శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కరోనావైరస్ పై ప్రపంచంలోని మొట్టమొదటి సైంటూన్ పుస్తకం 'బై బై కరోనా'ను విడుదల చేసిన యూపి గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్
కోవిడ్-19పై ప్రజలకు ఆకర్షణీయమైన పద్దతి అవగాహన కల్పించేందుకు డిఎస్టీకి చెందిన విజ్ఞన్ ప్రసార్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఈ పుస్తకానికి ప్రాముఖ్యత కల్పించేందుకు, ఇతర భాషల్లోకి అనువదించేందుకు వీలుగా 3డి ప్రచురణను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
"భారతదేశంలో విడుదలైన తరువాత ఈ పుస్తకం బ్రెజిల్-ఇండియా నెట్‌వర్క్ ప్రోగ్రాం క్రింద బ్రెజిల్‌లో విడుదల అవుతుంది. పోర్చుగీస్ భాషలోకి పుస్తకం అనువదించబడుతుంది": డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ, రచయిత
Posted On:
29 OCT 2020 4:58PM by PIB Hyderabad
ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు సులభంగా అందించడానికి కార్టూన్లు ఉత్తమమైన మాధ్యమం. అవి మనల్ని చురుక్కుమనేలా చేయడంతో పాటు కఠినమైన సందేశాలను సరళమైన, సూక్ష్మమైన మరియు ఉత్సాహపూరితమైన పద్ధతిలో అందించగలవు. ఒక సందేశాన్ని మానవుడి మనస్సుకు చేరుకునేలా తీసుకువెళ్లడం కష్టమైన ప్రక్రియ. 'సైంటూన్' అనేది సైన్స్ ఆధారంగా చేపట్టిన కార్టూన్ మాధ్యమం. సైన్స్ మరియు శాస్త్రీయ వ్యవహారాల పట్ల ప్రజలకు ఆసక్తికరమైన మరియు సున్నితమైన తెలివైన మాధ్యమంలో తెలియజేయడానికి ఉద్దేశించినవి ఈ సైంటూన్లు.
లక్నోలోని సిఎస్‌ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిడిఆర్‌ఐ)లో మాజీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ రాసిన "బై బై కరోనా" అనే పుస్తకం ప్రపంచంలోని మొట్టమొదటి సైంటూన్ పుస్తకం. లక్నోలోని రాజ్ భవన్‌లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలోఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్త సంస్థ విజ్ఞన్ ప్రసర్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. విజ్ఞ్యాన్ ప్రసార్ డైరెక్టర్ డాక్టర్ నకుల్ పరాషర్, శాస్త్రవేత్త మరియు ప్రచురణ విభాగం అధిపతి నిమిష్ కపూర్‌లు ఈ పుస్తకానికి ప్రధాన సంపాదకుడు మరియు సంపాదకులు.
ఈ 220 పేజీల పుస్తకంలో కరోనావైరస్ మహమ్మారి దాని లక్షణాలు మరియు జాగ్రత్తల ద్వారా దాన్ని ఏవిధంగా నివారించవచ్చన్నదానిపై సమగ్ర సమాచారం ఉంది. ‘బై బై కరోనా’లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ విత్ కరోనావైరస్'పై చాలా ఆసక్తికరమైన అధ్యాయం ఉంది. కరోనాతో ఎక్కువ కాలం కలిసి ఉండాల్సిన నేపథ్యంలో రోజువారి జీవితంలో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నదానిపై ఈ అధ్యాయంలో వివరణలు ఉన్నాయి. పాఠకుడిని భయపెట్టకుండా భయంకరమైన మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కోవాలన్నదానిపై ఈ పుస్తకం అవసరైన దృక్పథాన్ని అందిస్తుంది.
