జల శక్తి మంత్రిత్వ శాఖ
గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రాష్ట్రాల మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటుచేయనున్న జాతీయ జల్‌జీవన్ మిషన్
జల్‌జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వంద రోజుల ప్రచారంపై ప్రత్యేక దృష్టితో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో మాట్లాడనున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి
Posted On:
01 NOV 2020 2:00PM by PIB Hyderabad
జలశక్తి మంత్రిత్వశాఖ తాగునీరు,పారిశుధ్య విభాగానికి చెందిన జాతీయ జల్‌జీవన్ మిషన్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ మంచీనీటి సరఫరా వ్యవహారాలకు బాధ్యులుగా ఉన్న మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని 2020 నవంబర్ 3 వతేదీ మంగళవారం నాడు నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించే ఈ సమావేశానికి జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర జింగ్ షెకావత్ అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గ్రామీణ నీటిసరఫరా వ్యవహారాలను చూసే మంత్రులు ,సీనియర్ అధికారులను ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా సూచించారు. గ్రామీణప్రాంతాలలోని అంగన్‌వాడీకేంద్రాలు,ఆశ్రమశాలలు, పాఠశాలల్లో పైపుద్వారా మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన 100రోజుల ప్రచార కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిపై జాతీయ మిషన్ ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తోంది. నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ మిషన్ తన లక్ష్యాలను సాధించేలా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కృషిలో భాగంగా జల్‌జీవన్‌మిషన్ లక్ష్యాలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గ్రామీణ నీటిసరఫరా వ్యవహారాలకు ఇంఛార్జ్‌లుగా ఉన్న మంత్రులతో వివిధ అంశాలపై వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ నాణ్యమైన స్వచ్ఛమైన మంచినీటిని అందజేయడం జల్‌జీవన్ మిషన్ లక్ష్యం. ఇది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను ముఖ్యంగా మహిళలు, పిల్లల జీవన ప్రమాణాలను పెంచనుంది. ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా దీర్ఘకాలిక ప్రాతిపదికన మంచినీరు అందేలా చేయడం.అలాగే సాధారణ ప్రజలకు వికేంద్రీకృత విధానంలో నీటి నాణ్యతా పరీక్షలు, నిర్వహణ ,యాజమాన్యం నిర్వహించడం.
ఈ మిషన్ నీటి నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.ఇందుకు నీటి నాణ్యతా లేబరెటరీలకు త్వరగా గుర్తింపునిచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను జల్‌జీవన్‌మిషన్ కోరింది.ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ ఆధీనంలో 2,233 నీటి నాణ్యతా పరీక్షా ప్రయోగ కేంద్రాలు ఉ న్నాయి. చాలావరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రయోగ కేంద్రాలు కేవలం నీటి నమూనాలను పరీక్షిస్తాయి. ఇవి సాధారణ ప్రజలకు అందుబాటులో లేవు.
కొన్ని రాష్ట్రాలలో అయితే నీటి పరీక్షా కేంద్రాలు ఉన్నా వాటి పరీక్షా ఫీజులు చాలా ఎక్కువగా ఉండడంతో సామాన్య ప్రజలు నీటి నాణ్యతా పరీక్షలు చేయించుకోలేకుండా ఉన్నారు. జల్‌జీవన్ మిషన్ , ప్రజలు తమకు సరఫరా అయ్యే నీటి నాణ్యతను నామ మాత్ర ధరకు పరీక్షించుకునేలా ప్రోత్సహిస్తుంది. అలాగే జిపి, విడబ్ల్యుఎస్, పానీ సమితులు నీటి నాణ్యతా పరీక్షా కిట్లను ఉపయోగించి నీటిని పరీక్షింపచేసేందుకు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసేందుకు ప్రోత్సహించడం జరుగుతోంది.ఇది నాణ్యమైన రీతిలో మంచినీటి సరఫరాకు వీలు కల్పిస్తుంది. ఈ ప్రయోగశాలలను సమీకృతం చేసి ప్రజలకు సరఫరా అవుతున్న నీటి నాణ్యతను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇది ప్రజారోగ్య పరిస్థితిని, ముఖ్యంగా మహిళలు, పిల్లల ఆరోగ్య పరిస్థితి ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
దీనికితోడు పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలకు ( గిరిజన ప్రాంతాలకు) పైపుల ద్వారా నీటిని సరఫరాచేయడానికి తద్వారా వారి మెరుగైన ఆరోగ్యానికి వీలుగా 100 రోజుల ప్రచారాన్ని అక్టోబర్2, 2020న ప్రారంభించారు. ఇందుకు సంబంధించి అన్ని ప్రభుత్వ సంస్థలలో సురక్షిత మంచినీటి సరఫరాకు వీలు కల్పించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని గ్రామీణ నీటిసరఫరా ఇంఛార్జిలు చొరవ తీసుకోవలసిందిగా కేంద్రమంత్రి శ్రీ షెకావత్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.
