ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడులో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
29 OCT 2020 12:10PM by PIB Hyderabad
ఒక సివిల్ కాంట్రాక్టర్ సహా విద్యా సంస్థలు నడుపుతున్న ఒక గ్రూప్, వారి సహచరులకు చెందిన 22 నివాసాలు, కార్యాలయాల ఆవరణలలో ఆదాయపు పన్నుశాఖ బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు కోయంబత్తూర్, ఈరోడ్, చెన్నై, నమక్కల్‌లో జరిగాయి.
విద్యార్ధుల నుండి వసూలు చేసిన ఫీజులు సాధారణ ఖాతా పుస్తకాలలోని పుస్తకాలలో ప్రతిఫలించడం లేదన్న సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి.
సోదాల సందర్భంగా లభించిన ఆధారాలతో వసూలు చేసిన ఫీజును ఖాతా పుస్తకాలలో చూపడంలేదనే ఆరోపణ నిజమని తేలింది. ఈ లెక్కలలోకి రాని వసూళ్ళను ట్రస్టీల వ్యక్తిగత అకౌంట్లకు మళ్ళిస్తున్నారని, అవి తిరిగి ఒక కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెడుతున్నారని తేలింది. ఈ కంపెనీలో ఇతర వాటాదారులైన తిరుపూర్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్, జౌళి వ్యాపారి కూడా ఉన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షిస్తున్నారు.
నమక్కల్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ నివాసాలు, కార్యాలయాలలో సోదాలు జరుపుతున్న సందర్భంలో లేబర్ ఛార్జీలు, సరుకు కొనుగోలు వంటి బూటకపు ఖర్చులను చూపుతూ వ్యయ మొత్తాన్ని పెంచినట్టు తేలింది.
ఈ సోదాలలో సుమారు రూ. 150 కోట్ల మేరకు లెక్క చెప్పని పెట్టుబడులు, నగదు చెల్లింపులను గుర్తించారు. సుమారు రూ.5 కోట్ల మేరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని లాకర్లను ఇంకా తెరవ వలసి ఉంది. సోదాలు కొనసాగుతున్నాయి.
***
(Release ID: 1668422)
Visitor Counter : 185