"కొవిడ్-19 మహమ్మారి గురించి ప్రజలకు ఆసక్తికరమైన విధానంలో చెప్పడమేన ఈ పుస్తకం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం. మొదట్లో నేను కొన్ని సైంటూన్లు గీసి ఫేస్‌బుక్‌లో పెట్టాను. వాటిని గమనించిన డాక్టర్ నకుల్ పరాషర్ (డైరెక్టర్, విజ్ఞన్ ప్రసర్) సైంటూన్లతో కరోనా వైరస్‌పై పుస్తకం రూపొందించే ఆలోచన చేయమన్నారు. మొదట్లో నేను 50 పేజీల పుస్తకం కోసం ప్లాన్ చేసాను. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్‌లో ఒంటరిగా పని చేస్తున్నాను. ఈ విషయం యొక్క పరిధిని గుర్తించిన తర్వాత ఎక్కువ మంది వ్యక్తుల నుండి టూన్ సహకారాన్ని పొందాలని నిర్ణయించుకున్నాను. దాంతో చివరికి పుస్తకం 220 పేజీలతో తయారయిందని ” రచయిత డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయనతో పాటు మరో ఏడుగురు సైంటూనిస్ట్‌లు లకిషా ఇనాసియా సియోల్హో ఈ కోస్టా, డా కోస్టా మారియా సిమ్రాన్ బ్లూసూమ్, ప్రియాంక శంకే, సమరదిని పైగంకర్, సెల్సియా సావియా డా కోస్టాలు ఇందులో పని చేశారు. గోవా మాడ్గావ్‌కు చెందిన పార్వతిబాయి చౌగులే కాలేజ్ నుండి ప్రథమేస్, పి షెట్‌గోయోకర్‌లు కూడా ఈ పుస్తకానికి తమ సహకారం అందించారు. గుజరాత్‌లోని పాఠశాల ఉపాధ్యాయులు విశాల్ ములియా కూడా సహకారం అందించారు "భారతదేశంలో విడుదల అయిన తరువాత ఈ పుస్తకం బ్రెజిల్-ఇండియా నెట్‌వర్క్ ప్రోగ్రాం కింద త్వరలో బ్రెజిల్‌లో విడుదల కానుంది. అలాగే పోర్చుగీస్ భాషలోకి అనువదించబడుతుంది" అని డాక్టర్ శ్రీవాస్తవ సమాచారం ఇచ్చారు.
" పాఠకుడి దృష్టిని ఆకర్షించడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన మాధ్యమాల్లో చిత్రం ఒకటి. పాఠకుడికి ఉపయోగపడే మాధ్యమాలు, ప్రాతినిధ్యాలలో కార్టూన్‌లకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ రూపొందించిన బై బై కరోనా పుస్తకంలో కార్టూన్ ఆవశ్యకం కాబట్టి ఇది చాలా సందర్భోచితంగా ఉంది. అలాగే ఈ సమయంలో ఇది చాలా సందర్భోచితమైన టైటిల్" అని విజ్ఞన్ ప్రసార్ డైరెక్టర్ డాక్టర్ నకుల్ పరాషర్ అన్నారు.
"జనాదరణ పొందిన సైన్స్ పుస్తకాలను విజ్ఞాన్ ప్రసర్ తరచూ ముద్రణ చేస్తుంటుంది. అదే క్రమంలో వచ్చిన బైబై కరోనా పుస్తకం కార్టూన్ పాత్రల ద్వారా మహమ్మారిని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడే సాధనమవుతుంది. నివారణకు అవగాహన అనేది ఉత్తమమైన మార్గం కాబట్టి ఈ మహమ్మారి నుండి మమ్మల్ని రక్షించడానికి ఇది ఉత్తమమైన మార్గం ”అని విజ్ఞాన్ ప్రసర్ ప్రచురణ విభాగం అధిపతి నిమిష్ కపూర్ తెలిపారు.
భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో బహుళ భాషా అనువాదాన్ని సులభతరం చేయడానికి ఈ పుస్తకా 3 డి రూపంలో రూపొందించడానికి ప్రణాళికలురూపొందించబడ్డాయి. భాష మరియు వయస్సు, దేశాల సరిహద్దుల భేదం లేకుండా కొవిడ్-19 గురించి అందరూ విస్తృతంగా తెలుసుకునేందుకు ‘బై బై కరోనా’పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
****
(Release ID: 1668719)
Visitor Counter : 262