గ్రామీణ ప్రాంతాలలోని ఇళ్లు అన్నింటికీ సురక్షితమైన నీటిని క్రమం తప్పకుండా, దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించడం ఈ వీడియో కాన్ఫరెన్సు లక్ష్యం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15న 73వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జల్ జీవన్ మిషన్ ను ప్రకటించారు. ఇది తాగునీటి సరఫరా రంగంలో పెను సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఉద్దేశించినదిగా చెప్పుకోవచ్చు.ఈ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేస్తారు.2024 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలోని అన్ని ఇళ్లకు కుళాయి ద్వారా మంచినీటిని నిరంతరాయంగా సరఫరా చేయడం దీని లక్ష్యం. అలాగే జలవనరుల పొదుపు ద్వారానీటివనరుల సుస్థిరత,గ్రే వాటర్‌శుద్ధి, నీటి సరఫరా కార్యక్రమాల అమలు నిర్వహణ వంటి అంశాలపై ఇది దృష్టిపెడుతుంది.
2019 ఆగస్టులో ఈ మిషన్‌ను ప్రారంభించే నాటికి, 18.93 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలలో 17శాతం మంది అంటే 3.23 కోట్ల మందికి కుళాయినీటి కనెక్షన్ ఉంది. మిగిలిన 15.70 కోట్ల మందిలో 83 శాతం మందికి 2024 నాటికి మంచినీటి కనెక్షన్ అందించవలసి ఉంది. ఈ మిషన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజూ 85,000 ట్యాప్ కనెక్షన్లు అమర్చవలసి ఉంది. క్లిష్ట సమయంలో రోజుకు 1 లక్ష ట్యాప్ కనెక్షన్లు అమర్చడం జరిగింది. కోవిడ్ కారణంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కృషి చేస్తున్నాయి. జల్‌జీవన్ మిషన్‌కింద (జెజెఎం)- హర్‌ఘర్‌జల్, ప్రతి ఇంటికీ నమ్మకమైన రీతిలో పైపు ద్వారా మంచినీటిని సరఫరా చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి..
ఈ మిషన్ లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలోని , ప్రతి ఆవాసంలోగల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కుళాయిద్వారా మంచినీటి సరఫరా జరిగేటట్టు చూడడం. ఏ ఒక్క కుటుంబాన్నీ విడిచిపెట్టకుండా అందరికీ కుళాయి ద్వారా మంచినీటి సరఫరా జరిగేట్టుచూడడం దీని లక్ష్యం.దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు , బాలికలు మంచినీటిన తెచ్చుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల జీవన స్థితిగతులు దీనివల్ల మెరుగుపడతాయి.
