విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఫ్లై బూడిద వినియోగం దిశ‌గా ఎన్‌టీపీసీ మౌడా అడుగులు

- రైల్వే ర్యాక్‌ల‌ ద్వారా సిమెంట్ తయారీదారులకు ఉప-ఉత్పత్తి పంపిణీ

- రైలు ద్వారా పొడి ఫ్లై బూడిదను భారీ మొత్తంలో పంపండం ద్వారా ఈ మెగా చొరవ చేప‌ట్టిన మహారాష్ట్రలోని ఎన్‌టీపీసీ యొక్క మొదటి విద్యుత్ ప్లాంట్‌గా

ఎన్‌టీపీసీ మౌడా అవతర‌ణ‌
- గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఎన్‌టీపీసీ ప్లాంట్ దాదాపు 23.57 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్లై యాష్‌ను వివిధ ఉత్పాదక ప్రయోజనాల కోసం వినియోగం

Posted On: 04 NOV 2020 3:17PM by PIB Hyderabad

 

నూటికి నూరు శాతం ఫ్లై యాష్ వినియోగానికి దోహదపడేలా ఎన్‌టీపీసీ మౌడా త‌న అడుగుల‌ను విస్త‌రిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ రైల్వే ర్యాకుల‌ ద్వారా సిమెంట్ తయారీదారులకు ఫ్లై యాష్‌ను ఉప ఉత్పత్తిగా స‌ర‌ఫరా చేస్తుంది. ఈ ప్లాంట్ 3,186 మెట్రిక్ టన్నుల (ఎంటీ) డ్రై ఫ్లై బూడిదను, 51 బీసీసీడ‌బ్ల్యు
వ్యాగన్లలో కర్ణాటక రాష్ట్రంలోని రాజ్‌శ్రీ సిమెంట్ (అల్ట్రాటెక్ సిమెంట్ యూనిట్) కల్బుర్గికి రవాణా చేసింది. రైలు ద్వారా పొడి ఫ్లై బూడిదను భారీ మొత్తంలో పంపండం ద్వారా ఈ మెగా చొరవ చేప‌ట్టిన మహారాష్ట్రలోని ఎన్‌టీపీసీ యొక్క మొదటి విద్యుత్ ప్లాంట్‌గా ఎన్‌టీపీసీ మౌడా అవతరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 23.57 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్లై యాష్‌ను.. వివిధ ఉత్పాదక ప్రయోజనాల కోసం ఎన్‌టీపీసీ మౌడా ఉపయోగించుకుంది. విద్యుత్ ఈ ప్లాంట్ ఏటా సుమారు 24-25 లక్షల మెట్రిక్ టన్నుల బూడిదను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం 100% బూడిదను సిమెంట్, ఫ్లై బూడిద ఇటుకల ఉత్పత్తి, రహదారి కట్ట నిర్మాణం, లోతట్టు భూమి అభివృద్ధి, బూడిద రంగును పెంచడం కోసం ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి సమయంలో ఉత్పత్తి చేయబడిన ఉప-ఉత్పత్తిని 100% ఉపయోగించుకునే ప్రయత్నంలో భారతదేశపు అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్‌టీపీసీ లిమిటెడ్. ఫ్లై బూడిదను సరఫరా చేయడానికి దేశవ్యాప్తంగా సిమెంట్ తయారీదారులతో కలిసి పని చేయడం ప్రారంభించింది.
ఫ్లై బూడిదను ఆర్థిక, పర్యావరణ అనుకూల రీతిలో రవాణా చేయడానికి గాను..
విద్యుత్ ఉత్పత్తిదారుడు భారతీయ రైల్వే విస్తారమైన నెట్‌వర్క్‌ను వాడుకోవ‌డానికి  కృషి చేస్తున్నారు. మొత్తం 62.9 గిగావాట్ల‌ సామర్థ్యంతో, ఎన్‌టీపీసీ గ్రూప్‌లో 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 24 బొగ్గు, 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్ / లిక్విడ్ ఫ్యూయల్, 1 హైడ్రో, 13 రెన్యూవబుల్స్ తో పాటు 25 సబ్సిడియరీ & జేవీ పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ బృందం నిర్మాణంలో 20 గిగా వాట్ల‌కు పైగా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటిలో 5 గిగావాట్ల‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి.
                                 

*****


(Release ID: 1670239) Visitor Counter : 188