశించారు. గ్రామీణ ప్రాంత ఇళ్లకు నమ్మకమైన రీతిలో రోజుకు తలసరి 55 లీటర్ల నీటిని దీర్ఘకాలికంగా సరఫరాచేసేందుకు తద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దేశించినది.
***
(Release ID: 1670459)
Visitor Counter : 187