ఈ మిషన్ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ శాచురేషన్‌ప్రణాళికలను కింది విధంగా ఖరారుచేసుకున్నాయి.(ఎఫ్.హెచ్.టి.సి: ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్)
100 శాతం ఎఫ్.హెచ్.టి.సి 2020 : గోవా ( లక్ష్యం నెరవేరింది)
100 శాతం ఎఫ్.హెచ్.టి.సి 2021 : అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, పుదుచ్చేరి, తెలంగాణ
100 శాతం ఎఫ్.హెచ్.టి.సి 2022 : హర్యానా , జమ్ము కాశ్మీర్, లద్దాక్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్
100 ఎఫ్.హెచ్.టి.సి 2023 : అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, తమిళనాడు, త్రిపుర
100 ఎఫ్.హెచ్‌టిసి 2024 అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్
గ్రామాలలో నీటిసరఫరా పథకాల అమలులో ప్రణాళికనుంచి అమలు వరకు కమ్యూనిటీ ప్రమేయం ఉండేలా చూడడం ఈ కార్యక్రమానికి ఆత్మవంటింది. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని , ఆ గ్రామాలకు ఐదు సంవత్సరాలకు గ్రామ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. అలాగే స్థానిక ప్రజలను ఇందులో భాగస్వాములను చేయడం, స్థానిక జల వనరులను బలోపేతం చేయడం, నీటి సరఫరా మౌలికసదుపాయాలను కల్పించడం, గ్రేవాటర్ శుద్ధి, పునర్ వినియోగానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఇంటికీ నమ్మకమైన రీతిలో మంచినీటి సరఫరా జరగడానికి వీలు కలుగుతుంది.
గ్రామాలు, గ్రామపంచాయితీల స్థాయిలో అంటే అట్టడుగు స్థాయిలో వివిధ ప్రణాళికల సమన్వయానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది జలవనరుల సంరక్షణ, జలవనరుల శుద్ధఙ, గ్రేవాటర్ మేనేజ్‌మెంట్ వాటి విషయంలో చర్యలు చేపడతారు. ఇందుకు ఎంజిఎన్ఆర్‌జిఇజిఎస్, పంచాయతి రాజ్ సంస్థలకు 15 వ ఆర్ధిక సంఘం నిధులు, ఎస్‌బిఎం (జి), జిల్లా మినరల్ డవలప్‌మెంట్‌ఫండ్, సిఎస్ఆర్‌ఫండ్, లోకల్ ఏరియా డవలప్‌మెంట్ ఫండ్, తదితరాలను ఎక్కువ ప్రయోజనకరమైన రీతిలో వాడుకోవడానికి వీలుంది.
ఇంకా, 15 వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు మంచినీటి సరఫరా, పారిశుధ్యం అనేవి ప్రాధాన్యతా అంశాలని గుర్తించింది. అందుకు అనుగుణంగా బహిరంగ మలమూత్ర విసర్జన (ఒడిఎఫ్)రహిత స్థాయికి చేరుకోవడానికి, మంచినీటి సరఫరా, వాననీటి సంరక్షణ, వాన నీటిరీసైక్లింగ్‌కు టైడ్ గ్రాంట్ కింద 30,375 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆ ర కంగా పంచాయతీ రాజ్ సంస్థలు , ఈ టైడ్ గ్రాంట్‌లలో ఒకటిన్నర వంతుఈ రెండు కీలక అంశాలకు కేటాయించవచ్చు.ఇందుకుసంబంధించిన తొలి విడత మొత్తం రూ 15,187.50 కోట్ల రూపాయలు 15 వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన విధంగా ఇప్పటికే రాష్ట్రాలకు విడుదల చేయడం జరిగింది. ఈ గ్రాంటు , గ్రామాలలో నీటి సరఫరాకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు గొప్ప అవకాశం కల్పించనుంది. దీర్ఘకాలికంగా మంచినీటి సరఫరా నిర్వహణ, కొనసాగింపునకు ప్రజల భాగస్వామ్యంతో కార్యకలాపాలు చేపట్టడానికి వీలు కలిగిస్తుంది.
భాగస్వామ్యాల నిర్మాణం, జీవితాలలో మార్పు అనేది జల్ , జీవన్ మిషన్ నినాదం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ప్రతి ఒక్కరూ నీటి గురించి ఆలోచించాలన్న పిలుపునకు అనుగుణంగా ఈ మిషన్ ప్రజల భాగస్వామ్య నిర్మాణం, అలాంటి సంస్థలతో కలిసి పనిచేయడం, అలాంటి వ్యక్తులతో కలిసి ముందుకు సాగడం ద్వారా మంచినీటి సరఫరా భద్రతను సాధించడానికి వీలు కలుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక సేవ, దాతృత్వ సంస్థలు,మంచినీటి రంగంలో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సామర్ధ్యాలను బలోపేతం చేయగల సంస్థలతో కలిసిపనిచేయడానికి వీలు కల్పిస్తుంది..
*****
(Release ID: 1669387)
Visitor Counter : 174