ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సేతు యాప్ కు సంబంధించిన ఆర్ టి ఐ ప్రశ్నకు కేంద్ర సమాచార కమిషన్ ( సిఐసి) ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతికత శాఖ( ఎంఇఐటివై) వివరణ
Posted On:
28 OCT 2020 7:01PM by PIB Hyderabad
ఆరోగ్య సేతుకు సంబంధించి వచ్చిన ఆర్ టి ఐ ప్రశ్నకు కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై మీడియాలో పలు నివేదికలు వెలువడ్డాయి. అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆదేశాల ప్రకారం ఎంఇఐటివై, ఎన్ ఇ జిడి, ఎన్ ఐసిలకు చెందిన సిపిఐఓలు నవంబర్ 24, 2020న సమాచార కమిషన్ ముందు హాజరుకావాల్సి వుంది. సిఐసి ఆదేశాలకు అనుగుణంగా ఎంఇఐటివై తగిన చర్యలను తీసుకుంటోందని అధికారులు తెలిపారు.
కోవిడ్ 19 మహమ్మారి వైరస్ ను కట్టడి చేయడంలో ఆరోగ్యసేతు యాప్ పాత్రపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 2నాడు ఆరోగ్యసేతు యాప్ ను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో తయారు చేసిన యాప్ అని అధికారులు తెలిపారు. ఈ యాప్ ను రికార్డు టైములో అంటే 21 రోజుల్లోనే తయారు చేశారు. దేశానికి చెందిన ఉత్తమమైన ప్రతిభావంతుల ఆధ్వర్యంలో దీన్ని తయారు చేశారు. ఏప్రిల్ 2నుంచి ప్రభుత్వం వైపునుంచి క్రమం తప్పకుండా పత్రికా ప్రకటనలు వెలువడ్డాయని ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకోవడం జరిగిందని మే 26నుంచి సోర్స్ కోడ్ ను ఓపన్ డొమెయిన్లో అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ యాప్ రూపకల్పన వెనక వున్న అందరి పేర్లను మీడియాతో పంచుకోవడం జరిగిందని వారు వివరించారు.
ఆరోగ్యసేతు పోర్టల్ aarogyasetu.gov.in లో అన్ని వివరాలను చూడవచ్చని వారు చెప్పారు. పారదర్శకంగా దీన్ని తయారు చేయడం జరిగిందని అన్నారు. దీన్ని https://github.com/nic-delhi/AarogyaSetu_Android/blob/master/Contributors.md ద్వారా ప్రజలు ఉపయోగించుకోవచ్చు.
ఆరోగ్యసేత యాప్ ను 16.23 కోట్ల మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. కోవిడ్ 19పై పోరాటంలో భాగమైన ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకార్తలకు ఇది చక్కగా ఉపయోగపడింది. ఈ యాప్ ను ఉపయోగించే కోవిడ్ పాజిటివ్ వినియోగదారుల ద్వారా సమీపంలోని ఇతర వినియోగదారులకు సమాచారం వెలువడి వారు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతోంది. సమీపంలోని కోవిడ్ పాజిటివ్ రోగులకు సంబంధించిన సమాచారం రావడమే కాకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు కూడా పంపడం జరుగుతుంది. తద్వారా పరీక్షలు చేయించుకున్నవారిలో 25శాతానికి పాజిటివ్ రావడం జరిగింది. తద్వారా అంటే ఆరోగ్యసేతు యాప్ కారణంగా దేశంలో పరీక్షల సంఖ్య పెరిగింది. అంతే కాదు ఆరోగ్య సేతు ఐటిఐహెచ్ ఏ ఎస్ ఇంటర్ ఫేస్ అనేది కొత్తగా హాట్ స్పాట్లను గుర్తించడానికి దోహదం చేసింది. తద్వారా కోవిడ్ 19 కట్టడి అనేది మరింత మెరుగ్గా కొనసాగింది. కోవిడ్ 19 పై పోరాటానికి ఆరోగ్య సేతు యాప్ చాలా బాగా ఉపయోగపడిందని అధికారులు తెలిపారు. దేశంలో మహమ్మారిని కట్టడి చేయడానికిగాను ఆరోగ్యసేతుద్వారా జరిగిన కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.
****
(Release ID: 1669032)
Visitor Counter : 268