ఆర్థిక మంత్రిత్వ శాఖ
బీహార్ లో సోదాలు నిర్వహించిన - ఆదాయపు పన్ను శాఖ
Posted On:
30 OCT 2020 9:07PM by PIB Hyderabad
పాట్నా, భాగల్పూర్, హిల్సా, మరియు కతిహార్ కేంద్రంగా ఉన్న నాలుగు ప్రముఖ కాంట్రాక్టర్ గ్రూపుల కేసుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం 29.10.2020 తేదీన సోదాలు నిర్వహించింది. అదనంగా, గయాలో గనుల నుండి తీసిన రాళ్ళ వ్యాపారులపై కూడా సర్వేలు జరిగాయి.
ఈ నాలుగు గ్రూపులు ఎటువంటి సామాగ్రి సరఫరా మరియు కార్మికుల సేవల ఖర్చులను పెంచి చూపడం ద్వారా పన్నులను ఎగవేస్తున్నట్లు గుర్తించడం జరిగింది.
ఒక సందర్భంలో ఎటువంటి సేవలు లేదా సామాగ్రిని అందుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా వివిధ పార్టీలకు చెల్లింపులు జరిగాయి. బోగస్ పార్టీలకు చేసిన చెల్లింపులు, అన్-సెక్యూర్డ్ ఋణంలా తిరిగి తీసుకోవడం కానీ లేదా కొన్ని సార్లు నగదు లాగా స్వీకరించడం కానీ జరిగింది. ఇటువంటి రుణాలు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇంకా, గణనీయమైన సంఖ్యలో నకిలీ కొనుగోళ్ళు ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడ్డాయి. ఈ పార్టీలు ఉనికిలో లేవు, కానీ ఖాతా పుస్తకాల్లో ‘రుణదాతలు’ గా చూపించబడ్డాయి. అలాంటి రుణదాతలకు చెల్లించవలసిన మొత్తం సుమారు 20 కోట్ల రూపాయల వరకు ఉంది. కొన్ని బోగస్ పార్టీలకు చెందిన బ్యాంకు పత్రాలు, ఖాతాలతో పాటు నేరారోపణకు సంబంధించిన ఇతర సామగ్రిని కూడా మదింపుదారుని ప్రాంగణం నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలు, ఈ సందర్భంగా నిర్వహించిన క్షేత్ర పరిశోధనల్లో, ఈ పార్టీలు నిజమైనవి కావనీ, వీరి పేరుతో తెరిచిన ఖాతాలను కూడా మదింపుదారుడే నిర్వహిస్తున్నట్లు స్పష్టమయింది. ఈ కార్యకలాపాల ద్వారా జమ చేసిన నగదును ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు రుజువయ్యింది.
మరొక కేసులో స్వాధీనం చేసుకున్న పత్రాలు కూడా పెరిగిన ఖర్చుల కోసం చెల్లింపులు బేరర్ చెక్కుల ద్వారా చేసినట్లు తెలిసింది. ఈ చెల్లింపులు బ్యాంకు ఖాతా నుండి మదింపుదారుని సొంత వ్యక్తుల ద్వారా ఉపసంహరించారు. ఈ మొత్తాల లెక్కింపు కొనసాగుతోంది. ఈ రుణదాతల్లో సుమారు 15 కోట్ల రూపాయల మేర కార్మికులకు బాకాయిపడ్డ వేతనాలు కూడా ఉన్నాయి. సోదా చేస్తున్నప్పుడు ఇవి కూడా నకిలీవని తేలింది.
మరో గ్రూపులో సుమారు 15 కోట్ల రూపాయల మేర ఖర్చులను ఎక్కువ చేసి చూపించిన పత్రాలు లభ్యమయ్యాయి. ఈ బృందం బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలో ఆస్తులను కొనుగోలు చేసింది.
మరొక కేసులో, చెక్కుల ద్వారా నకిలీ కొనుగోళ్ళు చేసి, ఆ మొత్తాన్ని, తిరిగి నగదు రూపంలో స్వీకరించినట్లు లభించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగా జమ చేసిన నగదును, ఆస్తుల కొనుగోలు మరియు వాణిజ్య భవనం నిర్మాణంలో పెట్టుబడి పెట్టారు. సుమారు రూ. 10 కోట్లు, ఈ మోడస్ ఒపెరాండిని ఉపయోగించి కనుగొనబడింది. ఈ విధానాన్ని ఉపయోగించి కూడబెట్టిన సుమారు 10 కోట్ల రూపాయల మేర అక్రమ ఆదాయం బయటపడింది.
డైరీలు, కొనుగోలు దస్తావేజులు, రశీదులు, ఇతర పత్రాలు, నగదు రూపంలో చెల్లింపులు వంటి వివిధ నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సర్వే చేస్తున్న సమయంలో, 8 కోట్ల రూపాయల మేర లెక్కలోకి రాని నగదు ఎంట్రీలతో పాటు, లెక్కలోకి రాని అమ్మకాలు, కొనుగోళ్ళు వెలుగులోకి వచ్చాయి. వీటికి అదనంగా, రాళ్ళు మొదలైన సరకుల అమ్మకాలు, కొనుగోళ్ళ వివరాలు, ఖాతాల పుస్తకాలలో నమోదు చేయలేదన్న విషయం బయటపడింది.
ఈ సోదాల సమయంలో సుమారు 3.21 కోట్ల రూపాయల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు. 30 కోట్ల రూపాయల మేర ఫిక్సడ్ డిపాజిట్లను, 16 కోట్ల రూపాయల మేర ఇతర ఆస్తులను, నిషేధిత ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాల ఫలితంగా, ఇంతవరకు, లెక్కల్లోకి రాని, 75 కోట్ల రూపాయల మేర ఆదాయం బయటపడింది. కాగా, దర్యాప్తు కొనసాగుతోంది.
*****
(Release ID: 1668970)
Visitor Counter : 209