జల శక్తి మంత్రిత్వ శాఖ
విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ఆనకట్ట మెరుగుదల మరియు పునరావాస పథకం రెండో దశ కు, అలాగే మూడో దశ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
29 OCT 2020 3:49PM by PIB Hyderabad
ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయల కల్పన పెట్టుబడి బ్యాంకు (ఎఐఐబి)ల ఆర్థిక సహాయంతో చేపట్టే డ్యామ్ రిహాబిలిటేషన్, ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ (డిఆర్ఐపి) రెండో దశ, మూడో దశ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆనకట్టల భద్రతతో పాటు, ఆ ఆనకట్టల నిర్వహణ సంబంధిత పనితనాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థవారీ నిర్వహణ విధానంతో కూడిన సంస్థాపరమైన పటిష్టీకరణను దృష్టి లో పెట్టుకొని ఈ ప్రాజెక్టు ను అమలు చేయాలని సంకల్పించారు.
ఈ ప్రాజెక్టు వ్యయం 10,211 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టును 10 సంవత్సరాల కాలంలో- 2021 ఏప్రిల్ మొదలుకొని 2031 మార్చి నెల మధ్య కాలంలో - అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ మరీ జాప్యం అయిన పక్షంలో, మరో రెండు సంవత్సరాల కాలాన్ని కూడా లెక్క లోకి తీసుకొంటారు. అంటే, ఒక్కొక్క దశ కు ఆరు సంవత్సరాల కాలం ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 7,000 కోట్ల రూపాయల నిధులు బయటి నుంచి అందితే, మిగిలిన 3,211 కోట్ల రూపాయల వ్యయాన్ని సంబంధిత అమలు సంస్థలు (ఐఎ స్) భరించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వంతుగా 1,024 కోట్ల రూపాయల రుణం రూపంలో, 285 కోట్ల రూపాయలు సెంట్రల్ కంపోనెంట్ రూపంలో ఇవ్వనుంది.
డిఆర్ఐపి రెండో దశ, మూడో దశ ఈ లక్ష్యాలను సాధించడం కోసం ఉద్దేశించారు:
i. ఎంపిక చేసిన ప్రస్తుత ఆనకట్టల పనితనాన్ని, భద్రతను స్థిర ప్రాతిపదికన మెరుగుపరచడం.
ii. కేంద్ర స్థాయిలోను, భాగస్వామ్య రాష్ట్రాలలోను ఆనకట్ట భద్రతకు సంబంధించిన సంస్థాగత వ్యవస్థను బలపరచడం తో పాటు,
iii. ఎంపిక చేసిన ఆనకట్టల, సంబంధిత నిర్మాణాల నిర్వహణ కోసం వాటి రాబడిని పెంచే చర్యలను అన్వేషించడం.
పైన పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి డిఆర్ఐపి రెండో దశ, మూడో దశ లలో ఈ క్రింద పేర్కొన్న అంశాలను లెక్కలోకి తీసుకొన్నారు.
a. ఆనకట్టలు, వాటితో సంబంధం కలిగిన నిర్మాణాలకు మెరుగులు దిద్దడం,
b. ఆనకట్ట భద్రతకు సంబంధించిన వ్యవస్థాపరమైన పటిష్టతకు ఉద్దేశించిన చర్యలను చేపట్టడం.
c. ఎంపిక చేసిన కొన్ని ఆనకట్టల నిర్వహణ కోసం ఆదాయ మార్గాలను అన్వేషించడం, అలాగే
d. ప్రాజెక్టు నిర్వహణ.
ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 736 ఆనకట్టల ను సమగ్ర ప్రాతిపదికన పునర్ వ్యవస్థీకరించడం జరుగుతుంది. దీనికి గాను అమలు సంస్థ వారీగా పరిశీలించే ఆనకట్టల తాలూకు వివరాలు ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/ఏజెన్సీ
|
ఆనకట్టల సంఖ్య
|
1
|
ఆంధ్ర ప్రదేశ్
|
31
|
2
|
భాఖ్ డా బియాస్ మేనేజ్ మెంట్ బోర్డు (బిబిఎమ్ బి)
|
2
|
3
|
ఛత్తీస్ గఢ్
|
5
|
4
|
కేంద్ర జల సంఘం
|
|
5
|
దామోదర్ వేలీ కార్పొరేషన్
|
5
|
6
|
గోవా
|
2
|
7
|
గుజరాత్
|
6
|
8
|
ఝార్ ఖండ్
|
35
|
9
|
కర్నాటక
|
41
|
10
|
కేరళ
|
28
|
11
|
మధ్య ప్రదేశ్
|
27
|
12
|
మహారాష్ట్ర
|
167
|
13
|
మణిపుర్
|
2
|
14
|
మేఘాలయ
|
6
|
15
|
ఒడిశా
|
36
|
16
|
పంజాబ్
|
12
|
17
|
రాజస్థాన్
|
189
|
18
|
తమిళ నాడు
|
59
|
19
|
తెలంగాణ
|
29
|
20
|
ఉత్తర్ ప్రదేశ్
|
39
|
21
|
ఉత్తరాఖండ్
|
6
|
22
|
పశ్చిమ బెంగాల్
|
9
|
|
మొత్తం
|
736
|
***
(Release ID: 1668508)
Visitor Counter : 124